Share News

AP News: మెగా వికసిత్ జాబ్ మేళా.. తరలివచ్చిన యువత

ABN , Publish Date - Dec 28 , 2024 | 11:42 AM

Andhrapradesh: ‘‘మన రాష్ట్రం వెనకపడి ఉంది కానీ.. మన అదృష్టం సీఎంగా చంద్రబాబు ఉన్నారు. విజన్ 2020 అంటే నవ్వారు.. కానీ ఐటీ కంపెనీలే మన రాష్ట్రం వైపు చూస్తున్నాయి’’ అని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. దేశంలో రెండు పెద్ద నగరాలు నిర్మించిన ఘనత చంద్రబాబుకే దక్కిందని.. ఒకటి హైదరాబాద్, అమరావతి అని తెలిపారు.

AP News: మెగా వికసిత్ జాబ్ మేళా.. తరలివచ్చిన యువత
Mega Vikasith Job Fair

విజయవాడ, డిసెంబర్ 28: విజయవాడలో మెగా వికసిత్ జాబ్ మేళా ఘనంగా నిర్వహించారు. మెగా వికసిత్ జాబ్ మేళాలో 60 కంపెనీలు పాల్గొన్నాయి. మెగా వికసిత్ జాబ్ మేళాను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని (MP Kesineni Shivanath), ఎమ్మెల్యేలు బోండా ఉమ (Bonda Uma), గద్దె రామ్మోహన్ (Gadde Rammohan) ప్రారంభించారు. మెగా జాబ్ మేళాకు అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. 2000 వేల మంది ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోగా, ఆఫ్‌లైన్ ద్వారా 3000ల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ.. ‘‘మన రాష్ట్రం వెనకపడి ఉంది కానీ.. మన అదృష్టం సీఎంగా చంద్రబాబు (CM Chandrababu Naidu) ఉన్నారు. విజన్ 2020 అంటే నవ్వారు.. కానీ ఐటీ కంపెనీలే మన రాష్ట్రం వైపు చూస్తున్నాయి’’ అని తెలిపారు. దేశంలో రెండు పెద్ద నగరాలు నిర్మించిన ఘనత చంద్రబాబుకే దక్కిందని.. ఒకటి హైదరాబాద్, అమరావతి అని తెలిపారు. జనవరి 5న ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ అవగాహన సదస్సు జరుగుతుందన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే దానికి ఏ విధంగా డీపీఆర్‌వోలు తయారు చేయాలి అనేది అవగాహన కల్పిస్తామన్నారు. ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా జాబ్ మేళా ఏర్పాటు చేస్తామని చెప్పారు. కేవలం ఐటీ వాళ్ళకే కాకుండా 10వ తరగతి చదువుకున్న వారికి కూడా జాబ్ రావాలని కేశినేని శివనాథ్ అన్నారు.

Tirumala: నవంబర్‌‌లో శ్రీవారిని ఎంత మంది దర్శించుకున్నారంటే


ఇది మంచి అవకాశం: గద్దె రామ్మోహన్

gadde-rammohan.jpg

యువతను అభివృద్ధి చేస్తే దేశం అభివృద్ధి చెందుతుందని నాయకుడు చంద్రబాబు నమ్ముతారని.. సీఎం ఆలోచనలో భాగంగానే ఈ మెగా వికసిత్ జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతీ యువతకి జాబ్ ఇవ్వాలనే ఉద్ధేశంతో జాబ్ మేళా ఏర్పాటు చేశామన్నారు. యువతకి ఇది మంచి అవకాశమని ఎమ్మెల్యే వెల్లడించారు.


గతంలో ఎప్పుడూ చూడలేదు: బోండా ఉమా

bonda-uma.jpg

మెగా వికసిత్ జాబ్ మేళా నిర్వహిస్తున్న ఎంపీ కేశినేని చిన్నికి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రం విడిపోయినప్పుడు సీఎం చంద్రబాబు కృషి అమోఘమన్నారు. రాష్ట్రంలోనే ఐటీ ఉద్యోగాలు ఉండాలని ముఖ్యమంత్రి ఆనాడే భావించారని.. హెచ్‌సీఎల్‌ను ఏపీకి తీసుకువచ్చారన్నారు. అనేక ఐటీ కంపెనీలను కూడా తీసుకొచ్చారని తెలిపారు. ఒక ఎంపీ.. యువత కోసం జాబ్ మేళా ఏర్పాటు చేయటం గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. ఈ రోజు మూడు వేల మందికి జాబ్‌లు వచ్చే విధంగా జాబ్ మేళా ఏర్పాటు చేయటం సంతోషంగా ఉందన్నారు. ఇప్పుడు జాబ్ రాని వారు బాధపడాల్సిన పని లేదని.. ఇటువంటి జాబ్ మేళా ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. మెగా వికసిత్ జాబ్ మేళా ఆధ్వర్యంలో అనేకం ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే బొండా ఉమా వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

ఈ పొలిటికల్ స్టార్‌కు బాగా కలిసొచ్చిన కాలం

బియ్యం మాయం కేసులో అనుమానాలెన్నో..

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 28 , 2024 | 11:48 AM