Anangani: ఎన్నికల హామీల అమలుకు అద్దం పట్టే బడ్జెట్ ఇది
ABN , Publish Date - Nov 11 , 2024 | 02:36 PM
Andhrapradesh: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందించారు. సూపర్ సిక్స్ పథకాల అమల్లో భాగంగా మరో రెండు పథకాలైన అమ్మ ఒడి, ఉచిత బస్సు పథకానికి ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించండం సంతోషకర విషయమన్నారు. రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చేందుకు నీటిపారుదల శాఖకు గత ప్రభుత్వం కంటే రెండు రెట్ల అదనపు నిధులు...
అమరావతి, నవంబర్ 11: ఎన్నికల హామీల అమలుకు అద్దం పట్టే బడ్జెట్ ఇది అని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమం మేళవింపునకు ప్రతిబింబంగా ఉన్న బడ్జెట్ ఇది అని తెలిపారు. సీఎం చంద్రబాబు ఆలోచనల మేరకు ఆర్థిక మంత్రి కేశవులు అద్భుతమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారన్నారు. సంపద సృష్టించాలన్న సీఎం ఆలోచనలను ఆచరణలో పెట్టే బడ్జెట్ ఇది అని చెప్పుకొచ్చారు.
AP Budget: రైతులకు శుభవార్త.. ఆ రోజు మీ బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోండి..
సూపర్ సిక్స్ పథకాల అమల్లో భాగంగా మరో రెండు పథకాలైన అమ్మ ఒడి, ఉచిత బస్సు పథకానికి ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించండం సంతోషకర విషయమన్నారు. రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చేందుకు నీటిపారుదల శాఖకు గత ప్రభుత్వం కంటే రెండు రెట్ల అదనపు నిధులు కేటాయించడం రైతుల్లో ఆనందాన్ని నింపుతుందన్నారు. రైతులకు ఆదాయాన్ని పెంచే పథకాలకు కూడా ఆరు నుంచి పది రెట్లు నిధులు పెంచారని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.
అమరావతి: స్వర్ణ ఆంధ్రప్రదేశ్ స్థాపనకు తాజా బడ్జెట్ పునాది అని శాసనమండలి పక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ బడ్జెట్ ఇప్పటికీ జగన్ పాలనలో ఆర్థిక సంక్షోభం కొనసాగింపును ప్రతిబింబిస్తోందన్నారు. అందుకే దీనికి పెద్దగా ప్రాముఖ్యత లేదన్నారు. ఇది జగన్ ప్రభుత్వం అందించిన 2.89 లక్షల కోట్ల నుంచి కూటమి ప్రభుత్వం 2.94 లక్షల కోట్లకు పెరుగుదల మాత్రమే అని చెప్పుకొచ్చారు. ఆర్థిక సంవత్సరంలో రెండు ప్రభుత్వాల మధ్య మార్పు కేవలం రూ.8000 కోట్లు (2.87%) మాత్రమే అని తెలిపారు. ద్రవ్యోల్బణ రేటుకు సమానం కాదని యనమల రామకృష్ణుడు వెల్లడించారు.
కాగా.. 2024-25 వార్షిక బడ్జెట్‌ను ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశిపెట్టింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్‌ను రూపొందించారు. అలాగే రూ.43402.33 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. బడ్జెట్‌లోప్రాధాన్యత రంగాలకు కేటాయింపులు జరిగాయి. అలాగే సంక్షేమానికి భారీ కేటాయింపులు చేసింది సర్కార్. వివిధ వర్గాల సంక్షేమం కోసం రూ.73,720 కోట్లను కూటమి ప్రభుత్వం కేటాయించింది. బీసీ సంక్షేమానికి రూ. 39 వేల కోట్లు కేటాయించింది. అలాగే విద్యా, వైద్యం, పంచాయతీ రాజ్, పట్టణాభివృద్ధి, ఇరిగేషన్ రంగాలకు హై ప్రయార్టీ ఇచ్చారు. కునారిల్లిన పోలీస్ విభాగానికి నిధులను కేటాయించారు. పోలీస్ విభాగాన్ని ఆర్థికంగా పటిష్టం చేస్తూ రూ. 8495 కోట్ల కేటాయిస్టులన్నట్లు మంత్రి తెలిపారు. రోడ్ల మరమ్మత్తులపై బడ్జెట్‌లో ప్రత్యేక ఫోకస్ పెట్టిన కూటమి ప్రభుత్వం ఆర్ అండ్ బికి రూ. 9554 కోట్లను బడ్జెట్‌లో కేటాయించింది.
ఇవి కూడా చదవండి...
Rushikonda : రుషికొండ ఫైళ్లు మాయం!
AP Assembly Session: ఏపీ వార్షిక బడ్జెట్ ఎంతో తెలుసా
Read Latest AP News And Telugu News