Share News

Krishna Dist.,: బాలుర మిస్సింగ్ కేసును చేధించిన పోలీసులు

ABN , Publish Date - Nov 04 , 2024 | 07:43 AM

గత రెండు రోజుల క్రితం మచిలీపట్నంలో అదృశ్యమైన ముగ్గురు బాలుర మిస్సింగ్ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కృష్ణా జిల్లా పోలీసులు కేవలం 24 గంటల్లోనే చేధించారు. జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు ప్రత్యేకంగా 20 పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి.. బాలురను సురక్షితంగా వారి తండ్రి చెంతకు చేర్చారు.

Krishna Dist.,:  బాలుర మిస్సింగ్ కేసును చేధించిన పోలీసులు

కృష్ణాజిల్లా: గత రెండు రోజుల క్రితం మచిలీపట్నంలో అదృశ్యమైన (Missing) యానాది కుటుంబానికి చెందిన ముగ్గురు మైనర్ బాలుర కేసును (Three Minor Boys Missing Case) పోలీసులు (Police) చేధించారు. జిల్లా అంతటా 20 పోలీస్ ప్రత్యేక బృందాలు గాలించగా నందివాడ మండలం తమిరిశ వద్ద బాలురను గుర్తించిన పోలీసులు తండ్రి చెంతకు చేర్చారు. ముగ్గురు పిల్లల తల్లి ఆరు నెలల క్రితం మృతి చెందగా తండ్రి రాఘవులు ఒక్కడే వీరిని సాకుతున్నాడు. రాఘవులు పిల్లలను ఇంటి వద్దే వదిలి గత నెల 30వ తేదీన అవనిగడ్డ వెళ్లాడు. నవంబర్1వ తేదీ వరకు తన తండ్రి ఇంటికి రాకపోవటంతో తండ్రి మీద బెంగతో ముగ్గురు పిల్లలు కాలి నడకన అవనిగడ్డకు పయనమవ్వగా జీలగలగండి వద్ద నందివాడకు చెందిన ఆటో డ్రైవర్ అయ్యప్ప వీరిని గమనించి ఆటో ఎక్కించుకున్నాడు. ముగ్గురిని వారి ఇంటి వద్ద దించే ప్రయత్నం చేయగా పిల్లలు వారి వివరాలు చెప్పకపోవటంతో తనతోపాటు నందివాడ తీసుకుని వెళ్లాడు. తమకు అందిన సమాచారం మేరకు నందివాడ పోలీసులు ముగ్గురు పిల్లలను అదుపులోకి తీసుకోవడం జరిగిందని డీఎస్పీ అబ్దుల్ సుభాన్ మీడియాకు తెలిపారు.


సంచలనాత్మకమైన మైనర్ బాలుర మిస్సింగ్ కేసును కేవలం 24 గంటల్లోనే కృష్ణా జిల్లా పోలీసులు చేధించారు. కృష్ణాజిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు ప్రత్యేకంగా 20 పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి.. బాలురను సురక్షితంగా వారి తండ్రి చెంతకు చేర్చారు. సంచలనం సృష్టించిన మైనర్ బాలుల మిస్సింగ్ కేసును కృష్ణా జిల్లా పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని కేసును చేధించారు. బాలురను సురక్షితంగా వారి తండ్రికి అప్పగించి, వారి కళ్ళల్లో ఆనందాన్ని చూశారు. ఈ కేసుకు సంబంధించి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బందరు డిఎస్పీ అబ్దుల్ సుభాన్ విలేకరుల సమావేశం నిర్వహించి కేసు పూర్వాపరాలను వివరించారు.

వివరాల్లోనికి వెళ్తే..

కృష్ణాజిల్లా, కాలే ఖాన్ పేట, మచిలీపట్నం, యానాది కాలనీకి చెందిన తుమ్మ రాఘవులుకు చెందిన ముగ్గురు మగ పిల్లలు,1) తుమ్మ శ్రీనివాసరావు (8), 2) తుమ్మ దుర్గారావు (6) 3) తుమ్మ నాగేశ్వరరావు (3). వారి తల్లి మరణించిన నాటి నుండి తండ్రి రాఘవులు వారిని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. అయితే రాఘవులు బండి కేశవరావు అనే వ్యక్తి వద్ద 15 ఏళ్ల నుంచి వ్యవసాయ కూలి పనులు చేస్తూ, తన పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఈనెల 1వ తేదీన తండ్రి వ్యవసాయ కూలి పనులకు వెళ్లి, ఇంటికి వచ్చేసరికి ముగ్గురు పిల్లలు ఇంటి వద్ద కనపడలేదు. రోజు లాగానే పాఠశాలకు వెళ్లి ఉంటారని అనుకున్నాడు. సాయంత్రం అయినప్పటికీ ఇంటికి తిరిగి రాకపోయేసరికి, స్కూల్ వద్దకు వెళ్లి అడగగా వారు ఈరోజు స్కూలుకు రాలేదని చెప్పారు. దీంతో రాఘవులు తెలిసిన వారు, బంధువులు, స్నేహితులను విచారించాడు... అయినా ఎలాంటి ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో ఆందోళన చెందిన రాఘవులు ఇనకుదురు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తు సాగిందిలా..

పిల్లల మిస్సింగ్ కేసును పోలీసులు జిల్లా ఎస్పీకి తెలియజేయగా ఈ కేసును ఆయన అత్యంత ఛాలెంజ్‌గా తీసుకొని, 20 ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటుచేసి, గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అందులో భాగంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని, సిసిటీవీ ఫుటేజ్‌లను, సామాజిక మాధ్యమాలను ఉపయోగించి జిల్లా అంతా జల్లెడ పట్టారు. నందివాడ మండలం, తమ్మిరిస గ్రామంలో పిల్లలు ఉన్నట్లుగా గుర్తించి వారి వద్దకు వెళ్లి, వారిని సురక్షితంగా తీసుకువచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వారి కోసమే రెడ్‌బుక్.. హోం మంత్రి

84 వేల కోట్ల పెట్టుబడులు 5 లక్షల ఉద్యోగాలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 04 , 2024 | 07:45 AM