Share News

Liquor Lottery: ఏపీలో లిక్కర్ సిండికేట్ బరితెగింపు..

ABN , Publish Date - Oct 15 , 2024 | 07:12 AM

లాటరీలో మద్యం షాపులు దక్కించుకున్న లైసెన్సీలకు బెదిరింపులు మొదలయ్యాయి. కొన్ని నియోజకవర్గాల్లో తమవారికి షాపులు రాకపోవడంతో ఎమ్మెల్యేల అనుచరులు రంగంలోకి దిగారు. వ్యాపారంలో కచ్చితంగా వాటా కావాలని లేదంటే వ్యాపా రం ఎలా చేస్తారో చూస్తామంటూ హెచ్చరిస్తున్నారు.

Liquor Lottery: ఏపీలో లిక్కర్ సిండికేట్ బరితెగింపు..

అమరావతి: ఏపీలో లిక్కర్ సిండికేట్ (Liquor Syndicate) బరితెగిస్తోంది. అక్కీడీప్‌లో మద్యం దుకాణాలు దక్కించుకున్నవారిని కొందరు ఎమ్మెల్యేలు బెదిరింపులకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. వ్యాపారం ఎలా చేస్తారో చూస్తామంటూ ఇప్పటికే పలువురికి వార్నింగ్ కూడా వెళ్లడంతో లాటరీ విజేతలు (Lottery winners) భయపడుతున్నారు. లైసెన్స్ ఫీజు చెల్లిస్తే తర్వాత తమ పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

లాటరీలో మద్యం షాపులు దక్కించుకున్న లైసెన్సీలకు బెదిరింపులు మొదలయ్యాయి. కొన్ని నియోజకవర్గాల్లో తమవారికి షాపులు రాకపోవడంతో ఎమ్మెల్యేల అనుచరులు రంగంలోకి దిగారు. వ్యాపారంలో కచ్చితంగా వాటా కావాలని లేదంటే వ్యాపా రం ఎలా చేస్తారో చూస్తామంటూ హెచ్చరిస్తున్నారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కడప, కర్నూలు, పల్నాడు జిల్లాల్లో ఈ బెదిరింపుల పర్వం కనిపిస్తోంది. దీంతో లైసెన్సులు వచ్చినా ఫీజులు చెల్లించాలా.. వద్దా.. అనే సందిగ్ధత లైసెన్సీల్లో నెలకొంది. అధికారులు వెంటనే ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లా రు. దీనిపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లైసెన్సులు దక్కించుకున్నవారిని ఇబ్బంది పెడితే ఎవరినీ ఉపేక్షించవద్దని హెచ్చరికలు జారీ చేశా రు. అటు పార్టీ, ఇటు ప్రభుత్వం రెండు వైపుల నుంచీ ఫోన్లు చేసి సీఎం ఆదేశాలను చేరవేస్తున్నారు.


కాగా రాష్ట్రవ్యాప్తంగా 3,396 మద్యం షాపులకు నోటిఫికేషన్‌ జారీచేయగా 89,882 దరఖాస్తులు వచ్చాయి. సోమవారం అన్ని జిల్లాల్లో కలెక్టర్ల పర్యవేక్షణలో లాటరీ ద్వారా లైసెన్సీలను ఎంపిక చేశారు. సాంకేతికంగా చిన్నపాటి పొరపాట్లు మినహా ఎక్కడా గొడవలు, వివాదాలు లేకుండా ప్రక్రియను సజావుగా నిర్వహించారు. మధ్యాహ్నం 3.30గంటల కల్లా మొత్తం షాపులకు లైసెన్సీల ఎంపిక పూర్తయింది. లాటరీలో దుకాణం దక్కిన వారికి అప్పటికప్పుడే లైసెన్సు పత్రాలు అందజేశారు. ఆ వెంటనే లైసెన్సు ఫీజు చెల్లించే ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం ఫీజును ఏడాదికి ఆరు విడతల్లో చెల్లించాలి. లైసెన్సు పొందిన 24 గంటల్లోపు మొదటి విడత ఫీజు చెల్లించిన వారు వెం టనే షాపులు ప్రారంభించుకోవచ్చు. లాటరీ తగిలి న వారిలో అత్యధికులు అప్పటికప్పుడే తొలివిడత ఫీజు లు చెల్లించి.. షాపుల ఏర్పాటు మొదలుపెట్టేశారు.


మహిళలకు 10శాతం షాపులు

సిస్టర్‌ సెంటిమెంట్‌, మదర్‌ సెంటిమెంట్‌... ఇలా మహిళల పేరిట భారీగా దరఖాస్తులు సమర్పించారు. సుమారు 350 షాపులు... అంటే 10.2 శాతం మహిళలకే దక్కాయి. విశాఖపట్నంలో అత్యధికంగా 20శాతం షాపులు మహిళలకు దక్కాయి. అనకాపల్లిలో 18.4శాతం, మన్యంలో 17.3, ఎన్టీఆర్‌లో 17.7, శ్రీకాకుళంలో 15.2, విజయనగరంలో 15.7, నెల్లూరులో 13.2శాతం షాపులు మహిళలకు దక్కాయి.

