Jogi Ramesh: మా అబ్బాయి తప్పేమీ లేదు...
ABN , Publish Date - Aug 13 , 2024 | 04:02 PM
Andhrapradesh: ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మా అబ్బాయి ఎటువంటి తప్పు చేయలేదు. అగ్రిగోల్డ్ భూముల విషయంపై బహిరంగ చర్చకు సిద్దం. మా కుటుంబం ప్రమేయం ఉన్నట్లు నిరూపిస్తే ఎటువంటి చర్యలకు అయినా సిద్దం....
విజయవాడ, ఆగస్టు 13: ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ మంత్రి జోగి రమేష్ (Former Ministe Jogi Ramesh) వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మా అబ్బాయి ఎటువంటి తప్పు చేయలేదు. అగ్రిగోల్డ్ భూముల విషయంపై బహిరంగ చర్చకు సిద్దం. మా కుటుంబం ప్రమేయం ఉన్నట్లు నిరూపిస్తే ఎటువంటి చర్యలకు అయినా సిద్దం. మా వాడు విదేశాల్లో చదువుకుని ఇక్కడకు వచ్చాడు. చంద్రబాబు రాజకీయాలకు మా వాడిని బలి చేస్తున్నారు. మీకు, మీ ఇంట్లో పిల్లలు ఉన్నారనేది గుర్తు ఉంచుకోండి. ఇక్కడితో అయిపోదు.. మాకు కూడా సమయం వస్తుంది’’ అని ఆయన అన్నారు.
Jogi Ramesh: జోగి రమేష్ అక్రమాలపై షాకింగ్ విషయాలు చెప్పిన ఏసీబీ
చంద్రబాబు అక్రమ కేసులతో వేధిస్తే భయపడమని స్పష్టం చేశారు. ఆనాడు కూడా జగన్మోహన్ రెడ్డిని టీడీపీ వాళ్లు బూతులు తిట్టారని.. ఆ అంశాలను చంద్రబాబుకు వివరించడానికే వాళ్ల ఇంటికి వెళ్లానని తెలిపారు. దానిని దాడిగా చిత్రీకరించి అడ్డుకున్నారన్నారు. తప్పకుండా న్యాయం గెలుస్తుందన్నారు. మావాడి పాత్ర లేదని రుజువు అవుతుంది అని జోగి రమేష్ స్పష్టం చేశారు.
ఇదీ జరిగింది...
కాగా... అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు జోగి రాజీవ్‌ను ఏసీబీఅధికారులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ కేసులో ఆయన నిందితుడిగా ఉండడంతో అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ కేసులో కొందరు నిందితులు ఉన్నారు. 1. జోగి రాజీవ్, 2. జోగి సోదరుడు వెంకటేశ్వరరావు, 3. అడుసుమిల్లి మోహన రంగ దాసు, 4. వెంకట సీతామహాలక్ష్మీ, 5. సర్వేయర్ దేదీప్య 6. మండల సర్వేయర్ రమేశ్, 7. డిప్యూటీ తహశీల్దార్ విజయ్ కుమార్, 8. విజయవాడ రూరల్ ఎమ్మార్వో జాహ్నవి, 9. విజయవాడ రిజిస్ట్రార్ నాగేశ్వరరావులు ఈ జాబితాలో ఉన్నారని అధికారులు తెలిపారు. కాగా మిగతా వారిని పోలీసులు త్వరలో విచారించే అవకాశం ఉంది. జయవాడ రూరల్ మండలంలోని అంబాపురంలో అగ్రిగోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారంలో జోగి కుటుంబం అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన అక్రమాలపై ఏడాది క్రితం అగ్రిగోల్డ్ యాజమాన్యం ఫిర్యాదు చేసినప్పటికీ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసులో కదలిక వచ్చింది.
Bangladesh violence: మాజీ ప్రధాని షేక్ హసీనాపై హత్య కేసు నమోదు
అంబాపురంలో సర్వే నెం. 88లోని 2160 గజాల అగ్రిగోల్డ్ స్థలాన్ని సీఐడీ గతంలోనే అటాచ్ చేసింది. వేరేవారి పేరుపై నకిలీ రిజిస్ట్రేషన్ చేసి మళ్లీ తమ పేరిట రిజిస్ట్రేషన్ చేసేందుకు జోగి రమేష్ కుట్ర చేసినట్లు రెవెన్యూ నివేదికలో తేటతెల్లమైంది. వేరే వారి దగ్గర నుంచి ఈ స్థలాన్ని జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్, జోగి సోదరుడు వెంకటేశ్వరరావు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మళ్లీ ఈ స్థలాన్ని విజయవాడకు చెందిన వేరే వారికి అమ్మేశారు. ఈ విషయంలో తమ పేరు బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు. ఈ వ్యవహారంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలు ప్రసారం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో అప్పటి మంత్రి జోగి రమేష్ ఉన్నారని అధికారులు చెబుతున్నారు. మొత్తం రూ. 7 కోట్లు విలువైన స్థలం కబ్జా అయినట్లు అధికారులు లెక్క తేల్చారు.
ఇవి కూడా చదవండి...
Anagani: ఫ్రీహోల్డ్ అసైన్డ్ భూముల రిజిస్ర్టేషన్ల నిలిపివేతకు కారణమిదే
YS Sharmila: ఆదాని మోడీ బినామీ.. షర్మిల సంచలన వ్యాఖ్యలు
Read Latest AP News And Telugu News