Share News

Sandhyarani: గిరిజనుల అభివృద్ధి కోసమే ఎన్టీఆర్ ఐటీడీఏను స్థాపించారు..

ABN , Publish Date - Aug 09 , 2024 | 12:43 PM

Andhrapradesh: గిరిజనుల అభివృద్ధికి, పురోగతి సాధించాలన్న సంకల్పంతో ఐటీడీఏని ఎన్టీఆర్ స్థాపించారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఐటీడీఏ వచ్చిన తర్వాత గిరిజన సోదరులు, మహిళలు ఎలా ఉండాలి అనేది తెలిసిందన్నారు. సజ్జలు, జొన్నలు, రాగులు లాంటి చిరుధాన్యాలు మాత్రమే భోజనం చేసే గిరిజనులకు రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చి...

Sandhyarani: గిరిజనుల అభివృద్ధి కోసమే ఎన్టీఆర్ ఐటీడీఏను స్థాపించారు..
Minister Gummadi Sandhyarani

అమరావతి, ఆగస్టు 9: గిరిజనుల అభివృద్ధికి, పురోగతి సాధించాలన్న సంకల్పంతో ఐటీడీఏని ఎన్టీఆర్ స్థాపించారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి (Minister Gummadi Sandhyarani) అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఐటీడీఏ వచ్చిన తర్వాత గిరిజన సోదరులు, మహిళలు ఎలా ఉండాలి అనేది తెలిసిందన్నారు. సజ్జలు, జొన్నలు, రాగులు లాంటి చిరుధాన్యాలు మాత్రమే భోజనం చేసే గిరిజనులకు రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చి వరి భోజనం పరిచయం చేసింది నందమూరి తారక రామారావు అని గుర్తుచేశారు. గడిచిన ఐదేళ్లలో అన్ని వ్యవస్థల్ని జగన్ మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.

Chandrababu: కాఫీ తాగి.. డప్పు వాయించి.. గిరిజన నృత్యంతో ఆకట్టుకున్న చంద్రబాబు


రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది గిరిజనులు అందరు కూడా ఏదో విధంగా గడిచిన ఐదేళ్లలో ఇబ్బంది పడ్డారన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం ఇచ్చిన లక్ష పాతికవేల ఎకరాలు ఇచ్చారన్నారు. గడిచిన ఐదేళ్లలో దళారులతో గిరిజనులకు ఇచ్చిన భూముల్లో వైసీపీ నాయకులు గంజాయిని పండించారన్నారు. గిరిజన పిల్లలను ప్రేరేపించి గంజాయి రవాణాకు వైసీపీ నాయకులు వాడుకున్నారన్నారు. 70 శాతం మంది గిరిజన పిల్లలు జైల్లో మగ్గిపోతున్నారన్నారు. గంజాయి సూత్రధారులు మాత్రం బయటే ఉన్నారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు.


కాగా.. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఆదివాసి దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. గిరిజన సంప్రదాయ నృత్యాల్లో కళాకారులతో పాటు చంద్రబాబు సైతం పాల్గొన్నారు. కళాకారుల డప్పు తీసుకుని స్వయంగా డప్పు వాయించారు. గిరిజన లంబాడి కళాకారులతో సరదాగా కాసేపు ముచ్చటించారు. గిరిజన సంప్రదాయమైన కొమ్మ కోయ ధరించి కళాకారులతో చంద్రబాబు జత కలిశారు. గిరిజనలు ప్రదర్శించిన ఉత్పత్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గిరిజనులు తయారు చేసిన కాఫీని సేవించారు. ఆ తరువాత ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, వసంత కృష్ణ ప్రసాద్ పక్కనున్న అధికారులను పిలిచి మరీ వారితో కాఫీ తాగించారు.


ఇవి కూడా చదవండి..

Lokesh: ప్రజాదర్బార్‌లో మంత్రి లోకేష్‌‌ను కలిసిన అనంత ఏఎస్పీ బాధితురాలు

Duvvada: బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.. తుపాకీకి లైసెన్స్ ఇవ్వండి

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 09 , 2024 | 12:47 PM