Share News

Lokesh: పెట్టుబడుల కోసం మంత్రి లోకేష్ తీవ్ర కృషి

ABN , Publish Date - Oct 30 , 2024 | 09:35 AM

Andhrapradesh: ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్.. అమెరికా పర్యటన కొనసాగుతోంది. లాస్ వెగాస్‌లో ఐటీ సర్వ్ సినర్జీ సదస్సుకు హాజరైన మంత్రి.. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) మేనేజింగ్ డైరక్టర్ రేచల్ స్కాఫ్‌ను కలిశారు. ఏపీలో పెట్టుబడుల అవకాశాలను పరిశీలించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

Lokesh: పెట్టుబడుల కోసం మంత్రి లోకేష్ తీవ్ర కృషి
Minister Nara lokesh

అమరావతి, అక్టోబర్ 30: అమెరికా పర్యటనలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara lokesh) ఫుల్ బిజీగా ఉన్నారు. ఏపీకి పెట్టుబడలే లక్ష్యంగా పలువురు ప్రముఖులతో లోకేష్ భేటీ అవుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల కోసం ఏపీ మంత్రి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే మైక్రో సాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో భేటీ అయిన మంత్రి.. ఇప్పుడు అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎండీ రేచల్ స్కాఫ్‌తో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో అమెజాన్ డాటా సెంటర్ ఏర్పాటు చేయాలని... సులభతరమైన పౌరసేవలకు సహకారం అందించాలని కోరారు. లాస్ వెగాస్‌లో ఐటీ సర్వ్ సినర్జీ సదస్సుకు మంత్రి లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడి ప్రాంగణంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) మేనేజింగ్ డైరక్టర్ రేచల్ స్కాఫ్‌ను కలిసి ఏపీలో పెట్టుబడుల అవకాశాలను పరిశీలించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

Penny Stock: లక్ష పెట్టుబడితో 4 నెలల్లోనే రూ. 670 కోట్లు.. దేశంలోనే ఖరీదైన స్టాక్‌గా రికార్డ్


అదే మా సంస్థ లక్ష్యం: రేచల్ స్కాఫ్

క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్స్, డిజిటల్ ట్రాన్స్ ఫార్మేషన్‌పై అమెజాన్ దృష్టి సారిస్తుందని రేచల్ స్కాఫ్ తెలిపారు. ప్రపంచ మార్కెట్‌లో క్లౌడ్ సేవలు, పరిష్కారాలను విస్తరించడంలో తమ సంస్థ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఏఐ అండ్ ఎంఎల్, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆవిష్కరణలకు ప్రస్తుతం ప్రాధాన్యత ఇస్తున్నామని.. ప్రభుత్వాలు, భారీ పారిశ్రామిక సంస్థలకు డిజిటల్ సొల్యూషన్స్ సేవలు అందజేయడం లక్ష్యమని స్పష్టం చేశారు. క్లౌడ్ కంప్యూటింగ్, స్టోరేజి, డేటా నిర్వహణ సేవల్లో అంతర్జాతీయంగా కీలక పాత్ర పోషిస్తున్నామన్నారు. నెట్‌ఫ్లిక్స్, ఎయిర్‌బిఎన్‌బి, 3 ఎమ్ వంటి అనేక రకాల పరిశ్రమలను తమ సంస్థ కలిగి ఉందన్నారు. ఏడబ్ల్యూఎస్ ప్రపంచవ్యాప్తంగా 32% మార్కెట్ వాటాతో క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మార్కెట్లో అతిపెద్ద ప్లేయర్‌ అని చెప్పుకొచ్చారు. 2023 నాటికి అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) వార్షిక ఆదాయం సుమారు $90.8 బిలియన్లుగా ఉండగా, 2024కి $100 బిలియన్లకు చేరుకుందన్నారు. స్మార్ట్ గవర్నెన్స్‌కు క్లౌడ్ సేవలు అందించండి అని రేచల్ స్కాఫ్ తెలిపారు.

Russia: న్యూక్లియర్ డ్రిల్‌ మొదలు పెట్టిన రష్యా.. ఏం జరగబోతోంది


మీ సహకారం ఏపీకి అవసరం: లోకేష్

క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఆంధ్రప్రదేశ్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ లక్ష్యాల సాధనకు ఏడబ్ల్యూఎస్ నాయకత్వం అవసరమని మంత్రి లోకేష్ అన్నారు. స్మార్ట్ గవర్నెన్స్ కోసం ఏపీ ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రణాళికల అమలులో ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ సేవలు కీలకపాత్ర పోషించే అవకాశం ఉందన్నారు. ఏఐ & మిషన్ లెర్నింగ్‌లో మీరు చూపిస్తున్న శ్రద్ధ, నిబద్ధతలు ఏపీని ఏఐ ఇన్నోవేషన్ కేంద్రంగా మార్చడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. పునరుత్పాదక శక్తితో నడిచే క్లౌడ్ డేటా సెంటర్‌ల స్థిరత్వానికి ఏడబ్ల్యూఎస్ కట్టుబడి ఉండటం.. 2030 నాటికి ఆంధ్రప్రదేశ్ 72 జీడబ్ల్యూ పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సాధించాలన్న తమ లక్ష్యానికి అనుగుణంగా ఉందన్నారు. స్థిరమైన క్లౌడ్ కార్యకలాపాలకు పునరుత్పాదక ఇంధనాన్ని అందించేందుకు రాష్ట్రంలో బలమైన మౌలిక సదుపాయాలు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు భరోసానిస్తాయన్నారు. ఏడబ్ల్యూఎస్ తదుపరి డేటా సెంటర్‌కు ఆంధ్రప్రదేశ్‌ను అనువైన ప్రదేశంగా ప్రతిపాదించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లోని స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల్లో మౌలిక సదుపాయాలు, పట్టణ ప్రణాళిక, పౌరసేవలకు ఏడబ్ల్యూఎస్ సహకారం అవసరమన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పబ్లిక్ సర్వీసెస్ డెలివరీ సిస్టమ్, డిజిటల్ గవర్నెన్స్‌ మెరుగుదల, ఈ-గవర్నెన్స్ కార్యకమాలకు ఏడబ్ల్యూఎస్ సహకారాన్ని కోరుతున్నామని మంత్రి లోకేష్ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

నాకు బిర్యానీ పెట్టండి

‘భారతి’ కొంగు బంగారమే

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 30 , 2024 | 09:51 AM