Share News

Srinivas Varma: అదే వాస్తవం.. టీటీడీ లడ్డూ వివాదంపై కేంద్రమంత్రి

ABN , Publish Date - Sep 28 , 2024 | 03:07 PM

Andhrapradesh: వైసీపీ అధికారంలోకి వచ్చాక తిరుపతి ప్రతిష్ఠ దిగజారిందని కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ అన్నారు. గతంలో దేవలయాలపై దాడులు జరిగితే ఒక్కరిపైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. రామ తీర్ధంలో రాముడి తల తీశారని.. అంతర్వేదిలో రథం దగ్దం చేశారన్నారు. కొవ్వు పదార్ధాలు కలిసిన నెయ్యిని దిగుమతి చేసుకున్నారన్నది వాస్తవమని స్పష్టం చేశారు.

Srinivas Varma: అదే వాస్తవం.. టీటీడీ లడ్డూ వివాదంపై కేంద్రమంత్రి
Union Minister Srinivas Verma

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: టీటీడీ లడ్డూ (Tirumala Laddu) వివాదంపై కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ (Union Minister Srinivas Varma) స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ (YSRCP) అధికారంలోకి వచ్చాక తిరుపతి ప్రతిష్ఠ దిగజారిందన్నారు. గతంలో దేవలయాలపై దాడులు జరిగితే ఒక్కరిపైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. రామ తీర్ధంలో రాముడి తల తీశారని.. అంతర్వేదిలో రథం దగ్దం చేశారన్నారు. కొవ్వు పదార్ధాలు కలిసిన నెయ్యిని దిగుమతి చేసుకున్నారన్నది వాస్తవమని స్పష్టం చేశారు. లాబ్ రిపోర్ట్స్ ఉన్నాయన్నారు.

Bandi Sanjay: హైడ్రా తీరుపై స్వయంగా పాట పాడిన బండి సంజయ్


గతంలో ఏడు కొండలను రెండు కొండలు చేద్దామనుకున్న వ్యక్తి రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. హిందు ధర్మం ప్రకారం దంపతులు పట్టు వస్త్రాలు ఇచ్చేవారని.. కానీ జగన్‌ ఒక్కరే ధర్మానికి వీరుద్ధంగా పట్టు వస్త్రాలు ఇచ్చారని తెలిపారు. డిక్లరేషన్ ఇవ్వాలన్నది చాలా సంవత్సరాలుగా ఉన్న నిబంధన అని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుపతి వెళ్లారన్నారు. లడ్డూ విషయంలో తొమ్మింది మందితో సిట్ ఏర్పాటు చేశారని.. లడ్డూ విషయంలో అవకతవకలు బయటకు వస్తాయన్నారు.


తిరుమల అవకతవకలపై సిట్ దర్యాప్తు చేసి నివేదికను ప్రభుత్వం ముందు ఉంచుతుందని భవిస్తున్నట్లు తెలిపారు. వైసీపీ హయాంలో టీటీడీని తన కుటుంబ సభ్యుల ఆధీనంలో పెట్టుకున్నారని ఆరోపించారు. తిరుపతిని జగన్ కుటుంబ సభ్యుల చేతుల్లో పెట్టింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. స్వామి వారిని కించపరిచే వారు బయటపడరని.. అవసరమైతే కేంద్రం తన వంతు పాత్ర పోషిస్తుందన్నారు. టీటీడీ లడ్డు వివాదంపై ఇప్పటికే కావాల్సిన వివరాలను కేంద్రం అడిగిందని కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ వెల్లడించారు.

Jani Master: జానీ మాస్టర్‌కు మరో షాక్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు..



విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై..

విశాఖ ఉక్కు పరిశ్రమలో పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో ప్రజల సెంటిమెట్లను నిలబెట్టేలా ప్రయత్నిస్తున్నామని కేంద్రమంత్రి చెప్పారు. స్టీల్ ప్లాంట్ విషయంలో కొత్త ప్రక్రియ ఏమి లేదని స్పష్టం చేశారు. 2014 ముందు ఉన్న ప్రభుత్వం నిర్ణయాలపైనే ప్రస్తుతం చర్చ జరుగుతుందన్నారు. ఉద్యోగుల భద్రత,సెంటిమెంట్లకు ప్రాధాన్యత ఇస్తున్నామని.. ప్రత్యామ్నాయాల గురించి ఆలోచన చేస్తున్నామన్నారు. వాస్తవ పరిస్థితులు పరిశీలన చేసి శాశ్వత పరిష్కారం కోసం పని చేస్తున్నామని తెలిపారు. ప్యాకేజీలతో తాత్కాలిక ఉపశమనం కాకుండా శాశ్వత పరిష్కారం కోసం పనిచేస్తున్నామని అన్నారు.