వారంలోపే రూ.99 మద్యం

కొత్త పాలసీలో క్వార్టర్‌ రూ.99 ధరతో మద్యం అందుబాటులోకి తెస్తామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. ఆ హామీని వారంలోపు అమల్లోకి తెచ్చేందుకు ఎక్సైజ్‌ శాఖ చర్యలు చేపట్టింది. నాలుగు జాతీయ కంపెనీలు రూ.99కి మద్యం సరఫరా చేసేందుకు ముందుకొచ్చాయి. ఆ కంపెనీల మద్యం ఇప్పటికే ఇతర రాష్ర్టాల్లో అమ్ముడువుతోంది. తొలుత 2లక్షల కేసులు షాపులకు సరఫరా చేసి, వినియోగదారుల స్పందన ఆధారంగా కేసులు పెంచాలని భావిస్తున్నారు. అలాగే త్వరలో ధరల సవరణకు కమిటీని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త బ్రాండ్లు, ఉన్న బ్రాండ్లపై ధరల సవరణను ఆ కమిటీ నిర్ణయిస్తుంది. ఆ తర్వాత కొత్త ధరలు అమల్లోకి వస్తాయి.

దండిగా దరఖాస్తుల ఆదాయం

దరఖాస్తు రుసుము రూ.2లక్షలు చేసినా వ్యాపారులు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. 2015-17 పాలసీలో 65,208 దరఖాస్తుల ద్వారా రూ.225కోట్ల ఆదాయం వచ్చింది. 2017-19 పాలసీలో 76,329 దరఖాస్తులు, రూ.422 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ పాలసీలో ఏకంగా 89,882 దరఖాస్తులు రావడంతో రూ.1798 కోట్ల ఆదాయం వచ్చింది.

ఫలించిన చెల్లి సెంటిమెంట్‌..

అద్దంకి నియోజకవర్గం సంతమాగులూరు మండల పరిధిలోని షాపు నెంబరు 95ను సీఏ ఫైనలియర్‌ చదువుతున్న కొప్పాక తులసి దక్కించుకున్నారు. చెల్లి పేరు మీద దరఖాస్తు చేస్తే కలిసొస్తుందన్న నమ్మకంతో ఆమె అన్న తులసి పేరు మీద ఒకే ఒక్క దరఖాస్తు సమర్పించారు. అదృష్టలక్ష్మి ఆమెనే వరించింది. తాను దాచుకున్న పాకెట్‌మనీ కూడా కొంత దరఖాస్తు ఫీజులో కలిపానని తులసి తెలిపా రు.

ఎస్పీవై రెడ్డి కుమార్తె హవా

దివంగత నంద్యాల మాజీ ఎంపీ, ప్రముఖ పారిశ్రామికవేత ఎస్పీవై రెడ్డి కుమార్తె సన్నపురెడ్డి సుజల వివిధ జిల్లాల్లో దుకాణాలు దక్కించుకున్నారు. కర్నూలులో ఒకటి, అన్నమయ్య జిల్లా ఆరు, అనంతపురం జిల్లాలో 4 సహా, పీలేరు నియోజకవర్గంలోనూ షాపులు దక్కించుకున్నారు.

నెల్లూరు జిల్లాలో రాష్ట్ర పురపాలక మంత్రి పి.నారాయణ తన సొంత డబ్బులు రూ.2 కోట్లు వెచ్చించి వంద మంది కార్యకర్తల ద్వారా మద్యం షాపులకు దరఖాస్తులు వేయించారు. వారిలో ముగ్గురికే షాపులు దక్కాయి. దీంతో ఒక్కో షాపును ఆరుగురు డివిజన్‌ ఇన్‌చార్జులకు చొప్పున మొత్తం 18 మందికి ఆయన అప్పగించి చట్టబద్ధంగా వ్యాపారం చేసుకొని జీవించాలని సూచించారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు స్టేషన్‌ పరిధిలోని ఒక వైన్‌షాపు లాటరీలో ఓసీ కేటగిరీ వ్యక్తికి దక్కింది. అయితే అతను ఎస్‌టీ కాదని గుర్తించిన అధికారులు దానిని రద్దు చేసి మరొకరికి(లాటరీలో గెలిచిన రెండో వ్యక్తి) కేటాయించారు.

కాకినాడ జిల్లాలో కొందరు వ్యాపారులు 100 దుకాణాలకు దరఖాస్తులు చేయగా 4 షాపులు దక్కా యి. దుకాణాలు దక్కించుకున్నవారి తొలి విడత వా యిదా డబ్బును ఎస్‌బీఐ కౌంటర్లలో జమచేసే క్రతు వు రాత్రి వరకు కొనసాగింది.

కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని ఒకటో నెంబరు మద్యం దుకాణాన్ని కర్ణాటకకు చెందిన మహే్‌షబాటే, రెండో నెంబరు షాపును ఉత్తరప్రదేశ్‌కు చెందిన లోకేశ్‌చంద్‌ దక్కించుకున్నారు. దీంతో ఆ షాపులను తమ కు ఇవ్వాలని వారితో వ్యాపారులు బేరాలకు దిగారు. ఏలూరు జిల్లాలో 144 దుకాణాలు ఉండగా, అత్యధికంగా కొత్త వారికే దక్కాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

రేపటికల్లా తుఫాన్‌..

లోన్‌ ఇప్పించి మరీ రూ.20 లక్షల సైబర్‌ దోపిడీ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 15 , 2024 | 07:12 AM