Share News

AP politics: కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే సుజనా.. ఐదేళ్లూ కొనసాగిస్తానంటూ హామీ..

ABN , Publish Date - Jul 27 , 2024 | 10:32 AM

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి కొత్త ట్రెండ్ సెట్ చేశారు. గెలిచే వరకు ఓ మాట.. గెలిచిన తర్వాత మరో మాట చెప్పే పాత ట్రెండ్‌కు గుడ్‌బై చెబుతూ... ప్రతి నెల నియోజకవర్గంలో తాను చేసిన పనులపై ప్రోగ్రెస్ రిపోర్ట్ విడుదల చేసే కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు.

AP politics: కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే సుజనా.. ఐదేళ్లూ కొనసాగిస్తానంటూ హామీ..
Sujana Chowdary

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి కొత్త ట్రెండ్ సెట్ చేశారు. గెలిచే వరకు ఓ మాట.. గెలిచిన తర్వాత మరో మాట చెప్పే పాత ట్రెండ్‌కు గుడ్‌బై చెబుతూ... ప్రతి నెల నియోజకవర్గంలో తాను చేసిన పనులపై ప్రోగ్రెస్ రిపోర్ట్ విడుదల చేసే కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. వైసీపీ ప్రభుత్వంలో కొన్నాళ్లు మంత్రిగా పనిచేసిన గత వైసీపీ ఎమ్మెల్యే ఐదేళ్లలో చేయని పనులను నెలరోజుల్లో చేసి చూపించిన సుజనా చౌదరి.. దానికి సంబంధించిన రిపోర్ట్‌ను ట్వీట్ చేశారు. దీంతో ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రజలకు జవాబుదారీగా ఉంటానని ఇచ్చిన హామీని సుజనా చౌదరి నెలరోజుల్లోనే నిలబెట్టుకున్నారని నియోజకవర్గంలో ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే నియోజకవర్గంఅభివృద్ధిపై ఫోకస్ పెట్టారు సుజనా చౌదరి. ఎమ్మెల్యేగా నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటూ.. ప్రజా నాయకుడనే పదానికి నిదర్శనంగా నిలుస్తున్నారు.

Andhra Pradesh: పెద్దిరెడ్డీ.. దీన్నేమంటారు..?


40 రోజుల్లో..

ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 40 రోజుల్లో తాను చేసిన అభివృద్ధి పనులపై సుజనా చౌదరి ప్రోగ్రెస్ రిపోర్ట్ రిలీజ్ చేశారు. అతి తక్కువ కాలంలోనే 39వ డివిజన్ కల్వర్టు పనులను పూర్తి చేయించానని, 41వ డివిజన్ గాలిబ్ షాహిద్ దర్గా ప్రాంతంలో డ్రైనేజీ సమస్యకు పరిష్కారం చూపించానని ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఊర్మిళ నగర్ మెయిన్ రోడ్డు రహదారి సమస్యకు పరిష్కారం చూపించానని.. 42వ డివిజన్ లలిత నగర్‌లో మ్యాన్ హోల్ సమస్యకు పరిష్కారం చూపించినట్లు తన ప్రోగ్రెస్ కార్డులో చెప్పారు. 45వ డివిజన్‌లో రోడ్డు మధ్యలో ప్రయాణీకులకు అడ్డుగా ఉన్న పోల్ తొలగించానని, ఇదే డివిజన్‌లో తాగునీటి పైపులైన్లు కోసం తీసిన గోతులను పూడ్చివేయించినట్లు తెలిపారు. కేఎల్ రావు నగర్‌లో తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించి అక్కడి ప్రజల దహర్తిని తీర్చినట్లు పేర్కొన్నారు. 47వ డివిజన్‌లో తాగునీటి పైపులైన్లకు మరమ్మత్తులు చేయించడంతో పాటు.. పారిశుధ్య సమస్యకు పరిష్కారం చూపించానన్నారు. విద్యాధరపురంలో ఎండిపోయిన చెట్లు తొలగించానని.. ఇలా 40 రోజుల కాలంలో ఎన్నో పనులను చేయించి ప్రజల సమస్యలకు పరిష్కారం చూపించానని సుజనా చౌదరి ట్వీట్ చేశారు.

AP News: నేడు వరద ముంపు మండలాల్లో పర్యటించనున్న మంత్రుల బృందం..


ప్రతినెలా..

ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలను చూపిస్తున్నారని నియోజకవర్గం ప్రజలు చర్చించుకుంటున్నారు. రానున్న ఐదేళ్లు తన పనితనం ఎలా ఉంటుందో ఎమ్మెల్యే సుజనా చౌదరి మొదటి నెలలోనే శాంపిల్ చూపించారంటున్నారు నియోజకవర్గం కూటమి నాయకులు.. ఇది తన మొదటి ప్రోగ్రెస్ కార్డు మాత్రమేనని ప్రతి నెల మొదటి వారంలో తాను గత నెలలో చేసిన అభివృద్ధి పనుల నివేదికను ప్రజల ముందు ఉంచుతానని సుజనా చౌదరి ప్రకటించారు.


YS Jagan: జగన్‌ పత్రికకు జనం సొమ్ము

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Jul 27 , 2024 | 02:01 PM