Mantena: ఏపీఐఐసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మంతెన
ABN , Publish Date - Oct 05 , 2024 | 11:43 AM
Andhrapradesh: ‘‘నన్ను నమ్మి ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, మంత్రి లోకేష్ బాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు, కూటమి పెద్దలకు నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు’’ అని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు ఏపీఐఐసీ ద్వారా...
అమరావతి, అక్టోబర్ 5: ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా (ఏపీఐఐసీ) మంతెన రామరాజు (APIIC Chairman Mantena Ramaraju) శనివారం ఉదయం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంతెన మాట్లాడుతూ.. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఏపీఐఐసీ ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ‘‘నన్ను నమ్మి ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి (CM Chandrababu Naidu), మంత్రి లోకేష్ బాబుకు (Minister lokesh), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు(Deputy CM Pawan Kalyan), కూటమి పెద్దలకు నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు’’ అని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు ఏపీఐఐసీ ద్వారా కియా, హీరో ఇలా ఎన్నో పరిశ్రమలు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని గుర్తుచేశారు.
Canada: కెనడాలో దారుణం.. ఏ ఎన్నారైకీ ఈ కష్టం రాకూడదు!
2019-2024 మధ్య వచ్చిన ప్రభుత్వం ఏపీఐఐసీని నిరుపయోగం చేశారని మండిపడ్డారు. మరలా 2024లో వచ్చిన కూటమి ప్రభుత్వం పారిశ్రామికవేత్తలందరికీ ఏపీఐఐసీని అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దుతామన్నారు. మంత్రులు అందరి సహకారంతో ప్రతి నియోజకవర్గంలో ఏపీఐఐసీకి సంబంధించి ఒక లేఔట్ తయారుచేసి ప్రభుత్వం ద్వారా నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తామని వెల్లడించారు. ముఖ్యంగా ఎన్డీఏ కూటమి 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగిందని.. అందులో భాగంగానే మంత్రులందరూ పనిచేస్తున్నారన్నారు. వంద రోజులు పూర్తయ్యేలోగానే చాలా పరిశ్రమలను పారదర్శకంగా ముందుకు తీసుకువెళ్ళటం జరిగిందని మంతెన రామరాజు పేర్కొన్నారు.
KTR: రుణమాఫీ ఎగ్గొట్టి, మూసీ రాజకీయాలు.. కాంగ్రెస్‌పై కేటీఆర్ మండిపాటు
కొల్లురవీంద్ర శుభాకాంక్షలు..
ఏపీఐఐసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మంతెన రాంబాబు రాజు(రామ రాజు)కు రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు ఉదయం ఏపీఐఐసీ కార్యాలయానికి వెళ్లిన మంత్రి కొల్లు.. మంతెనను కలిసి తెలిపారు. ఆపై ఆయనను సత్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడుల ఆకర్షణకు పెద్దపీట వేయాలని విన్నవించారన్నారు. ఉన్నత విలువలతో రాజకీయం చేసే రామరాజు లాంటి వ్యక్తి ఏపీఐఐసీ లాంటి కీలక వ్యవస్థలో ఉండటం సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు. రామరాజు నాయకత్వంలో పెట్టుబడులకు గమ్యస్థానంలా ఆంధ్రప్రదేశ్ మారబోతోందని మంత్రి కొల్లు రవీంద్ర ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
రూ.100 కోట్లకు మరో దావా వేస్తా
Rammohan Naidu: సిట్టు గిట్టు లేదనడం ఎంతవరకు సంస్కారం
Read Latest AP News And Telugu News