YS Jagan: నేను చెప్పిందే జరిగింది.. చంద్రబాబుపై జగన్ షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Dec 19 , 2024 | 03:03 PM
Andhrapradesh: సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరు నెలలు తిరక్కముందే చంద్రబాబు ప్రభుత్వంమీద తీవ్ర వ్యతిరేకత ఉందని.. ఇంతటి వ్యతిరేకత గతంలో ఏ ప్రభుత్వం మీదా లేదని తెలిపారు. ప్రతి కుటుంబానికి మనం మంచిచేశాం.. కానీ చంద్రబాబు అంతకంటే ఎక్కవ చేస్తానంటూ, ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికీ ఒక హామీ ఇచ్చారు’’ అని అన్నారు.
అమరావతి, డిసెంబర్ 19: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై (CM Chandrababu Naidu) మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Former CM YS Jaganmohan reddy) మరోసారి విరుచుకుపడ్డారు. ఉమ్మడి అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ప్రతినిధులు, పార్టీ నాయకులతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నేతలతో జగన్ ముఖ్య విషయాలపై చర్చ జరిపారు. ఆరు నెలలు తిరక్కముందే చంద్రబాబు ప్రభుత్వంమీద తీవ్ర వ్యతిరేకత ఉందని.. ఇంతటి వ్యతిరేకత గతంలో ఏ ప్రభుత్వం మీదా లేదని తెలిపారు. ‘‘ప్రతి కుటుంబానికి మనం మంచిచేశాం.. కానీ చంద్రబాబు అంతకంటే ఎక్కవ చేస్తానంటూ, ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికీ ఒక హామీ ఇచ్చారు. మనం కూడా అలాంటి హామీలు ఇద్దామని చాలామంది నాతో అన్నారు. గడచిన ఐదేళ్లలో చరిత్రలో ఎప్పుడూ చూడని మార్పులు తీసుక వచ్చాం. ఎన్నికల మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేశాం. మేనిఫెస్టోకు పవిత్రత తీసుకువచ్చాం, ప్రతి హామీని తూచా తప్పకుండా అమలు చేశాం’’ అని మాజీ ముఖ్యమంత్రి అన్నారు.
చంద్రబాబును నమ్మడమంటే..
‘‘కోవిడ్ లాంటి సమస్యలు వచ్చినా, ప్రభుత్వ ఆదాయాలు తగ్గినా, ఖర్చు పెరిగినా, సాకులు చూపకుండా, కారణాలు చెప్పకుండా ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను, వాగ్దానాలను అమలు చేశాం. బడ్జెట్లోనే సంక్షేమ క్యాలెండర్ ప్రకటించాం. క్యాలెండర్ ప్రకారం ప్రతి పథకాన్ని అమలు చేశాం. చంద్రబాబు మాటలను పదిశాతం ప్రజలు కూడా నమ్మారు, నమ్మించగలిగారు. అందుకనే పరాజయం పాలయ్యాం. జగన్ చేశారు కదా.. చంద్రబాబు కూడా చేస్తారేమోనని కొంతమంది అనుకున్నారు. ఆరునెలలు కూడా గడవకముందే చంద్రబాబు మోసాలు, అబద్ధాలు మన అందరికీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. చంద్రబాబును నమ్మడమంటే.. చంద్రముఖిని లేపడమే, పులినోట్లో తలపెట్టడమే అని ఆరోజు చెప్పాను. దాన్ని ఇవాళ చంద్రబాబుగారు నిజం చేస్తున్నారు’’ అని వ్యాఖ్యలు చేశారు.
అదీ పోయింది.. ఇదీ పోయింది..
జగన్ పలావు పెట్టారని.. చంద్రబాబు బిర్యానీ పెడతానని అన్నారని ఇప్పుడు పలావు పోయిందీ, బిర్యానీ పోయిదన్నారు. ఉన్న పథకాలు పోయాయని.. ఇస్తానన్న పథకాలు రావడంలేదని విమర్శించారు. ఇప్పుడు ప్రజలపై బాదుడే బాదుడు పూనుకున్నారని అన్నారు. ఆరునెలల్లోనే వేల కోట్లకుపైగా భారాన్ని ప్రజలపై కరెంటు ఛార్జీల రూపంలో వేశారని విమర్శించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని.. స్కామ్‌లమీద స్కాంలు నడుస్తున్నాయని ఆరోపించారు. శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా.. ఇలా మాఫియాలు నడుస్తున్నాయన్నారు. మైనింగ్ జరగాలన్నా, ఏ కాంట్రాక్టు చేయాలన్నా ప్రతి ఎమ్మెల్యే నుంచి మొదలుకుని ముఖ్యమంత్రి వరకూ నాకింత.. నీకింత నడుస్తోందని అన్నారు.
AP Cabinet: ఏపీ క్యాబినెట్ భేటీలో కీలక బిల్లులకు ఆమోదం
మనం గొంతు విప్పాలి...
