YSRCP: శభాష్ జగన్.. అబద్ధాల్లో నెంబర్ వన్ అంటూ నెటిజన్ల కితాబు..
ABN , Publish Date - Nov 08 , 2024 | 01:58 PM
ప్రతిపక్ష నేత హోదా విషయంలో జగన్ రెండు నాల్కల ధోరణి ఇదిగో అంటూ ఎక్స్‌లో అప్పటి వ్యాఖ్యలను, ఇప్పటి వ్యాఖ్యలను పక్కపక్కనపెట్టి షేర్ పోస్టు చేస్తున్నారు. అలాగే జగన్ నిజ స్వరూపం ఇదేనంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. చెప్పేదొకటి, చేసేదొకటి అంటూ మరికొందరు నెటిజన్లు..
వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో అసెంబ్లీలో మాట్లాడిన వీడియో, తాజాగా గురువారం మీడియా సమావేశంలో మాట్లాడిన వీడియోను షేర్ చేస్తూ అబద్ధాలు ఆడటంలో జగన్‍కు మించినవారు లేరంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రతిపక్ష నేత హోదా విషయంలో జగన్ రెండు నాల్కల ధోరణి ఇదిగో అంటూ ఎక్స్‌లో అప్పటి వ్యాఖ్యలను, ఇప్పటి వ్యాఖ్యలను పక్కపక్కనపెట్టి షేర్ పోస్టు చేస్తున్నారు. అలాగే జగన్ నిజ స్వరూపం ఇదేనంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. చెప్పేదొకటి, చేసేదొకటి అంటూ మరికొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఎందుకయ్యా.. నీ పరువు నువ్వే తీసుకుంటావంటూ మరికొందరు కామెంట్స్ పెడుతుంటే.. వైసీపీ అభిమానులు, ఆ పార్టీ సోషల్ మీడియా బ్యాచ్ మాత్రం జగన్ వ్యాఖ్యలపై సానుకూలంగా కామెంట్స్ పెడుతున్నారు.
Vasireddy Padma: పసలేని చట్టాలతో సైకోల దాడి నుంచి మహిళలను కాపాడలేం: వాసిరెడ్డి పద్మ
వైసీపీ సానుకూల ట్వీట్లు, పోస్టులపై కూడా కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. ఇప్పటికైనా నిజాలను మాట్లాడితే మంచిది.. అబద్ధాలకు గుడ్ బై చెప్పు జగన్ అంటూ కొందరు ఏపీ ప్రజలు వైసీపీ అధ్యక్షుడికి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అబద్ధాల బతుకే.. అధికారం పోయిన తర్వాత అదే బతుకు అవసరమా అంటూ మరికొందరు కొంచెం ఘాటుగా స్పందిస్తున్నారు. ప్రజలు గుణపాఠం చెప్పిన తర్వాత కూడా తీరు మార్చుకోకపోతే ఎలా అనే ప్రశ్నలను ఏపీ ప్రజలు సంధిస్తున్నారు. ఏది ఏమైనా అబద్ధాలు చెప్పడంలో, అసత్య ప్రచారాలను వ్యాప్తి చేయడంలో టాప్ లీడర్ అంటూ కొందరు జగన్‍పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
AP News: సోషల్ మీడియా పోస్టింగ్స్.. వైసీపీ నేతను విచారిస్తున్న పోలీసులు
అప్పుడు ఏమన్నారంటే..
గతంలో శాసనసభలో టీడీపీని ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ.. ఆ పార్టీకి 23మంది శాసనసభ్యులు ఉన్నారని, ఐదారుగురు సభ్యులను లాక్కుంటే ప్రతిపక్ష హోదా పోతుందని తనతో కొందరు చెప్పారని జగన్ వ్యాఖ్యానించారు. అంటే నిబంధనల ప్రకారం ఏదైనా పార్టీకి అధికారికంగా ప్రతిపక్ష హోదా కల్పించాలన్నా.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్న నాయకుడికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నా కనీసం పది శాతం సీట్లు సాధించాలనే నిబంధన జగన్‍కు తెలుసు. కనీసం 17 స్థానాలు లేదా అంతకంటే ఎక్కువ సాధిస్తే మాత్రమే ఏపీ శాసనసభలో ప్రతిపక్ష హోదా వస్తుందని జగన్‍కు అవగాహన ఉన్నప్పటికీ.. ప్రస్తుతం తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని అడిగితే శాసనసభ స్పీకర్ ఇవ్వలేదంటూ తాజాగా మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. గతంలోనూ ఇదే తరహా వాదనను జగన్‌తో పాటు ఆ పార్టీ నాయకులు తెరపైకి తీసుకొచ్చారు. అసెంబ్లీలో ఉన్నది రెండు పక్షాలేనని, ఒకటి అధికార పక్షం, రెండోది ప్రతిపక్షం కాబట్టి తనకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరంటూ ప్రభుత్వాన్ని, స్పీకర్‌ను జగన్ ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. ఇప్పుడు మరోలా మాట్లాడుతూ.. వైసీపీ అధ్యక్షుడు అబద్ధాలు ఆడటంలో సరికొత్త రికార్డు నమోదు చేస్తున్నారంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here