New Year: నూతన సంవత్సర వేడుకల జోష్
ABN , Publish Date - Dec 31 , 2024 | 09:20 AM
విజయవాడ: నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు విజయవాడ నగర ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో మద్యం అమ్మకాల సమయం ఈరోజు, రేపు రాత్రి ఒంటిగంట వరకు ఎక్సైజ్ శాఖ అధికారులు పొడిగించారు.
విజయవాడ: నూతన సంవత్సరానికి స్వాగతం (Welcome to the New Year) పలికేందుకు విజయవాడ నగర ప్రజలు (Vijayawada city People) సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 31 (December 31st) వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్ (Celebrate) చేసుకునేందుకు ప్లాన్ (Plan) చేస్తున్నారు. నూతన సంవత్సర వేడుకల జోష్‌లో ఉన్నారు. ప్రముఖ స్టార్ సింగర్స్, ప్రఖ్యాత టీవీ యాంకర్స్‌తో పాటు పలు ప్రాంతాల్లో ప్రత్యేక డీజేలు, సంగీత కచేరీలు ఏర్పాటు చేస్తున్నారు. నగరంలో ఉన్నప్పుడు హోటల్స్‌లో నూతన సంవత్సర ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మంగళ, బుధవారం మద్యం విక్రయాలు భారీగా ఉండొచ్చునని మద్యం వ్యాపారులు అంటున్నారు. ఇప్పటికే దుకాణదారులు మద్యం డిపోల నుంచి భారీగా మద్యం నిలవలు కొనుగోలు చేశారు.
నూతన సంవత్సర సందర్భంగా మద్యం అమ్మకాల సమయం ఈరోజు, రేపు రాత్రి ఒంటిగంట వరకు ఎక్సైజ్ శాఖ అధికారులు పొడిగించారు. బెల్టు షాపుల ద్వారా అమ్మకాలు ఉండకూడదు అన్న ఉద్దేశంతోనే రాత్రి ఒంటిగంట వరకు మద్యం అమ్మకాలకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. న్యూ ఇయర్ పేరుతో అదనపు వసూలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా రాష్ట్ర సరిహద్దుల్లో ఎక్సైజ్ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టుల వద్ద ప్రత్యేక మొబైల్ పార్టీలు పెట్టారు. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం రాష్ట్రంలోకి రాకుండా ఎక్సైజ్ శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. ప్రతి గంటకు తనిఖీలు చేసే ఫోటోలు ప్రతి చెక్ పోస్ట్ నుంచి పెట్టాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
కాగా ఆంధ్రప్రదేశ్‌లో నూతన సంవత్సరం వేడుకలపై పోలీసులు కఠినమైన ఆంక్షలను విధించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడేందుకు ఈ చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఈ ఆదేశాలు అమలు చేయనున్నట్లు చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సరం వేడుకలు నిర్వహించరాదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పబ్బులు, క్లబ్బులు, ఇతర ప్రదేశాల్లో ఆమోదిత సమయానికి మించి కార్యక్రమాలు నిర్వహించకూడదని ఆదేశించారు.
నూతన సంవత్సర వేడుకల సమయంలో అశ్లీల నృత్యాలు, డీజేల విన్యాసాలు నిర్వహించడంపై పోలీసులు గట్టి నిఘా ఉంచారు. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే ఆ కార్యక్రమ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినోద కార్యక్రమాల పేరుతో అసభ్య ప్రదర్శనలకు తావు ఇవ్వొద్దని సూచించారు. అలాగే వేగంగా బైక్, కార్ రేసులు నిర్వహించడంపై పూర్తిస్థాయి నిషేధం విధించారు. రోడ్లపై రద్దీని పెంచి, ప్రమాదాలకు కారణం అయ్యే రేసింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. రోడ్డు భద్రతను కాపాడేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా గస్తీ పెంచారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రేషన్ బియ్యం మాయం కేసులో అరెస్టులు..
పీఎస్‌ఎల్‌వి-సి 60 విజయవంతంపై సీఎం చంద్రబాబు హర్షం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News