Share News

Vasantha Krishna: జోగి తనయుడి అరెస్ట్‌పై ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్ ఏమన్నారంటే?

ABN , Publish Date - Aug 14 , 2024 | 03:39 PM

Andhrapradesh: మాజీ మంత్రి జోగిరమేష్‌పై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం నాడు మైలవరంలోని ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ... మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు రాజీవ్ అరెస్ట్‌పై స్పందించారు.

Vasantha Krishna: జోగి తనయుడి అరెస్ట్‌పై ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్ ఏమన్నారంటే?
MLA Vasantha Krishna Prasad

ఎన్టీఆర్ జిల్లా, ఆగస్టు 14: మాజీ మంత్రి జోగిరమేష్‌పై (Former Minister Jogi Ramesh) మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ (MLA Vasantha Krishna Prasad) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం నాడు మైలవరంలోని ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ... మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు రాజీవ్ అరెస్ట్‌పై స్పందించారు. గుణం కలిగిన వాడు కులం గురించి మాట్లాడడన్నారు. గౌడ కులస్థులకు జోగి నైజం గురించి తెలుసన్నారు. మైలవరం నియోజకవర్గంలోని విద్యుత్ సబ్ స్టేషన్‌లలో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు అమ్ముకున్న చరిత్ర జోగిది అంటూ వ్యాఖ్యలు చేశారు.

Jagan Viral Photo: భార్యతో కలిసి సామాన్యుడిలా విమాన ప్రయాణం చేసిన జగన్.. ఫొటో వైరల్


జోగి రమేష్ అరాచకాలు గురించి పెడన, పెనుమాలూరులలో అడిగితే చెబుతారన్నారు. ప్రతిపక్ష నాయకుల ఇళ్ల మీద దాడులు చేయవద్దని టీడీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారన్నారు. ‘‘ నువ్వు చంద్రబాబు ఇంటి మీద దాడి చేసినప్పుడు తెలియదా?.. తప్పులు చేస్తే ఎవరైనా శిక్ష అనుభవించక తప్పదు. ధర్మో రక్షిత రక్షితః. నువ్వు ధర్మం వైపు నిలబడితే నిన్ను ధర్మం రక్షిస్తుంది’’ అంటూ హితవుపలికారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. రాక్షస సంతలాగా జోగి లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారన్నారు. ‘‘నువ్వు, నీ కొడుకు ఎన్ని అరాచకాలు చేశారో ప్రజలందరికి తెలుసు. జోగి వెంట గౌడ కులం రాదు. గౌడ కులస్థులకు నువ్వు ఏం చేసావని నీ వెంట వస్తారు. నిన్ను నమ్మలేదు కాబట్టే 2014 లో గౌడ కులస్థులు జోగికి ఓట్లు వేయలేదు. 2019 కి ముందు నీ బ్రతుకేంటో ప్రజలకు తెలుసు’’అంటూ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Hyderabad Metro: నాగోల్ మెట్రో వద్ద ప్రయాణికుల ఆందోళన.. ఎందుకంటే?


అప్పుడు బీసీలు గుర్తుకు రాలేదా?: అంగర

మరోవైపు మాజీ మంత్రి జోగి రమేష్‌పై బీసీ నేత, శాసనమండలి మాజీ విప్ అంగర రామ్మోహన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబసభ్యుల అవినీతి పుట్ట కదులుతోందన్నారు. విజయవాడ శివారు అంబాపురం గ్రామంలో అగ్రిగోల్డ్ భూములను జోగి కుమారుడు రాజు, వెంకటేశ్వరరావు అధికారం దుర్వినియోగంతో కొట్టేశారని ఆరోపించారు. మాజీ మంత్రి జోగి రమేష్‌కు అవినీతిలో భారత రత్న ఇవ్వాలని ఎద్దేవా చేశారు. బీసీని కాబట్టే తమపై కేసులు పెట్టారని జోగి రమేష్ అంటున్నారన్నారు. జగన్ పాలనలో 26 వేల మంది బీసీలపై అక్రమ కేసులు పెట్టి, 300 మందిని హత్య చేసినప్పుడు బీసీలు జోగికి గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. జోగికీ తన కొడుకు అరెస్టుతో కులం కార్డు గుర్తుకు వచ్చిందా అంటూ ఆగ్రహంవ్యక్తం చేశారు. ‘‘నీ చిల్లర రాజకీయాలు, అవినీతి ఇంకా సాగవు జోగి.. గుర్తు పెట్టుకో’’ అంటూ అంగరరామ్మోహన్ హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి...

Ponnam: గురుకుల హాస్టల్లో సమస్యల పరిష్కారానికి నిర్ణయం..

Rajnath Singh: జమ్మూకశ్మీర్‌లో భద్రతా పరిస్థితులపై రాజ్‌నాథ్ కీలక సమావేశం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 14 , 2024 | 03:57 PM