Lokesh: టెస్లా సీఎఫ్‌ఓవోతో లోకేష్ భేటీ.. చర్చించిన అంశాలివే
ABN , Publish Date - Oct 28 , 2024 | 11:30 AM
Andhrapradesh: అమెరికా పర్యటనలో మంత్రి లోకేష్ బిజీబిజీగా గడుపుతున్నారు. ఏపీకి పెట్టుబడులను తీసుకువచ్చే లక్ష్యంతో వివిధ కంపెనీల ప్రతినిధులతో మంత్రి సమావేశమవుతున్నారు. ఈ సందర్భంగా టెస్లా సీఎఫ్‌ఓతో లోకేష్ భేటీ అయ్యారు.
అమరావతి, అక్టోబర్ 28: పెట్టుబడల ఆకర్షణే లక్ష్యంగా అమెరికాలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara lokesh) పర్యటన సాగుతోంది. అమెరికాలోని ఆస్ట్రిన్, డల్లాస్ నగరాల్లో మంత్రి బిజీబిజీగా గడుపుతున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులపై వివిధ కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలతో నిమగ్నమయ్యారు లోకేష్. రాష్ట్రానికి వీలైనన్ని పరిశ్రమలు తీసుకురావాలన్న లక్ష్యంతో లోకేష్ టూర్ కొనసాగుతోంది. టెస్లా కేంద్ర కార్యాలయాన్ని సందర్శించిన లోకేష్.. టెస్లా సీఎఫ్ఓ వైభవ్ తనేజాతో సమావేశమయ్యారు.
Iran: ఇరాన్ అధినేత అలీ ఖమైనీ ‘ఎక్స్’ అకౌంట్‌పై వేటు!
ఈవీ రంగానికి అనంతపురం అనుకూలమైన ప్రదేశం పెట్టుబడులు పెట్టండి అంటూ టెస్లా కంపెనీని కోరారు. స్మార్ట్ సిటీలు, గ్రామీణ విద్యుదీకరణ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం వహించాలని కోరారు. అలయెన్స్ టెక్సాస్ తరహా ప్రాజెక్టులకు ఏపీ తీరప్రాంతం అనుకూలమని చెప్పారు. దీనిపై టెస్లా సీఎఫ్ఓ వైభవ్ తనేజా సానుకూలంగా స్పందించారు. అలాగే రాస్ పెరోట్ జూనియర్‌తో ఏపీ మంత్రి భేటీ అయ్యారు. ఆపై డల్లాస్‌లో పెరోట్ గ్రూప్ చైర్మన్ రాస్ పెరోట్ జూనియర్‌తోనూ మంత్రి లోకేష్ సమావేశమయ్యారు.
కాగా.. టెస్లా కేంద్ర కార్యాలయ సందర్శన కోసం లోకేష్ ఆస్టిన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో మంత్రికి గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నేషల్ మీడియాతో మాట్లాడిన ఆయన.. టెస్లా కంపెనీని ఆంధ్రప్రదేశ్‌కు తీసుకువచ్చే కృషి కొనసాగుతుందని, ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని చెప్పారు. ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానం వల్ల ఏపీకి రావడానికి అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని లోకేష్ వెల్లడించారు.
Sakshi Bad Manner: వెంటాడుతున్న కొద్దీ వెనక్కి పారిపోతున్న సాక్షి భూతం..
ఇదిలా ఉండగా... ఈనెల 25 నుంచి నవంబర్ 1 వరకు అమెరికాలో లోకేష్ పర్యటన కొనసాగనుంది. ఇందులో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కో నగరానికి చేరుకున్న ఆయనకు ఐటీ సర్వ్, ఎన్ఆర్ఐ టీడీపీ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఏపీలో ఎన్డీఏ కూటమి ‘‘అఖండ’’ విజయం సాధించిన తర్వాత తొలిసారిగా అమెరికాలో లోకేష్ పర్యటిస్తున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో భారత కాన్సులేట్ జనరల్ శ్రీకర్‌రెడ్డి ఆధ్వర్యాన పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అభివృద్ధి వికేంద్రీకరణ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపు తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఈ సందర్భంగా లోకేష్ తెలిపారు. రాష్ట్ర యువతకు రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యానికి అనుగుణంగా సీఎం చంద్రబాబు ఇటీవల ఆరు పాలసీలను ప్రకటించారన్నారు. అమెరికాలోని వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు ఏపీకి వచ్చి రాష్ట సమగ్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని వినతి చేశారు.
అనంతరం శాన్‌ఫ్రాన్సిస్కోలోని ప్రపంచ ప్రఖ్యాత డేటా సేవల సంస్థ ఈక్వెనెక్స్ డేటా సెంటర్ కేంద్ర కార్యాలయాన్ని లోకేశ్ సందర్శించారు. తమ సంస్థ అందిస్తున్న డేటా సేవలు, కార్యకలాపాలను సంస్థ గ్లోబల్ ఎండీ కౌషిక్ జోషి, సీనియర్ స్ట్రాటజిక్ సేల్స్ ఇంజనీర్ రాబర్ట్ ఎలెన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఏపీలో డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ ఆహ్వానించారు.
ఇవి కూడా చదవండి
Gold And Silver Price: మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర
Yanamala: ఇక జగన్ జీవితం పాతాళమే
Read Latest AP News And Telugu News