Viral Video: వామ్మో.. ఇకపై టమాటాలు తినాలంటే ఆలోచించాలేమో.. ఈ పాము చేసిన నిర్వాకం చూడండి..



ఆర్థిక మంత్రి నుంచి ప్రధాని దృష్టికి విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ముందుకు తీసుకెళ్లాలని, ఉద్యోగులకు నష్టం కలగకుండా చూడాలని ఆలోచన చేస్తున్నామన్నారు. సెయిల్ ఆధ్వర్యంలో ఉన్న పరిశ్రమలు లాభాల్లో ఉన్నాయన్నారు. అవసరం లేకపోయినా విస్తృతపరచడం, గత పాలకుల నిర్ణయాలు, రాయబరేలిలో పరిశ్రమలు పెట్టడం, వేల కోట్లు పెట్టుబడులు పెట్టడం వల్ల స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి వెళ్ళిందన్నారు. నష్టాలను భరించడం కేంద్ర ప్రభుత్వానికి సాధ్యం కాదని వెల్లడించారు. కేంద్రం సాయం చేస్తూ పరిశ్రమను లాభల్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఇది ప్రజా ధనం.. నష్టాల్లో ఉన్న పరిశ్రమ కోసం నిధులు ఖర్చు చేసే పరిస్థితి లేదని తెలిపారు. ఆర్థికమంత్రికి స్టీల్ ప్లాంట్‌పై అవగాహన ఉందన్నారు. సెయిల్, ఎన్‌ఎండీసీ అధికారులతో సమావేశం అయ్యానని.. సెయిల్ ఆధ్వర్యంలో ఉన్న పరిశ్రమలు లాభాల్లో ఉన్నాయని. కొన్ని అంశాలపై చర్చించినట్లు తెలిపారు.


నష్టాల్లో ఉన్న పరిశ్రమను విలీనం చేసే సమయంలో సాంకేతిక సమస్యలు ఉంటాయని..వాటిని అధిగమించాలనే అంశంపై సెయిల్ అధికారులతో చర్చ జరిపానన్నారు. ఆర్‌ఐఎన్‌ఎల్ దగ్గర అదనంగా ఉన్న 1500 ఎకరాల భూమిని ఎన్‌ఎండీసీకి ఇచ్చి ఆర్థిక సహకారం, పరిశ్రమ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే దానిపై ఎన్‌ఎండీసీ సంస్థతో చర్చించినట్లు తెలిపారు. కార్మికులు ఆందోళన చెందడం సహజమని.. సాధ్యాసాధ్యాలను అర్ధం చేసుకోవాలన్నారు. ఉద్యోగులు, కార్మికులను తప్పు పట్టడం లేదని తెలిపారు. ఉత్పత్తి ఎంత.. కార్మికులు ఎంత అన్న సమాచారం తీసుకున్నామన్నారు. మిగతా సంస్థలతో పోలిస్తే విశాఖ స్టైల్ ప్లాంట్‌లో కార్మికులు ఎక్కువ ఉన్నారని.. ఉత్పత్తి తక్కువగా ఉందన్నారు. కార్మికులను బాధ్యులను చేయలేమన్నారు. సమర్ధవంతమైన అధికారులను నియమించామని తెలిపారు. పనిలేనప్పుడు కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించక తప్పదన్నారు. నష్టాలు భరించే పరిస్థితి ప్రభుత్వానికి లేదని.. శాశ్వత పరిష్కారం కోసం పనిచేస్తున్నామని కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

Anitha: జగన్‌ను పులికేశితో పోలుస్తూ అనిత సెటైర్...

Somireddy: అలా చేస్తే భారతమ్మ ఇంట్లోకి రానీయదా.. జగన్‌కు సూటి ప్రశ్న

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 28 , 2024 | 03:32 PM