Share News

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ రంగంలోకి దిగడంతో యువతి మిస్సింగ్ కేసులో వీడిన మిస్టరీ

ABN , Publish Date - Jul 02 , 2024 | 03:47 PM

తమ కుమార్తె కనిపించడం లేదంటూ భీమవరంకు చెందిన శివ కుమారి అనే మహిళ ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఫిర్యాదు చేసిన విషయం తెలిసింది. యువతి మిస్సింగ్ వ్యవహారంలో పవన్ కల్యాణ్ స్వయంగా సీఐకి ఫోన్ చేసి మాట్లాడిన ఈ కేసులో కీలక పురోగతి లభించించింది.

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ రంగంలోకి దిగడంతో యువతి మిస్సింగ్ కేసులో వీడిన మిస్టరీ

విజయవాడ: తమ కుమార్తె కనిపించడం లేదంటూ భీమవరంకు చెందిన శివ కుమారి అనే మహిళ ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఫిర్యాదు చేసిన విషయం తెలిసింది. యువతి మిస్సింగ్ వ్యవహారంలో పవన్ కల్యాణ్ స్వయంగా సీఐకి ఫోన్ చేసి మాట్లాడిన ఈ కేసులో కీలక పురోగతి లభించించింది. డిప్యూటీ సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన బెజవాడ పోలీసులు కేసును ఛేదించారు.


విజయవాడ రామవరప్పాడుకు చెందిన యువకుడితో సదరు యువతి జమ్మూలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. జమ్మూ నుంచి ఇద్దరినీ విజయవాడ తీసుకొస్తున్నారని, స్పెషల్ టీమ్ వారిని వెంటబెట్టుకొని వస్తోంది. కాగా పవన్ కల్యాణ్ ఆదేశాలతో యువతి మిస్సింగ్ కేసుపై నగర పోలీసు కమిషనర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. దీంతో దాదాపు 9 నెలల తర్వాత యువతి ఆచుకీ లభ్యమైంది.


అసలేం జరిగిందంటే..?

విజయవాడలో చదువుతున్న తన కుమార్తెను ప్రేమ పేరుతో ట్రాప్ చేశారని, కిడ్నాప్ చేశారని బాధితురాలు శివకుమారి కన్నీరుమున్నీరుగా ఏడ్చారు. చాలా కాలం గడిచినా కుమార్తె జాడ తెలియడంలేదని వాపోయారు. మాచవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని పవన్‌కు ఆమె ఫిర్యాదు చేశారు. తమ కూతురు ఆచూకీ తెలిసినా పోలీసులు స్పందించలేదని, జాడ తెలిశాక కూడా తమ బిడ్డను అప్పగించడంలేదని శివకుమారి ఆరోపించారు. దీంతో ఆమె బాధను చూసి పవన్ కల్యాణ్ తక్షణమే స్పందించారు. శివకుమారి వద్ద ఎఫ్ఐఆర్ కాపీని పరిశీలించారు. వెంటనే మాచవరం సీఐకి ఫోన్ చేసి మిస్సింగ్ కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసును సత్వరం ఛేదించాలని ఆదేశించారు.

Updated Date - Jul 02 , 2024 | 03:56 PM