‘‘మనం అంతా పోరాటాలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఆదిశగా పార్టీ అడుగులు వేయాలి. ప్రభుత్వమీద వ్యతిరేకత పార్టీకి సానుకూలంగా మారాలంటే ప్రజా సమస్యలపై కలిసి పోరాటం చేయాలి. దీనిపై పార్టీ నాయకత్వాన్ని అంతా చైతన్యం చేస్తున్నాం. ఆరునెలలకే మనం పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబు పాలన అలా నడుస్తోంది. రైతులకు మనం ఇచ్చే ఏడాదికి రూ.13,500 ఎగిరిపోయింది, చంద్రబాబు ఇస్తానన్న రూ.20వేలు ఇవ్వని పరిస్థితి. ఉచిత పంటల బీమాను ఎత్తివేశారు. ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేశారు. పంటలకు ఎక్కడా గిట్టుబాటు ధరలు దొరకడం లేదు. ధాన్యం కొనుగోలు సమయంలోనే రైతులకు ఎఫ్‌టీవో ఇచ్చేవాళ్లం. రూ.300-400 తక్కువ రేటుకు రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తోంది. దీనిపై ఇది వరకే మనం కార్యక్రమం చేశాం. ఈనెల 27న కరెంటు ఛార్జీల మీద నిరసన వ్యక్తం చేస్తూ మరో కార్యక్రమం చేస్తున్నాం. పెరిగిన బిల్లులు చూపిస్తూ వాటిని కాల్చివేస్తున్న పరిస్థితులు చేస్తున్నాం. కరెంటు ఛార్జీల పెంపు మీద నిరసన కార్యక్రమాన్ని నియోజకవర్గాల స్థాయిలో చేపడుతున్నాం. మళ్లీ జనవరి 2న ఫీజురియింబర్స్‌మెంట్, వసతి దీవెన మీద చేస్తున్నాం. మన హయాంలో ప్రతి త్రైమాసికానికి తల్లుల ఖాతాల్లోకి డబ్బులు పంపాం. జనవరి ఒకటో తేదీ నాటికి నాలుగు త్రైమాసికాలుగా ఫీజులు చెల్లించడం లేదు. అలాగే వసతి దీవెన బిల్లు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తంగా రూ.3,900 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో చదువులకు తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి. డబ్బులు కట్టలేక పిల్లలు చదువులు మానేస్తున్నారు. వీరికి అండగా జనవరి 3న జిల్లా కేంద్రంగా పార్టీ కార్యక్రమం చేస్తుంది. ప్రజల తరఫున మనం గొంతు విప్పాలి. అప్పుడే మనం నాయకులుగా ఎదుగుతాం. నాయకులుగా ఎదగడానికి ఇదొక అవకాశం’’ అని నేతలను ఉద్దేశించి జగన అన్నారు.
నా భార్య కనీసం 20 సార్లు...
‘‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడ కష్టాలు, నష్టాలు ఉంటాయి. కేసులు కూడా పెడతారు, జైళ్లలో కూడా పెడతారు. ప్రతి కష్టానికి ఫలితం ఉంటుంది, చీకటి తర్వాత వెలుగు కూడా వస్తుంది. ఏ కష్టం ఎవరికి ఎప్పుడు వచ్చినా. నా వైపు చూడండి.16 నెలలు నన్ను జైళ్లో పెట్టారు. నా భార్య బెయిల్ పిటిషన్ కనీసంగా 20 సార్లు పెట్టి ఉంటుంది. కింద కాంగ్రెస్, పైన కాంగ్రెస్. ఇన్ని కష్టాలు పెట్టినా.. నేను ముఖ్యమంత్రిని కాలేదా? ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఎల్లకాలం కష్టాలు ఉండవు. ఎవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీ అందరికీ జగనన్న, పార్టీ తోడుగా ఉంటుంది. సాగునీటి సంఘాల ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. సచివాలయ స్థాయిలో ఇవ్వాల్సిన నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వకుండా చేశారు. వీఆర్వోలను మండల కేంద్రాలకు రప్పించి, పోలీసులను కాపలాగా పెట్టించి ఎన్నికలు జరిపారు. అలాంటప్పుడు ఎన్నికలు జరపడం ఎందుకు? రాజీనామాలు చేసి బయటకు వస్తే, రైతులు సంతోషంగా ఉన్నారా? లేదా? తెలుస్తుంది’’ అని చెప్పుకొచ్చారు.
అదీ విజన్ అంటే..
విజన్ 2047 పేరిట మరో డ్రామాకు తెరతీశారని మండిపడ్డారు. ఈ మేనిఫెస్టోకు దిక్కులేదు కానీ.. ఇప్పుడు 2047కు అర్థం ఏముంటుందని ప్రశ్నించారు. ఇప్పుడు చంద్రబాబు వయస్సు దాదాపు 80 ఏళ్లు అని.. ఒక మనిషిని అభివృద్ధి బాటలో పట్టించడమే విజన్ అని తాను నమ్ముతానన్నారు. ఇప్పటి పిల్లాడు 20 ఏళ్ల తర్వాత ఎలా ఉండాలన్నదానిపై ఆలోచనలు చేస్తే అది విజన్ అవుతుంది అని జగన్ మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి...
Hyderabad: భర్త మోసం చేశాడని భార్యకు వేధింపులు
వాహనదారులకు షాక్.. హైకోర్టు సంచలన ఆదేశాలు..
Read Latest AP News And Telugu News