Share News

Somireddy: ఎవడబ్బ సొత్తని అరబిందోకు దోచిపెట్టారు

ABN , Publish Date - Nov 06 , 2024 | 03:30 PM

Andhrapradesh: అరబిందో కంపెనీపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో 108 బాధ్యతలను చేజిక్కించుకున్న అరబిందో కంపెనీ వందల కోట్లు దోచుకుని ఎంతో మంది అమాయకుల ప్రాణాలు తీసిందని విమర్శించారు. 108 అంబులెన్సుల నిర్వహణలో అరబిందో కంపెనీ వైఫల్యాన్ని కాగ్ బట్టబయలు చేసిన తర్వాత అప్పటి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.

Somireddy: ఎవడబ్బ సొత్తని అరబిందోకు దోచిపెట్టారు
MLA Somireddy Chandramohan Reddy

అమరావతి, నవంబర్ 06: 108 అంబులెన్సుల నిర్వహణలో అరబిందో భారీ కుంభకోణానికి పాల్పడిందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (MLA Somireddy Chandramohan Reddy) వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏ2 విజయసాయిరెడ్డి వియ్యంకుడి కంపెనీకి ప్రజల సొత్తును జగన్ రెడ్డి దోచిపెట్టారని మండిపడ్డారు. గోల్డెన్ అవర్ పాటించడంలోనూ అరబిందో విఫలమైందన్నారు. గతంలోనే గోల్డెన్ అవర్ విషయం కాగ్ స్పష్టం చేసినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. సకాలంలో ఆస్పత్రులకు చేర్చకుండా వందల మంది అమాయకుల ప్రాణాలు బలితీసుకున్న అరబిందో కంపెనీ యాజమాన్యంపై ఐపీసీ 302 సెక్షన్ కింద కేసులు నమోదు చేయాలన్నారు.

Bhanu kiran: చంచల్‌గూడ జైలు నుంచి భాను కిరణ్ విడుదల


అరబిందో కంపెనీ అరాచకాలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. 108 అంబులెన్సుల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం తమకు రూ.141 కోట్లు చెల్లించాలని అరబిందో కంపెనీ చెబుతోందని.. అరబిందో కంపెనీ ఏ2 విజయసాయిరెడ్డి వియ్యంకుడు రాంప్రసాద్ రెడ్డి, తన అల్లుడు రోహిత్‌కు చెందినదన్నారు. వైసీపీ ప్రభుత్వంలో 108 బాధ్యతలను చేజిక్కించుకున్న అరబిందో కంపెనీ వందల కోట్లు దోచుకుని ఎంతో మంది అమాయకుల ప్రాణాలు తీసిందని విమర్శించారు. 108 అంబులెన్సుల నిర్వహణలో అరబిందో కంపెనీ వైఫల్యాన్ని కాగ్ బట్టబయలు చేసిన తర్వాత అప్పటి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. గోల్డెన్ అవర్ పాటించకుండా అమాయకుల ప్రాణాలు బలితీసేందుకు 108 అంబులెన్సులు ఎందుకు అని ప్రశ్నించారు.


2011 నుంచి 2016 వరకు 108 అంబులెన్సుల నిర్వహణ బాధ్యతను జీవీకే సంస్థ సమర్ధవంతంగా నిర్వహించిందన్నారు. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం 2016 నుంచి 2021 వరకు కూడా అదే సంస్థను పొడిగించిందని తెలిపారు. వైసీపీ అధికారంలోకి రాగానే జీవీకే సంస్థతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని ఒక జీఓ ద్వారా బలవంతంగా రద్దు చేసిందన్నారు. జీవీకే సంస్థ చేసుకున్న ఒప్పందం ప్రకారం ఒక్కో అంబులెన్సకు నెలకు రూ.1.31 లక్షలు అయితే అరబిందో కంపెనీకి రూ.1.78 లక్షలు చెల్లించారన్నారు. కొత్త అంబులెన్సుకు అయితే నెలకు రూ.2.21 లక్షలకు పెంచారని తెలిపారు. నిర్వహణ ఖర్చుల్లో చేసిన ఈ మార్పులతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై రూ.800 కోట్లకు పైగా భారం పడిందన్నారు. ఎవడబ్బ సొత్తు అని అరబిందో కంపెనీకి దోచిపెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరబిందో కంపెనీపై అంత ప్రేమ ఎందుకు అని నిలదీశారు. ఏ2 విజయసాయిరెడ్డి వియ్యకుండి కంపెనీకి ప్రజల సొత్తును దోచిపెట్టేందుకు ఆర్నెళ్లలో 6 జీఓలు ఇచ్చారన్నారు. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ పర్యవేక్షణలో ఉన్న 108 అంబులెన్సులను ఆరోగ్య శ్రీ పరిధిలోకి మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. రాజశేఖర్ రెడ్డి ఎవరని ప్రత్యేక జీఓ ద్వారా ఆరోగ్య శ్రీ డిప్యూటీ సీఈఓగా నియమించారని అడిగారు. మరో జీవోతో ఉద్యోగోన్నతి కల్పించారన్నారు.

US Election Result: అగ్రరాజ్యం అమెరికాను పాలించే అధ్యక్షుడి జీతం ఎంతో తెలుసా


జగన్మోహన్ రెడ్డికి తోడుగా ఏ2 విజయసాయిరెడ్డి జైలులో ఉండి దోచుకోవడానికి సలహాలు చెప్పాడని, చెత్త భాషతో సోషల్ మీడియాలో విమర్శలు చేస్తాడని ప్రజల సొత్తు అప్పనంగా దోచిపెడతారా అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విజయసాయి రెడ్డి వియ్యకుండి కంపెనీ కోసం విచ్చలవిడిగా జీఓలు ఇచ్చి ప్రజల సొత్తు దోచిపెట్టడం క్షమించరాని నేరమన్నారు. అరబిందో కంపెనీ ముసుగులో జరిగిన అరాచకాలపై విచారణ జరపాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. 108 అంబులెన్సుల నిర్వహణ విషయంలో గోల్డెన్ అవర్ పాటించడంలో విఫలమైన ఆ సంస్థపై హత్య కేసు నమోదు చేయాల్సిందే అని పట్టుబట్టారు. ఎంత మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారో తేల్చాలన్నారు. అంబులెన్సుల ట్రిప్పుల నమోదు విషయంలోనూ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఐదేళ్లలో జరిగిన భారీ దోపిడీపై సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు.


ఇవి కూడా చదవండి...

Aghori: పిఠాపురంలో మహిళా అఘోరి కలకలం..

Purandeshwari: కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్‌లో పురందేశ్వరి ప్రస్తావించిన అంశాలివే

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 06 , 2024 | 04:41 PM