Kesineni Chinni: లక్షన్నర మెజారిటీతో గెలిపిస్తా..
ABN , Publish Date - Jan 11 , 2024 | 12:53 PM
విజయవాడ: టీడీపీకి రాజీనామా చేసిన ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీ తనకు సీటు ఇస్తే విజయవాడ ఎంపీగా గెలచితీరుతానని అంటున్నారని, అలాగే టీడీపీ తరఫున కేశినేని చిన్నికి సీటు వస్తే అన్నాదమ్ములు ఇద్దరూ పోటీ పడతారా? అన్న..
విజయవాడ: టీడీపీకి రాజీనామా చేసిన ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీ తనకు సీటు ఇస్తే విజయవాడ ఎంపీగా గెలచితీరుతానని అంటున్నారని, అలాగే టీడీపీ తరఫున కేశినేని చిన్నికి సీటు వస్తే అన్నాదమ్ములు ఇద్దరూ పోటీ పడతారా? అన్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధి ప్రశ్నకు సమాధానంగా చిన్ని మాట్లాడుతూ.. తెలుగుదేశం తరఫున చంద్రబాబు నాయుడు ఒక కార్యకర్తను నిలబెట్టినా లక్షన్నర ఓట్ల మెజారిటీతో గెలుస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేశినేని నాని, జగన్.. ఎవరన్నా కానీ.. ఇక్కడ ఏడు నియోజకవర్గాలను టీడీపీ కైవశం చేసుకుంటుందన్నారు.
కేశినేని నాని అహంకారంతో గొడవపడి అందరినీ దూరం చేసుకున్నారని చిన్ని అన్నారు. తాను మాత్రం పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నామని చెప్పారు. తన సోదరుడు చాలా సార్లు విమర్శలు చేశారని, అయినా తాను ఎప్పుడూ విమర్శించలేదని అన్నారు. తన భార్యపై ఒక స్టిక్కర్ చేసి పెట్టారని, ఒక ఎంపీగా ఆయన చేయవచ్చా? అని ప్రశ్నించారు. చాలా సార్లు మీడియాతో రకరకాలుగా తనపై, తన కుటుంబంపై అవమానం చేస్తూ మాట్లాడారని.. అయినా తాను ఏ రోజూ మాట్లాడలేదని కేశినేని చిన్ని పేర్కొన్నారు.