High Court: ఏపీ ప్రభుత్వానికి హై కోర్టు నోటీసులు
ABN , Publish Date - Jan 10 , 2024 | 12:28 PM
అమరావతి: ప్రభుత్వం ఇచ్చే సర్టిఫికేట్‌లపై సీఎం జగన్ బొమ్మ, నవరత్నాల కార్యక్రమం ప్రింట్ చేయడంపై ప్రభుత్వానికి హై కోర్టు నోటీసులు ఇచ్చింది. సర్టిఫికెట్లపై సీఎం బొమ్మలు వేయడాన్ని సవాల్ చేస్తూ...
అమరావతి: ప్రభుత్వం ఇచ్చే సర్టిఫికేట్‌లపై సీఎం జగన్ బొమ్మ, నవరత్నాల కార్యక్రమం ప్రింట్ చేయడంపై ప్రభుత్వానికి హై కోర్టు నోటీసులు ఇచ్చింది. సర్టిఫికెట్లపై సీఎం బొమ్మలు వేయడాన్ని సవాల్ చేస్తూ అమరావతి బహుజన జేఏసీ చైర్మన్ పోతుల బలకోటయ్య హైకోర్టులో ఫిటిషన్ వేశారు. దీనిపై బుధవారం న్యాయస్థానం విచారణ జరిపింది. పిటీషనర్ తరపున సీనియర్ కౌన్సిల్ వైవి రవి ప్రసాద్, ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. కుల, నివాస, ఆదాయ సర్టిఫికెట్లపై సీఎం జగన్ బొమ్మ, నవరత్నాల కార్యక్రమం ప్రింట్ చేస్తున్నారని తెలిపారు.
ప్రభుత్వం ఇచ్చే సర్టిఫికెట్లపై కేవలం జాతీయ చిహ్నం, లేదా రాష్ట్ర ఎంబ్లామ్ మాత్రమే ఉండాలని న్యాయవాదులు వాదనలు వినిపించారు. ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవో నిబంధనలకు ఇది పూర్తి విరుద్ధమని అన్నారు. సర్టిఫికెట్లు తీసుకునే ప్రజలను ప్రభావితం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. వాదనలు విన్న అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గ్రామ వార్డ్ సచివాలయం ప్రిన్సిపుల్ సెక్రటరీ, సోషల్ వెల్ఫేర్ సెక్రటరీలకు నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశిస్తూ.. తదుపరి కేసు విచారణ వాయిదా వేసింది.