Share News

AP ASSEMBLY: అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేల హాజరుపై సందిగ్ధత..!

ABN , Publish Date - Jun 18 , 2024 | 12:13 PM

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 21 నుంచి ప్రారంభమవుతాయి. ఇటీవల జరిగిన ఏపీ శాసనసభ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలంతా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేస్తారు. శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేల్లో సీనియర్ సభ్యుడిని ప్రోటెం స్పీకర్‌గా గవర్నర్ నామినేట్ చేస్తారు.

AP ASSEMBLY: అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేల హాజరుపై సందిగ్ధత..!
YSRCP MLA's

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 21 నుంచి ప్రారంభమవుతాయి. ఇటీవల జరిగిన ఏపీ శాసనసభ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలంతా సమావేశాల ప్రారంభం రోజున ప్రమాణ స్వీకారం చేస్తారు. శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేల్లో సీనియర్ సభ్యుడిని ప్రోటెం స్పీకర్‌గా గవర్నర్ నామినేట్ చేస్తారు. ప్రోటెం స్పీకర్ ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మొత్తం ఏపీ అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేలు ఉండగా టీడీపీ నుంచి 135 మంది, జనసేన నుంచి 21, వైసీపీ నుంచి 11 మంది, బీజేపీ నుంచి 8 మంది గెలిపొందారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీచేయగా.. మూడు పార్టీల నుంచి మొత్తం 164 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరంతా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం పూర్తైన తర్వాత 22వ తేదీన స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ స్పీకర్‌గా నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడి పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 21 నుంచి ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేలంతా హాజరయ్యేందుకు అవకాశం ఉంటుంది.ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు సభకు వస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

YS Jagan: పేపర్ బ్యాలెట్‌ వాడాలి: మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు


జగన్ నిర్ణయంపై ఆసక్తి..

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వైసీపీ పక్షనేతను ఎన్నుకోవల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఆ పార్టీ పక్షనేతపై స్పష్టత రాలేదు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకపోవడంతో వైసీపీ పక్షనేతగా ఎవరిని పెట్టాలనేదానిపై జగన్ ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. జగన్ కాకపోతే.. సీనియర్ నేత, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వైసీపీ పక్ష నేతగా ఎన్నుకునే అవకాశం లేకపోలేదు. పార్టీ శ్రేణుల్లో విశ్వాసం నింపేందుకు జగన్ వైసీపీ పక్షనేతగా ఉండొచ్చనే మరో చర్చ నడుస్తోంది. ఒకవేళ జగన్ వైసీపీ పక్షనేతగా ఉండకపోతే.. ఓటమితో వెనక్కి తగ్గారనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో ఏర్పడే అవకాశం ఉందని.. దీంతో జగన్ వైసీపీ పక్షనేతగా ఉండాలని పార్టీలో కొందరు నాయకులు కోరుతున్నారట. ఇప్పటివరకు అధికారికంగా జగన్ మాత్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.

Keshineni Chinni: జగన్‌కు ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా మారలేదు: కేశినేని చిన్ని


సభకు వస్తారా..

వైసీపీ అధినేత జగన్‌తో పాటు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు శుక్రవారం సభకు వస్తారా లేదా అనేదానిపై స్పష్టత రాలేదు. ఎమ్మెల్యేలు సభకు హాజరై జగన్ వెళ్లకపోతే ఆయన వెనక్కి తగ్గారనే సందేశం ప్రజల్లోకి వెళ్తుందని.. అందుకే మొత్తం ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండొచ్చని.. సమావేశాలు ముగిసిన తర్వాత స్పీకర్ ఛాంబర్‌లో ప్రమాణ స్వీకారం చేస్తారనే ప్రచారం జరుగుతోంది. లేదంటే ఎమ్మెల్యేలు మాత్రం సభకు వచ్చి ప్రమాణ స్వీ్కారం చేసే అవకాశం ఉందని.. జగన్ మాత్రం ఈనెల 21 నుంచి జరిగే సమావేశాలకు దూరంగా ఉంటారనే మరో చర్చ జరుగుతోంది. జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మరికొద్దిరోజుల్లో తేలనుంది.


Pawan Kalyan: నేడు సచివాలయానికి రానున్న పవన్ కళ్యాణ్

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Jun 18 , 2024 | 02:23 PM