Share News

Nara Lokesh: మైక్రో సాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో మంత్రి నారా లోకేష్ భేటీ

ABN , Publish Date - Oct 29 , 2024 | 08:04 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిజిటల్ గవర్నెన్స్‌కు సాంకేతిక సహకారం అందించాలని మైక్రో సాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లను మంత్రి నారా లోకేష్ కోరారు. అమరావతిని ఎఐ క్యాపిటల్‌గా తీర్చిదిద్దేందుకు సహకరించాలని, రాష్ట్రంలో ఐటి హబ్‌లకు సహకారం అందించాలని, ఒకసారి ఏపీని సందర్శించాల్సిందిగా సత్య నాదెళ్లను లోకేష్ ఆహ్వానించారు.

Nara Lokesh: మైక్రో సాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో మంత్రి నారా లోకేష్ భేటీ

అమరావతి/అమెరికా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్‌ (Minister Lokesh) అమెరికాలో పర్యటిస్తున్నారు. (America Visit) అందులో భాగంగా అమెరికాలోని రెడ్ మండ్‌లోని మైక్రో సాఫ్ట్ కేంద్ర కార్యాలయాన్ని (Microsoft central office) లోకేష్ సందర్శించారు. ఈ సందర్భంగా మైక్రో సాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో (CEO Satyanadella) భేటీ అయ్యారు. రాష్ట్రంలో డిజిటల్ గవర్నెన్స్‌కు సాంకేతిక సహకారం అందించాలని కోరారు. అమరావతిని ఎఐ క్యాపిటల్‌గా తీర్చిదిద్దేందుకు సహకరించాలని, రాష్ట్రంలో ఐటి హబ్‌లకు సహకారం అందించాలని కోరారు. ఒకసారి ఏపీని సందర్శించాల్సిందిగా సత్య నాదెళ్లను లోకేష్ ఆహ్వానించారు. అమెరికాలోని రెడ్‌మండ్‌లోని మైక్రో సాఫ్ట్ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్‌ను తెలుగు ఉద్యోగులు కలిసి కరచాలనం చేసి, ఫోటోలు దిగారు.

అలాగే మంత్రి లోకేష్ అడోబ్ ఆర్ అండ్ డి కేంద్రాన్ని సందర్శించి ఆ కంపెనీ సీఈవోతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌, అమరావతిలో అడోబ్ ఆర్ అండ్ డి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. స్మార్ట్ గవర్నెన్స్, ఎఐ-డ్రైవెన్ సొల్యూషన్స్‌లో భాగస్వామ్యం వహించాని విజ్ఞప్తి చేశారు. యువతలో డిజిటల్ నైపుణ్యాల మెరుగుదలకు సహకారం అందించాలని అడోబ్ సీఈవోను మంత్రి నారా లోకేష్ కోరారు.


కాగా ఎలక్ట్రానిక్ వెహికల్స్‌(ఈవీ) పరిశ్రమకు అనంతపురం జిల్లా వ్యూహాత్మక ప్రదేశమని, ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాలని దిగ్గజ సంస్థ టెస్లాను మంత్రి లోకేష్ ఆహ్వానించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన సోమవారం పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆస్టిన్‌ నగరంలోని టెస్లా కేంద్ర కార్యాలయాన్ని లోకేష్ సందర్శించారు. ఈ సందర్భంగా ఈవీల తయారీ రంగంలో దిగ్గజ సంస్థగా ఉన్న టెస్లా చీఫ్‌ ఫైనాన్సియల్‌ ఆఫీసర్‌(సీఎఫ్‌వో) వైభవ్‌ తనేజాతో భేటీ అయ్యారు. టెస్లా తన యూనిట్‌ను ఏపీలో స్థాపించే అవకాశాలపై చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలు, అమరావతి నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై మంత్రి వివరించారు. ఈవీ తయారీ, బ్యాటరీ ఉత్పత్తుల యూనిట్ల స్థాపనకు అనంతపురం వ్యూహాత్మక కేంద్రమని వెల్లడించారు. బెంగళూరు, చెన్నై నగరాలకు సమీపంలో ఉన్న ఈ జిల్లా పెట్టుబడులు పెట్టేందుకు అనువైన ప్రదేశమని తెలిపారు.


రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం

రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూల విధానాలు అమలు చేస్తున్నామని, పెట్టుబడులతో రావాలని లోకేష్ ఆహ్వానించారు. 2029 నాటికి ఏపీలో 72 గిగా వాట్ల రెన్యువబుల్‌ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని తనేజాకు వివరించారు. ఈ లక్ష్య సాధనలో టెస్లా భాగస్వామి కావాలని ఆహ్వానించారు. కియా, హీరో మోటార్స్‌ వంటి కంపెనీలను చంద్రబాబు రాష్ట్రానికి తీసుకొచ్చారని, ఇప్పుడు ఈవీల తయారీ, రెన్యువబుల్‌, గ్రీన్‌ ఎనర్జీ రంగాలపై దృష్టి సారించారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా సౌరశక్తి నిల్వ వ్యవస్థలు, ముఖ్యంగా స్మార్ట్‌ సిటీలు, సోలార్‌ ప్యానల్స్‌ ఏర్పాటు ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం కావాలని టెస్లాను ఆహ్వానించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్‌ల అమలులో భాగస్వామ్యం కావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో టెక్నాలజీ పార్కులను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి వెంట సీఎంఓ కార్యదర్శి కార్తికేయ మిశ్రా, సాయికాంత్‌వర్మ ఉన్నారు.

ఏవియేషన్‌, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టండి

పెరోట్‌ గ్రూప్‌ అండ్‌ హిల్‌వుడ్‌ డెవల్‌పమెంట్‌ చైర్మన్‌ రాస్‌ పెరోట్‌ జూనియర్‌తో డల్లా్‌సలో లోకేశ్‌ భేటీ అయ్యారు. రియల్‌ ఎస్టేట్‌, టెక్నాలజీ, డేటా సెంటర్‌, ఎనర్జీ రంగాల్లో భిన్నమైన పోర్ట్‌పోలియోలను పెరోట్‌ నిర్వహిస్తున్నారు. పబ్లిక్‌ ప్రైవేటు ప్రాజెక్టుల్లో భాగస్వామిగా ఉన్నారు. రియల్‌ ఎస్టేట్‌, లాజిస్టిక్స్‌, ఏవియేషన్స్‌ రంగాల్లో పెరోట్‌ రూపొందించిన వెంచర్లు అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపాయి. ఇన్నోవేటివ్‌ రియల్‌ ఎస్టేట్‌, పబ్లిక్‌-ప్రైవేటు ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం కావాలని, ఏపీలో పెట్టుబడులు పెట్టాలని పెరోట్‌ను లోకేశ్‌ కోరారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ప్రాజెక్టులు టెక్సాస్‌ తరహాలోనే ఏపీలోనూ ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయల కల్పన రంగంలో పెట్టుబడులకు అనువైన వాతారణం ఉందని, స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులు, పట్టణాల అభివృద్ధిలో సహకారం అందించాలని కోరారు. విశాఖలో ఏవియేషన్‌ వర్సిటీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని, ఏరోస్పేస్‌ టెక్నాలజీలో ఏపీ ఆకాంక్షలు నెరవేర్చడం, ఏవియేషన్‌ హబ్‌ ఏర్పాటులో సహకారం అందించాలని కోరారు. రాష్ట్రంలో ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ హబ్‌ను ఏర్పాటు చేయడానికి భాగస్వామ్యం వహించే అంశాన్ని పరిశీలించాలన్నారు. విశాఖలో డేటా సెంటర్‌ ఏర్పాటుకు అవసరమైన ఎకో సిస్టమ్‌ ఉందన్నారు. హైవేలు, పోర్టులు, పట్టణాభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలు పరిశీలించాలని పెరోట్‌ను లోకేశ్‌ కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏబీఎన్ దెబ్బతో తోక ముడిచిన రోత పత్రిక..

ఎమ్మార్పీ ఉల్లంఘనకు 5 లక్షల జరిమానా

ఇన్నాళ్లకు ఇంట గెలిచా

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 29 , 2024 | 08:04 AM