YCP: సీఎం జగన్‌పై విసిరిన రాయి ఘటనపై పలు అనుమానాలు..
ABN , Publish Date - Apr 14 , 2024 | 08:59 AM
అమరావతి: వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విజయవాడ, సింగ్‌నగర్‌లో జరిగిన రాయి దాడి ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం రోడ్డు షో సందర్బంగా పలు మార్లు విద్యుత్ సరఫరా నిలిపి వేయడంపై కూడా పలు సందేహాలు వస్తున్నాయి.
అమరావతి: వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై (CM Jagan) విజయవాడ (Vijayawada), సింగ్‌నగర్‌లో జరిగిన రాయి (Stone) దాడి ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం రోడ్డు షో (CM Road Show) సందర్బంగా పలు మార్లు విద్యుత్ సరఫరా (Power supply) నిలిపి వేయడంపై కూడా పలు సందేహాలు వస్తున్నాయి. ఖచ్చితత్వంతో రాయి తగలడంపై కాట్ బాల్ వాడి ఉంటారని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీవీఐపీ (VVIP) వాహనం చుట్టూ ఉండే రోప్ పార్టీ ఎందుకు లేదని మాజీ పోలీస్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
విద్యుత్ సరఫరా లేని సమయంలో బుల్లెట్ ప్రూఫ్ షీట్లు వాడాల్సిన సీఎం సెక్యూరిటీ.. రాయి తగిలిన ఘటన జరిగిన తరువాత కూడా బస్ వద్ద జనాన్ని పోలీసులు క్లియర్ చేయలేదు. సమీపంలో ఏవైనా సీసీ కెమెరాలు ఉన్నాయోమోనని పరిశీలిస్తున్నారు. కాగా జగన్‌కు రాయి తగిలిన చోట వైద్యులు బస్ లోనే రెండు సార్లు చికిత్స చేసారు. అంతా అయిపోయాక ప్రభుత్వాసుపత్రికి వెళ్ళాలని ప్లాన్ చేశారు. అక్కడ చికిత్స తరువాత మళ్ళీ కేసరపల్లి క్యాంప్‌కు జగన్ వెళ్లిపోయారు. కాగా ముఖ్యమంత్రికి తగిలింది స్వల్ప గాయమేనని ప్రభుత్వాసుపత్రి వైద్యులు చెప్పారు. కాగా ఈ రోజు బస్ యాత్రకు సీఎం జగన్ బ్రేక్ ఇచ్చారు.
జగన్‌పై రాయి దాడి.. స్వల్ప గాయం
వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన చేపడుతున్న బస్సు యాత్రలో కలకలం రేగింది. శనివారం రాత్రి ఆగంతుకులు ఆయనపై రాయి విసిరారు. గుర్తుతెలియని వ్యక్తి పూలతో పాటు రాయిని విసిరాడు. దీంతో ఎడమ కంటికి తగలడంతో స్వల్ప గాయమైంది. దీంతో వైద్యులు బస్సులోనే చికిత్స అందించారు. చికిత్స అనంతరం జగన్ బస్సు యాత్రను కొనసాగించారు. సింగ్ నగర్ డాబా కోట్ల సెంటర్‌లో ఈ ఘటన జరిగింది.