Share News

Ration Rice Case: రేషన్ బియ్యం మాయం కేసులో అరెస్టులు..

ABN , Publish Date - Dec 31 , 2024 | 08:39 AM

కృష్ణాజిల్లా, మచిలీపట్నం, వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోడౌన్‌లో రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులు దూకుడు పెంచారు. తాజాగా రైస్ మిల్లర్ బొర్రా ఆంజనేయులు, లారీ డ్రైవర్ బోట్ల మంగారావులను పోలీసులు అరెస్టు చేశారు.

Ration Rice Case: రేషన్ బియ్యం మాయం కేసులో అరెస్టులు..
Ration Rice Case

కృష్ణాజిల్లా, మచిలీపట్నం: వైఎస్సార్‌సీపీ నేత (YSRCP Leader), మాజీ మంత్రి పేర్ని నాని (Ex Minister Perni Nani)కి చెందిన గోడౌన్‌లో రేషన్ బియ్యం (Ration Rice) మాయం కేసు (Case)లో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. కేసు విచారణలో భాగంగా సివిల్ సప్లయిస్ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డిని సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే గోడౌన్ మేనేజర్ మానస తేజాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కోటిరెడ్డి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే బియ్యం మాయం అయినట్లు తనపై అనుమానం రాకుండా ముందుగానే కోటిరెడ్డి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తాజాగా రైస్ మిల్లర్ బొర్రా ఆంజనేయులు (Borra Anjaneyulu), లారీ డ్రైవర్ బోట్ల మంగారావు (Botla Mangarao)లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను న్యాయమూర్తి ఎదుట ప్రవేశ పెట్టారు. వైద్య పరీక్షల అనంతరం ఎస్కార్టు వాహనంలో బందరు తాలుకా పీఎస్ నుండి కోర్టుకు తరలించారు. విచారణ జరిపిన న్యాయమూర్తి నిందితులకు 12 రోజులు రిమాండ్ విధించారు. దీంతో వారిని పోలీసులు జైలుకు తరలించారు.


జయసుధకు ముందస్తు బెయిలు మంజూరు..

కాగా రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధకు కోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసింది. సోమవారం కృష్ణాజిల్లా కోర్టు ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ కేసులో పోలీస్ విచారణకు సహకరించాలంటూ పేర్ని జయసుధకు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. ఈ మేరకు న్యాయమూర్తి జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. బందరు మండలం పోట్లపాలెంలో సమీపంలో పేర్ని నాని తన భార్య జయసుధ పేరు మీద.. బఫర్ గోడౌన్ నిర్మించారు. అయితే వార్షిక తనిఖీల్లో భాగంగా ఇటీవల ఆ గోడౌన్లలో పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు తనిఖీలు చేపట్టారు. అయితే గోడౌన్‌లో ఉన్న బియ్యం నిల్వకు.. అధికారిక పత్రాల్లో ఉన్న నిల్వలకు భారీ వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు.

ఆ క్రమంలో దీనిపై మాజీ మంత్రి పేర్ని నాని భార్యను వివరణ కోరారు. వే బ్రిడ్జ్ సరిగ్గా పని చేయడం లేదంటూ.. తొలుత పేర్ని నాని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీంతో పేర్ని జయసుధకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. దాంతో బియ్యం షార్టేజ్‌కు సంబంధించి.. 1.79 కోట్ల డీడీని ప్రభుత్వానికి ఆమె చెల్లించారు. మరోవైపు ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అందులోభాగంగా గోడౌన్‌లో మొత్తం 378 మెట్రిక్ టన్నుల బియ్యం షార్టేజ్ వచ్చినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో అదనంగా మరో రూ. 1.67 కోట్లు చెల్లించాలంటూ పేర్ని జయసుధకు జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ సోమవారం నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారంపై పేర్ని కుటుంబం ఎలా స్పందిస్తుందనే చర్చ జిల్లాలో వాడి వేడిగా నడుస్తోంది.


మరోవైపు.. గత జగన్ ప్రభుత్వ హయాంలో పేర్ని నాని సమాచార పౌర సంబంధాలు, రవాణా శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై పేర్ని నాని.. ప్రెస్ మీట్ పెట్టి తనదైన శైలిలో స్పందించే వారు. అంతేకాదు.. ఆయనకు మంత్రి పదవి లేకున్నా.. ప్రతి అంశంపై మాట్లాడుతుండే వారు. ఆ క్రమంలో నాటి ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలపై విమర్శలు గుప్పించేవారు. అయితే ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవి చూసింది. ఆ పార్టీకి కేవలం 11 సీట్లు మాత్రమే దక్కాయి. దీంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా సైతం దక్కలేదు. అలాంటి వేళ.. వార్షిక తనిఖీల్లో పేర్ని నాని సతీమణికి సంబంధించిన గోడౌన్లలో రేషన్ బియ్యం మాయం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అంతేకాదు.. ఈ బియ్యం మాయం కేసులో తమ తప్పు ఒప్పుకున్నట్లుగా ప్రభుత్వానికి కోట్లాది రూపాయిలు సైతం చెల్లించడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మరింది. అలాగే ఈ వ్యవహరంపై తీవ్ర చర్చ సాగుతోన్న సమయంలో.. మాజీ మంత్రి పేర్ని నాని సరైన రీతిలో స్పందించక పోవడం పట్ల విమర్శలు సైతం వెల్లువెత్తాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

పీఎస్‌ఎల్‌వి-సి 60 విజయవంతంపై సీఎం చంద్రబాబు హర్షం

‘కెజియఫ్’ స్టార్ సంచలన లేఖ

వైఎస్ జగన్‌కు ఊహించని షాక్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 31 , 2024 | 08:39 AM