Lakshmiparvati: హిట్లర్ పరిస్థితే టీడీపీ పెద్దలకు కూడా...
ABN , Publish Date - Nov 08 , 2024 | 04:25 PM
Adhrapradesh: హిట్లర్ లాంటి వారే దిక్కూమొక్కు లేకుండా చనిపోయారని.. అలాంటి పరిస్థితే టీడీపీ పెద్దలకు కూడా వస్తుందని వైసీపీ నేత లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల కష్టసుఖాలను పట్టించుకోకుండా జనం మీద కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియా వలనే చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అవినీతి బయటపడుతోందన్నారు.
అమరావతి, నవంబర్ 8: ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu Naidu), కూటమి ప్రభుత్వంపై వైసీపీ సీనియర్ నేత లక్ష్మీపార్వతి (YSRCP Leader Lakshmi Parvati) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఐ టీడీపీ వారు ఎంతో దారుణంగా మహిళలపై కూడా పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తెనాలికి చెందిన గీతాంజలి వీరి పోస్టుల దెబ్బకు ఆత్మహత్య చేసుకుందన్నారు.
Atchannaidu: జగన్‌కు బుద్ధి జ్ఞానం ఉందా.. మంత్రి అచ్చెన్న ఫైర్
హిట్లర్ లాంటి వారే దిక్కూమొక్కు లేకుండా చనిపోయారని.. అలాంటి పరిస్థితే టీడీపీ పెద్దలకు కూడా వస్తుందని వ్యాఖ్యలు చేశారు. ప్రజల కష్టసుఖాలను పట్టించుకోకుండా జనం మీద కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియా వలనే చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అవినీతి బయటపడుతోందన్నారు. తమపైనా అత్యంత దారుణమైన పోస్టులు పెట్టారన్నారు. పేరుకే చంద్రబాబు సీఎం అని.. నడిపేదంతా లోకేషే అని అన్నారు.
ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి తనను బూచిగా చూపించారన్నారు. వైఎస్ విజయమ్మ రాసిన లేఖను కూడా ఫేక్ అని టీడీపీ ట్విట్టర్‌లో పెట్టారన్నారు. చివరికి విజయమ్మ వీడియో చేసి పెట్టాల్సి వచ్చిందని తెలిపారు. తనను ఇంట్లో నుంచి పంపించే కుట్రలు చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవన్నారు. ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ పారిపోయారని దుయ్యబట్టారు. ఇంత దరిద్రపు పాలనను ఎప్పుడూ చూడలేదన్నారు. డీజీపీ ఫెయిల్యూర్ అధికారి అంటూ విమర్శించారు. తన మీద బాలకృష్ణ ఇంటి నుంచే అసభ్యకరమైన పోస్టులు పెట్టారని గతంలో షర్మిల అన్నారని... మరి అప్పుడు కేసులు ఎందుకు పెట్టలేదని లక్ష్మీ పార్వతి ప్రశ్నించారు.
YSRCP: శభాష్ జగన్.. అబద్ధాల్లో నెంబర్ వన్ అంటూ నెటిజన్ల కితాబు..
మరోవైపు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అదుపులోకి తీసుకొని పోలీసులు కోర్టులో హాజరుపరచడం లేదంటూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్‌లు దాఖలయ్యాయి. లంచ్ మోషన్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హాజరయ్యారు. అరెస్ట్ చేసిన వాళ్లకు 41 ఏ నోటీస్ ఇచ్చి పంపుతున్నామని పేర్కొన్నారు. మరి కొందరిని మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరుస్తున్నమని అడ్వకేట్ జనరల్ చెప్పారు. బీఎన్‌ఎస్‌ఎస్‌లోని సెక్షన్ 111 ప్రకారం సైబర్ క్రైమ్, ఆర్గనైజ్డ్ సైబర్ క్రైమ్ లో 41 ఏ నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని ఏజీ పేర్కొన్నారు. అయితే విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, మరో పోలీస్ స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను రేపు (శనివారం) ఉదయంలోపు సీల్డ్ కవర్‌లో ఉంచి మేజిస్ట్రేట్ కోర్ట్‌లో ఇవ్వాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి...
Chennai: రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి రాకెట్ లాంఛర్ లభ్యం
KA Paul: సుప్రీంకోర్టులో కేఏపాల్‌కు చుక్కెదురు
Read Latest AP News And Telugu News