Share News

Payyavula: అంతా వైసీపీనే చేసింది.. అసెంబ్లీలో ఓ రేంజ్‌‌లో ఫైర్ అయిన పయ్యావుల

ABN , Publish Date - Nov 11 , 2024 | 11:38 AM

Andhrapradesh: ఏపీ అసెంబ్లీలో 2024 -25 సంవత్సరానికి గాను బడ్జెట్‌ను మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వైసీపీపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు మంత్రి. మొత్తం చేసింది వైసీపీనే అంటూ విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల్లో విధ్వంసం చోటు చేసుకుందన్నారు.

Payyavula: అంతా వైసీపీనే చేసింది.. అసెంబ్లీలో ఓ రేంజ్‌‌లో ఫైర్ అయిన పయ్యావుల
Minister Payyavula Keshava

అమరావతి, నవంబర్ 11: 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavula Keshav) ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అన్ని రంగాలను గత వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. విధ్వంసంతోనే వైసీపీ పాలన నడించిందని అన్నారు.

AP Assembly Session: ఏపీ వార్షిక బడ్జెట్ ఎంతో తెలుసా


గత ప్రభుత్వ పాలనలో అన్ని రంగాల్లోనూ విధ్వంసం చోటు చేసుకుందన్నారు. ఏపీ ఆర్థిక వ్యవస్థ పతనమయ్యేలా చేశారని మండిపడ్డారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారన్నారు. గత ప్రభుత్వం లోపభూయిష్ట విధానాలను అమలు చేసిందని వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రజలు అపురూపమైన తీర్పు ఇచ్చారన్నారు. 2019-24 మధ్య రాష్ట్రంలో చీకటి దశ నడిచిందంటూ మంత్రి కామెంట్స్ చేశారు.


వైసీపీ పాలన విధ్వంసంతోనే ప్రారంభమైందన్నారు. రాష్ట్ర బ్రాండ్‌ విలువను దెబ్బతీశారన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రానీయకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర పథకాలను దారి మళ్లించారని ఆరోపించారు. అలాగే కార్పొరేషన్ల నిధులను కూడా మళ్లించారన్నారు. గత ప్రభుత్వంపై గుత్తేదారులకు నమ్మకం పోయిందని.. గత ప్రభుత్వంలో పరిమితికి మించి అప్పులు చేశారని తెలిపారు. గత ప్రభుత్వం ప్రజాస్వామ్య గొంతులను అణచివేసిందని.. వైసీపీ సర్కార్ నిర్వాకంతో ఆర్థిక గందరగోళ పరిస్థితులు నెలకొన్నయాన్నారు. పతనం అంచున రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిలుచుందన్నారు. రాష్ట్ర ప్రగతి పునర్‌నిర్మాణం నేటితరం చేతుల్లో ఉందన్నారు. ప్రభావవంత పాలనే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ లోపభూయిష్ట విధానాల వల్ల రాష్ట్ర ఆదాయానికి గండి పడిందని విమర్శించారు.

YS Jagan: జగన్‌ ‘బొమ్మ’కు బిల్లులు!


పోలవరంపై..

సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని.. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సలహాలను పట్టించుకోలేదన్నారు. ఏళ్ల తరబడి పోలవరం ప్రాజెక్టును గాలికొదిలేశారని మండిపడ్డారు. ఏపీ అభివృద్ధి కుంటుపడకుండా చూస్తామని వెల్లడించారు. సంక్షేమానికి పెద్దపీట వేస్తూ బడ్జెట్‌ రూపొందించినట్లు తెలిపారు. పట్టణాల్లో 204, గ్రామీణ ప్రాంతాల్లో 158 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశామన్నారు. వీలైనంత త్వరగా పోలవరం పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ప్రపంచస్థాయి నగరంగా అమరావతి నిలవనుందని మంత్రి పయ్యావుల పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

Rushikonda : రుషికొండ ఫైళ్లు మాయం!

AP Assembly Session: ఏపీ వార్షిక బడ్జెట్ ఎంతో తెలుసా

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 11 , 2024 | 02:39 PM