Ambati Rambabu: ఏపీలో లా అండ్ ఆర్డర్ దారుణంగా పడిపోయింది..
ABN , Publish Date - Aug 08 , 2024 | 02:43 PM
Andhrapradesh: ఏపీలో లా అండ్ ఆర్డర్ దారుణంగా పడిపోయిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... ఒంటేరు నాగరాజు అనే వైసీపీ కార్యకర్తని కిడ్నాప్ చేశారన్నారు. మాచర్ల నియోజకవర్గానికి చెందిన నాగరాజు ప్రాణభయంతో వినుకొండ వచ్చారని తెలిపారు. పోలీసు వ్యవస్థ పని చేస్తోందా? అని ప్రశ్నించారు. ఎస్పీతో కూడా మాట్లాడామని అన్నారు.
అమరావతి, ఆగస్టు 8: ఏపీలో లా అండ్ ఆర్డర్ దారుణంగా పడిపోయిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... ఒంటేరు నాగరాజు అనే వైసీపీ కార్యకర్తని కిడ్నాప్ చేశారన్నారు. మాచర్ల నియోజకవర్గానికి చెందిన నాగరాజు ప్రాణభయంతో వినుకొండ వచ్చారని తెలిపారు. పోలీసు వ్యవస్థ పని చేస్తోందా? అని ప్రశ్నించారు. ఎస్పీతో కూడా మాట్లాడామని అన్నారు. నాగరాజుకు ఏ విధమైన హాని జరిగినా ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యత వహించాలన్నారు.
Rammohan Naidu: కేంద్రమంత్రి రామ్మోహన్‌ను అభినందించిన లోక్‌సభ స్పీకర్
బెయిల్ మీద బయట వచ్చి కూరగాయల వ్యాపారం చేసుకుంటున్నారని.. అలాంటి వ్యక్తిని కిడ్నాప్ చేశారని అన్నారు. నాగరాజు కుటుంబ సభ్యులను కొట్టి టీడీపీ గూండాలు కిడ్నాప్‌కు దిగారని మండిపడ్డారు. నడిరోడ్డు మీద హత్యలు, కిడ్నాప్‌లు జరుగుతున్నాయన్నారు. అసలు రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నట్టా? లేనట్టా? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని మణిపూర్, బీహార్‌లాగ మార్చారని విమర్శలు గుప్పించారు.
UPI Payments: యూపీఐ పేమెంట్స్ విషయంలో ఆర్బీఐ కీలక నిర్ణయం...
టీడీపీ నేతలు ఏం చేసినా పోలీసులు వారిని ఏమీ అనటానికి వీల్లేదని హోంమంత్రి నుంచే ఆదేశాలు వెళ్లాయన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని విరుచుకుపడ్డారు. ఆటవిక రాజ్యం కొనసాగుతోందన్నారు. పోలీసులు వెంటనే స్పందించి నాగరాజును కాపాడాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద.. 70 గేట్లు ఎత్తివేత
Read Latest AP News And Telugu News