Stone Attack: జగన్‌పై రాయి దాడి కేసులో కొత్త ట్విస్ట్
ABN , Publish Date - May 30 , 2024 | 07:13 AM
విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాయి దాడి కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. నిందితుడు సతీష్ కుమార్‌కు బెయిల్ మంజూరు అయినా విడుదలకాలేదు. బెయిల్ తీర్పుపై స్టే ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో గురువారం వరకు విజయవాడ ఎనిమిదో అదనపు జడ్జి కోర్టు స్టే ఇచ్చింది.
విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై (CM Jagan) రాయి దాడి కేసులో (Stone Attack) కొత్త ట్విస్ట్ (New Twist) నెలకొంది. నిందితుడు సతీష్ కుమార్ (Satish Kumar)కు బెయిల్ (Bail) మంజూరు అయినా విడుదలకాలేదు. బెయిల్ తీర్పుపై స్టే ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో గురువారం వరకు విజయవాడ ఎనిమిదో అదనపు జడ్జి కోర్టు స్టే ఇచ్చింది. దీంతో నిందితుడు సతీష్ కుమార్ నెల్లూరు జైల్లోనే ఉన్నాడు.
పూర్తి వివరాలు..
విజయవాడలో సీఎం జగన్‌పై జరిగిన గులకరాయి దాడి కేసులో ప్రధాన నిందితుడు వేముల సతీశ్ కుమార్ విడుదలకు బ్రేక్ పడింది. అతడిని జైలు నుంచి విడుదల చేయాలని తీర్పు ఇచ్చిన న్యాయస్థానమే బెయిల్ ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. విజయవాడలోని 8వ అదనపు జిల్లా జడ్జి న్యాయస్థానం సతీశ్ కుమార్‌కు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు కోర్టులో బుధవారం మరో పిటిషన్ దాఖలు చేశారు. ‘బెయిల్ మంజూరు ఉత్తర్వులపై స్టే విధించండి. మేం ఈ తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తాం’ అని పోలీసులు పేర్కొన్నారు. దీన్ని పరిశీలించిన న్యాయస్థానం గురువారం వరకు బెయిల్‌పై స్టే విధించింది. దీంతో బుధవారం నెల్లూరు జైలు నుంచి విడుదల కావాల్సిన సతీశ్ కుమార్... జైలుకే పరిమితమయ్యాడు.
రాజకీయ సంచలనంగా మారిన కేసు..
సీఎం జగన్‌పై రాయితో జరిగిన దాడి కేసు ఇటీవల ఏపీలో రాజకీయ సంచలనంగా మారింది. ఏప్రిల్ 13న విజయవాడ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో జగన్ పై దాడి జరుగగా, రోజుల వ్యవధిలోనే నిందితుడు సతీష్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డిపై ఓ అగంతుకుడు రాయి విసరడం రాజకీయ రచ్చకు కారణమైంది. ఇది టీడీపీ చేయించిందంటూ వైసీపీ విమర్శలకు ఎక్కుపెట్టింది. ఈ ఘటన ఎన్నికల వేళ దురదృష్టకరమే. ముఖ్యంగా రాజకీయ పార్టీలు తమ బలాన్ని నమ్ముకోవడం లేదు. తాము నియమించుకున్న పోల్ స్ట్రాటజీ సంస్థలనే నమ్ముకుంటున్నాయి. అవి చెప్పినట్టు చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రజల్లో ఎమోషన్స్ రెచ్చగొట్టడమే ప్రధాన ధ్యేయం. తద్వారా వచ్చే సానుభూతితో రాజకీయ లబ్ది పొందాలి. రాజకీయ పార్టీలన్నీ ఇదే దారిలో పయనిస్తున్నాయనడానికి చాలా ఉదాహరణలున్నాయి. తొలుత అయితే జనం ఇలాంటి నీచ ఎత్తుగడలను పసిగట్ట లేదు కానీ పదే పదే అదే ప్రణాళికను అనుసరిస్తుంటే జనాలకు సీన్ అర్థమైపోయింది.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News