Share News

UP Deputy CM Keshav Prasad Maurya : కుంభమేళాకు రండి

ABN , Publish Date - Dec 08 , 2024 | 05:11 AM

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మహాకుంభ మేళా దేశంలో భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంగా, సంస్కృతికి చిహ్నం గా నిలుస్తుందని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య వ్యాఖ్యానించారు.

 UP Deputy CM Keshav Prasad Maurya : కుంభమేళాకు రండి

  • గవర్నర్‌, చంద్రబాబు, పవన్‌కు యూపీ డిప్యూటీ సీఎం ఆహ్వానం

  • ప్రతి హిందువు పాల్గొనాలని పిలుపు

అమరావతి, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మహాకుంభ మేళా దేశంలో భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంగా, సంస్కృతికి చిహ్నం గా నిలుస్తుందని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అతిపెద్ద భారతీయ ఆధ్యాత్మిక కార్యక్రమమైన మహా కుంభమేళాలో ప్రతి హిందువూ పాల్గొనాల్సిందిగా ఆయన కోరారు. పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళా 2025 జనవరి 13న గంగ, యమున, త్రివేణి నదుల సంగమ క్షేత్రం ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, ప్రయాగ్‌ రాజ్‌ ఎమ్మెల్యే సిద్ధార్థ్‌నాథ్‌ సింగ్‌తో కలిసి శనివారం విజయవాడకు వచ్చారు.

ఏపీ గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌, సీఎం చంద్రబాబును కలిసి కుంభామేళాకు రావాలని కోరారు. అనంతరం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న మౌర్య విలేకర్లతో మాట్లాడుతూ.. కుంభమేళాకు ఏపీ గవర్నర్‌, సీఎం, డిప్యూటీ సీఎం ఇతర ముఖ్యులను ఆహ్వానించామని, కుంభమేళాలో తిరుమల నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు సహకారం కోరామని, ఇచ్చేందుకు సమ్మతి తెలిపారని అన్నారు. ఆయనతో పాటు విజయవాడ పశ్చిమ బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి, పాతూరి నాగభూషణం తదితర బీజేపీ నేతలు పాల్గొన్నారు.

Updated Date - Dec 08 , 2024 | 05:11 AM