Share News

Dr. Samaram: మీ ఓటును అమ్ముకుని ...‌ కష్టాలు తెచ్చుకోవద్దు: డాక్టర్ సమరం

ABN , Publish Date - Mar 27 , 2024 | 12:44 PM

విజయవాడ: ప్రజాస్వామ్యంలో‌ప్రజలే యజమానులని, ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవకులని, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, సేవ పేరుతో ప్రజలకు యజమానులుగా వ్యవహరిస్తున్నారని డాక్టర్ సమరం వ్యాఖ్యానించారు.

Dr. Samaram: మీ ఓటును అమ్ముకుని ...‌ కష్టాలు  తెచ్చుకోవద్దు: డాక్టర్ సమరం

విజయవాడ: ప్రజాస్వామ్యంలో‌ప్రజలే యజమానులని, ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవకులని, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, సేవ పేరుతో ప్రజలకు యజమానులుగా వ్యవహరిస్తున్నారని డాక్టర్ సమరం (Dr. Samaram) వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు దాసోహమై (People Enslaved) ఉండాలనే ఝాడ్యం పెరుగుతోందని, ప్రజల్లో మార్పు (Change) ద్వారా ఇటువంటి నియంతృత్వానికి చెక్ (Check) పెట్టాలన్నారు. ఓటు హక్కు (Right to Vote)తో సమాజాన్ని మార్చాలని, ఓటును అమ్ముకుని ...‌ కష్టాలు తెచ్చుకోవద్దని సూచించారు. ప్రజల్లో చైతన్యం తేవాలని.. ఓటు విలువ, బలం గురించి చెప్పాలన్నారు. చదువుకున్న వారిలో నిర్లిప్తత వల్ల కొంతమందికి వరంగా మారుతుందని, విద్యావంతులు వివేకంతో ఆలోచన చేసి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించు కోవాలన్నారు. లేదంటే నిమ్మగడ్డ రమేష్ (Nimmagadda Ramesh) తరహాలో నియంతృత్వాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని డాక్టర్ సమరం అన్నారు.

Updated Date - Mar 27 , 2024 | 12:49 PM