Share News

Keshineni Chinni: జగన్‌కు ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా మారలేదు: కేశినేని చిన్ని

ABN , Publish Date - Jun 18 , 2024 | 11:04 AM

విజయవాడ: మాజీ సీఎం జగన్ ఈవీఎంలపై చేసిన వ్యాఖ్యలపై విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఫైర్ అయ్యారు. ప్రజలు తగిన బుద్ధి చెప్పినా జగన్ ఇంకా మారలేదని, ఇప్పుడు ఈవీఎంల పేరు చెప్పి రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు.

Keshineni Chinni: జగన్‌కు ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా  మారలేదు: కేశినేని చిన్ని

విజయవాడ: మాజీ సీఎం జగన్ (Ex CM Jagan) ఈవీఎం (EVM)లపై చేసిన వ్యాఖ్యలపై విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (TDP MP Keshineni Shivnath) (చిన్ని) ఫైర్ (Fire) అయ్యారు. ప్రజలు తగిన బుద్ధి చెప్పినా జగన్ ఇంకా మారలేదని, ఇప్పుడు ఈవీఎంల పేరు చెప్పి రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్బంగా మంగళవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... గత ఎన్నికలలో ఇదే ఈవీఎంలు అద్భుతం అని చెప్పలేదా? అని ప్రశ్నించారు. ఇప్పుడు ఓటమితో తప్పులు ఒప్పులేక జగన్ ఈవీఎంలపై నెపం నెడుతున్నారని దుయ్యబట్టారు.


బటన్ నొక్కగానే ఏ గుర్తు అనేది కూడా స్పష్టంగా కనిపించిందని, ప్రజలంతా జగన్ పాలన వద్దని తగిన గుణపాఠం చెప్పారని కేశినేని చిన్ని అన్నారు. భ్రమలు‌వీడి, ప్యాలస్ నుంచి బయటకి రావాలన్నారు. ప్రజా జీవితంలోకి వస్తే ఇప్పుడు అయినా వాస్తవాలు తెలుస్తాయన్నారు. విశాఖ భవంతుల ఉదంతం బయటకు వస్తే ఆ 11 సీట్లు కూడా వైసీపీకి వచ్చేవి కావన్నారు. ప్రజాధనం రూ. 500 కోట్లు దుర్వినియోగం చేశారని.. బాత్రూంకు రూ. ఐదు కోట్లా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఎంను కోరుతామన్నారు. జగన్ వాస్తవంలోకి వస్తే మంచిది... లేదంటే మూడు నెలల్లో వైసీపీ కనుమరుగు కావడం ఖాయమని అన్నారు.


జగన్ ‌ జీవితం అబద్దాలు, మోసాల మయమని, దోచుకున్న ప్రజా ధనాన్ని పూర్తిగా కక్కిస్తామని కేశినేని చిన్ని స్పష్టం చేశారు. కొంతమంది అధికారులు జగన్‌కు అంటకాగారని.. ‌వారి సంగతి కూడా బయటకి వస్తుందని, జగన్‌కు త్వరలోనే జైలు జీవితం ఖాయమని ఆయన అన్నారు. పదేళ్లుగా కోర్టుకు వెళ్లకుండా వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని, చట్టం, న్యాయ పరంగా పాలన ద్వారా రాష్ట్రాన్ని గాడిలో పెడతామన్నారు. జగన్ ఇప్పటికైనా కళ్లు తెరిచి బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ సారధ్యంలో ఎపీ అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తారన్నారు. ‘జగన్ ఓ ఫర్నిచర్ దొంగ.. ఇప్పుడయినా వాటిని అప్పగించు’ గతంలో‌ కోడెలను ఇబ్బంది పెట్టిన పాపం ఎవరూ మరచిపోరని కేశినేని నాని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏలూరు జిల్లా: అత్తా, కోడలు ఆత్మహత్యయత్నం..

అనంతపురం జిల్లాలో అరుదైన పుట్టగొడుగు

కోడెల చేస్తే తప్పు.. జగన్‌ చేస్తే ఒప్పా?

కూడబలుక్కుని కూల్చేశారు!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 18 , 2024 | 11:08 AM