Share News

Sea Plane: తొలిసారిగా విజయవాడ నుంచి శ్రీశైలం వరకు సీప్లెయిన్

ABN , Publish Date - Nov 08 , 2024 | 01:40 PM

Andhrapradesh: సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సీ ప్లెయిన్‌‌లో ప్రయాణం చేయనున్నారు. సీప్లెయిల్‌లో శ్రీశైలంకు రానున్నారు సీఎం చంద్రబాబు. అదే సీ ప్లెయిన్‌లో తిరిగి పున్నమి ఘాట్‌కు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో పున్నమి ఘాట్‌‌లో ఈరోజు (శుక్రవారం) నిపుణులు సారధ్యంలో ట్రైల్ రన్‌ను నిర్వహించారు.

Sea Plane: తొలిసారిగా విజయవాడ నుంచి శ్రీశైలం వరకు సీప్లెయిన్
Sea plane trial run successful

విజయవాడ, నవంబర్ 8: తొలిసారిగా విజయవాడ నుంచి శ్రీశైలం వరకు సి‌ప్లెయిన్ ప్రయోగానికి ఏపీ సర్కార్ శ్రీకారం చుట్టింది. రేపు (శనివారం) సీఎం చంద్రబాబు (CM Chandrababu), కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు (Union Minister Rammohan Naidu) సీ ప్లెయిన్‌‌లో ప్రయాణం చేయనున్నారు. సీప్లెయిల్‌లో శ్రీశైలంకు రానున్న సీఎం చంద్రబాబు.. శ్రీశైలం శ్రీ భ్రమరాంభిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోనున్నారు. అదే సీ ప్లెయిన్‌లో తిరిగి పున్నమి ఘాట్‌కు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో పున్నమి ఘాట్‌‌లో ఈరోజు (శుక్రవారం) నిపుణులు సారధ్యంలో ట్రైల్ రన్‌ను నిర్వహించారు. సీపీ, కలెక్టర్ పర్యవేక్షణలో ట్రైల్ రన్ విజయవంతమైంది.

Viral Video: హైనాల నుంచి మిత్రుడిని కాపాడుకున్న సింహం.. ప్రాణాలు తీసే సమయంలో చెట్టు పైనుంచి..


దీనిపై సీపీ రాజశేఖరబాబు మాట్లాడుతూ.. నేడు, రేపు సీప్లెయిన్ ట్రయల్ రన్ జరుగుతుందన్నారు. ముందుగా ఇవాళ ఏఎస్‌ఎల్ నిర్వహిస్తున్నామని తెలిపారు. శ్రీశైలం వరకూ సీఎం చంద్రబాబు ప్రయాణిస్తారన్నారు. 1000 మంది పబ్లిక్ వీక్షించేలా ఇక్కడ ఏర్పాట్లు చేశామని చెప్పారు. సీఎం చంద్రబాబు రాకకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. అన్ని శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు రేపు ఇక్కడకు రానున్నట్లు తెలిపారు. పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని సీపీ రాజశేఖర బాబు వెల్లడించారు.

KTR: మెఘా కృష్ణారెడ్డిని అరెస్ట్ చేసే దమ్ముందా..


మరోవైపు శ్రీశైలం రిజర్వాయర్ వద్దకు సీ ప్లెయిన్ విమానం చేరుకుంది. విజయవాడ పున్నమి ఘాట్ నుంచి శ్రీశైలం జలాశయానికి సీప్లెయిన్ విమానం ట్రైల్ రన్‌‌ను అధికారులు నిర్వహించారు. అయితే సీఎం రాక సందర్భంగా శ్రీశైలం రిజర్వాయర్ చుట్టూ భారీ పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్ చుట్టుపక్కల అడవులను గ్రేహౌండ్స్ పోలీసు బలగాలు జల్లెడ పడుతున్నాయి. శ్రీశైలం రిజర్వాయర్‌లో హైస్పీడ్ ఇంజన్ బోట్లలో రెస్క్యూ టీమ్ పర్యవేక్షణకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైలం పర్యటనకు భారీగా పోలీసు బలగాలు మోహరించారు. డాగ్ స్క్వాడ్, బాంబు స్వ్కాడ్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా పరిశీలిస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

Harish Rao: మూసీ మురికికూపానికి కారణం మీరు కాదా..

Chennai: రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి రాకెట్‌ లాంఛర్‌ లభ్యం

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 08 , 2024 | 01:40 PM