Lokesh: అమెరికా పర్యటన ముగించుకుని ఏపీకి బయలుదేరిన నారా లోకేష్
ABN , Publish Date - Nov 01 , 2024 | 09:08 AM
ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన కొనసాగింది. వారం రోజుల్లో వివిధ సంస్థల ప్రతినిధులు, సీఈవోలు, ప్రెసిడెంట్స్, వైస్ ప్రెసిడెంట్లతో ఆయన భేటీ అయ్యారు. అమెరికాలో ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా వారం రోజుల అమెరికా పర్యటన (America tour) ముగించుకుని మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) తిరిగి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)కు బయలుదేరారు. ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా ఆయన పర్యటన కొనసాగింది. వారం రోజుల్లో వివిధ సంస్థల ప్రతినిధులు, సీఈవోలు (CEOs), ప్రెసిడెంట్స్ (Presidents), వైస్ ప్రెసిడెంట్‌లతో (Vice Presidents) నారా లోకేష్ భేటీ అయ్యారు. అమెరికాలో ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను నారా లోకేష్ వివరించారు.
కాగా రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి లోకేష్ (Minister Lokesh) పర్యటన అమెరికా (America)లో కొనసాగింది. ఇందులో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కో లోని ఇండియాస్పోరా (Indiaspora), యుఎస్ ఇండియా (US India) ప్రతినిధుల సమావేశంలో నారా లోకేష్ పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అలాగే గూగుల్ హెడ్ క్వార్టర్స్‌ను సందర్శించి, సంస్థ సిఈవో, వైస్ ప్రెసిడెంట్లతో ఆయన సమావేశం అయ్యారు. విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ డాటా సెంటర్ ఏర్పాటు చేయాలని వారికి విజ్ఞప్తి చేశారు. యువతలో నైపుణ్యాభివృద్ధి, స్మార్ట్ సిటీ కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. ఈ-గవర్నెన్స్, డిజిటల్ విద్యకు ఏపీ ప్రభుత్వంతో కలసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. గ్లోబల్ టెక్ హబ్‌గా మారబోతున్న ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని కోరారు.
అలాగే సేల్స్ ఫోర్స్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లలతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్టార్టప్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా అభివృద్ధి చెందుతోందని, ఏపీలో ఎఐ వర్సిటీ, డాటా సెంటర్లు రాబోతున్నాయని... పెట్టుబడులకు ఇదే సరైన సమయమని లోకేష్ వారికి వివరించారు. వారం రోజులుగా సంస్థల ప్రతినిధులు సీఈవోలు, వైస్ ప్రెసిడెంట్‌తో నారా లోకేష్ వరుస బేటీలు నిర్వహిస్తున్నారు.
కాగా బ్రాండ్ ఏపీ రూపకల్పనకు మద్దతివ్వాలని, టెక్నాలజీ, తయారీ రంగాల్లో విదేశీ పెట్టుబడులకు సహకరించాలని మంత్రి నారా లోకేశ్ ఆయా సంస్థల ప్రతినిదులను కోరారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న ఆయన లాస్‌వేగాస్‌లోని ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్ ప్రాంగణంలో పెప్సికో మాజీ సీఈవో ఇంద్రానూయి, సేల్స్ ఫోర్స్ ఏఐ సీఈవో క్లారా షియాతో విడివిడిగా సమావేశమై చర్చలు జరిపారు. ఇంద్రానూయితో భేటీ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ టెక్నాలజీ, తయారీ రంగాల్లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి విజనరీ లీడర్ చంద్రబాబు నేతృత్వంలో ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతివ్వాలని కోరారు. విద్య, సాంకేతిక ఆధారిత నైపుణ్యాల అభివృద్ధితో యువతకు సాధికారత కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. నైపుణ్యం కలిగిన యువత వారి కెరీర్‌లో విజయం సాధించడానికి దోహదపడే మెంటరింగ్ ప్రోగ్రామ్‌లను రూపొందించాలని కోరారు.
ఏపీలో సాంకేతిక పర్యావరణ వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలను ప్రత్యక్షంగా చూడటానికి ఒకసారి రాష్ట్రాన్ని సందర్శించాలని లోకేష్ కోరారు. మంత్రి ప్రతిపాదనలపై ఇంద్రానూయి సానుకూలంగా స్పందించారు. ఏపీలో పెట్టుబడులకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కాగా, ప్రభుత్వ సేవల్లో కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ (సీఆర్‌ఎం)ను మెరుగుపరచడానికి సేల్స్‌ఫోర్స్ ఐన్‌స్టీన్ అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ని ఏపీలో పరిచయం చేయాలని సేల్స్ ఫోర్స్ ఏఐ సీఈవో క్లారా షియాను మంత్రి లోకేశ్ కోరారు. స్మార్ట్ గవర్నెన్స్, ఏఐ డ్రైవెన్ ఎకానమీపై దృష్టి సారించామని, ఏపీలో ఏఐ స్కిలింగ్ కార్యక్రమాలను ప్రారంభించేందుకు సహకరిచాలని కోరారు. సేల్స్‌ఫోర్స్ ఏఐ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌లు, ప్రాక్టికల్ ట్రైనింగ్, టెక్ స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చేసేందుకు స్థానిక స్టార్ట్‌పలకు ఏఐ టూల్స్, మెంటార్‌షి్‌పను అందించాలని కోరారు. ఏపీలోని స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుల్లో ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, పబ్లిక్ సేఫ్టీ, అర్బన్ ప్లానింగ్ వంటి రంగాల్లో భాగస్వామ్యం అందించే అవకాశాలను పరిశీలించాలని మంత్రి కోరారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై తమ సహచర బృందంతో మాట్లాడతానని క్లారా తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
శ్రీకాకుళం జిల్లాలో సిలిండర్ల పథకాన్ని ప్రారంభించనున్న సీఎం
అట్లాంటాలో నారా లోకేస్ రెడ్ బుక్ ప్రస్తావన..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News