Share News

Lokesh: మెగా డీఎస్సీపై మంత్రి లోకేష్ క్లారిటీ

ABN , Publish Date - Nov 13 , 2024 | 02:45 PM

Andhrapradesh: మెగా డీఎస్సీపై మంత్రి నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి సంతకం మెగా డీఎస్సీ వేశారని.. దానిలో భాగంగా టెట్ తరువాత డీఎస్సీ వెయాలని నిర్ణయించామన్నారు.

Lokesh: మెగా డీఎస్సీపై మంత్రి లోకేష్ క్లారిటీ
Minister Nara lokesh

అమరావతి, నవంబర్ 13: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly Session) కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల్లో భాగంగా డీఎస్సీపై సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్ సమాధానం ఇచ్చారు. తెలుగుదేశం ఆవిర్భావం తరువాత 11 డీఎస్సీలు వేశారని.. లక్షా 50 వేల మంది ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారని తెలిపారు. ఇందులో 9 డీఎస్సీలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేసినవే అని చెప్పుకొచ్చారు.

HYDRA: బతుకమ్మకుంటపై హైడ్రా కమిషనర్ సంచలన కామెంట్స్


ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి సంతకం మెగా డీఎస్సీ వేశారని.. దానిలో భాగంగా టెట్ తరువాత డీఎస్సీ వెయాలని నిర్ణయించామన్నారు. డీఎస్సీకి త్వరలోనే నోటిఫికేషన్ 16 వేల పైచిలుకు పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు. నిరుద్యోగ యువత పోరాటం మూలంగానే 93 శాతం విజయాన్ని అందుకున్నామన్నారు. సూపర్ సిక్స్ మ్యానిఫెస్టోలో తొలి హామీ 20 లక్షల ఉద్యోగాలు అని.. దానికి ఉన్న మంత్రి వర్గ ఉపసంఘంకు తనను ఛైర్మన్‌గా సీఎం చంద్రబాబు నాయుడు నియమించారని తెలిపారు.


డీఎస్సీపై స్పష్టత..

డీఎస్సీ పై గతంలో ఎన్ని కేసులు పడ్డాయో వాటిని స్టడీ చేయమని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. అధికారులు తగినంత సమయం కావాలని అడిగారన్నారు. ఇప్పడు ఇచ్చే నోటిఫికేషన్ పకడ్బందీగా వేయాలని వారికి చెప్పామని తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ వచ్చే ఏడాది భర్తీచేస్తామని ప్రశ్నోత్తరాలు సందర్భంగా మంత్రి లోకేస్ సమాధానం ఇచ్చారు. సమాధానం ఇచ్చిన మంత్రి లోకేష్

Bulldozer Justice: బుల్డోజర్ న్యాయంపై సుప్రీం కోర్టు సీరియస్.. ఏమన్నదంటే..


బడ్జెట్‌పై చర్చ..

ప్రశ్నోత్తరాల అనంతరం శాసనసభలో బడ్జెట్‌పై చర్చ ప్రారంభమైంది. ఎమ్మెల్యే కూన రవి కుమార్ చర్చను మొదలుపెట్టారు. 2014లో కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అప్రజాస్వామికంగా రాష్ట్రాన్ని విభజించారన్నారు. గత ప్రభుత్వం విధ్వంసంతో పాలనను ప్రారంభించిందని తెలిపారు. రాష్ట్రాన్ని దెబ్బతీసి అన్ని వ్యవస్ధలను నాశనం చేశారన్నారు. 2019-24 మధ్య కాలంలోని జగన్ ప్రభుత్వం కంటే బ్రిటిష్ ప్రభుత్వమే మేలంటూ వ్యాఖ్యలు చేశారు. జగన్ వచ్చాక విద్యుత్ ఒప్పందాలను రద్దు చేశారని.. అలాగే నీటిపారుదల రంగాన్ని నిర్వీర్యం చేశారన్నారు. పోలవరం ప్రాజెక్టును నిలిపేశారని... అమరావతిని కూడా నిలిపేశారని మండిపడ్డారు. ఏజెన్సీలు మార్చడం వల్ల డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందనని కూన రవి కుమార్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

TEA: బీ కేర్ ఫుల్... టీ ఇన్ని కప్పులు తాగితే ఆసుపత్రిలో అడ్మిట్ అవుతారు..

KTR: పట్నం నరేందర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్

Read latest AP News And Telugu News

Updated Date - Nov 13 , 2024 | 02:46 PM