Andhra Pradesh: విజయవాడలో కేశినేని నానికి బిగ్ షాక్..!
ABN , Publish Date - Jan 10 , 2024 | 09:01 PM
విజయవాడ, జనవరి 10: తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరబోతున్నట్లు ప్రకటించిన విజయవాడ ఎంపీ కేశినేనికి నానికి బిగ్ షాక్ ఇస్తున్నారు ఆయన అనుచరులు. మీడియా వేదికగా 60 శాతం టీడీపీ శ్రేణులు తనతో పాటే వస్తారని ప్రకటించిన నాని.. గట్టి ఝలక్ ఇస్తున్నారు.
విజయవాడ, జనవరి 10: తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరబోతున్నట్లు ప్రకటించిన విజయవాడ ఎంపీ కేశినేనికి నానికి బిగ్ షాక్ ఇస్తున్నారు ఆయన అనుచరులు. మీడియా వేదికగా 60 శాతం టీడీపీ శ్రేణులు తనతో పాటే వస్తారని ప్రకటించిన నాని.. గట్టి ఝలక్ ఇస్తున్నారు. తామెవరం నీ వెంట రాలేం అంటూ తేల్చి చెప్పేస్తున్నారు. దీంతో కేశినేని నాని ఖంగుతిన్నారట.
ఇవాళ సీఎం జగన్‌తో భేటీ అయిన కేశినేని నాని.. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే తాను వైసీపీలో చేరుతానని ప్రకటించారు. అంతేకాదు.. తన వెంట కృష్ణా జిల్లాలోని 60 శాతం మంది టీడీపీ శ్రేణులు వస్తారని చెప్పారు. ఈ క్రమంలోనే.. కేశినేని నాని తన అనుచరులకు ఫోన్ చేసి తనతో కలిసి రావాల్సిందిగా ఫోన్లు చేశారట. వివిధ నియోజకవర్గాల్లోని అతను అనుచరులకు ఫోన్ చేసి వైసీపీలోకి వెళ్దామని చెప్పారట. అయితే, ఆయన అనుచరులెవరూ ఆయనతో పాటు వైసీపీలోకి వెళ్లేందుకు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. కేశినేని నాని వెళ్లబోమని టీడీపీ నేతలు తేల్చి చెప్పారట.
విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లోని ముఖ్య నేతలందరికీ ఫోన్ చేసి ఇదే విషయమై కోరగా.. వారు తిరస్కరించారట. మైలవరం టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావుకు ఫోన్ చేసి వైసీపీలోకి వెళ్దామని కోరగా.. ఆయన కుదరదని చెప్పారట. తెలుగుదేశం వీడి వచ్చేదే లేదంటూ కేశినేనికి చెప్పేశారు బొమ్మసాని. జగన్ ఇంటి గడప తొక్కాక.. కేశినేనిని కలిసేదే లేదంటున్నారు బొమ్మసాని. అంతేకాదు.. లోకేష్ వద్దకు వెళ్లి తాను తెలుగుదేశంలోనే ఉంటానని స్పష్టం చేశారు బొమ్మసాని సుబ్బారావు. మొత్తాను తాను ఏదో అనుకుంటే.. అక్కడ మరేదో అవుతోందని తెగ మదనపడిపోతున్నారట కేశినేని నాని.