Share News

AP Elections 2024: కర్నూల్‌లో ఇంకా ప్రారంభం కానీ పోలింగ్..జనాల ఆగ్రహం..

ABN , Publish Date - May 13 , 2024 | 07:43 AM

ఏపీలో సార్వత్రిక ఎన్నికల (ap elections 2024)) పోలింగ్ ఉదయం 7 నుంచే మొదలు కాగా, పలు చోట్ల ఈవీఎంలు(EVMs) మొరాయిస్తున్నాయి. ఈ క్రమంలోనే కర్నూలు(kurnool)లోని 78వ పోలింగ్ కేంద్రంలో ఇంకా పోలింగ్ ప్రారంభం కాలేదు.

AP Elections 2024: కర్నూల్‌లో ఇంకా ప్రారంభం కానీ పోలింగ్..జనాల ఆగ్రహం..
Kurnool not yet to start the 78th polling

ఏపీలో సార్వత్రిక ఎన్నికల (ap elections 2024) పోలింగ్ ఉదయం 7 నుంచే మొదలు కాగా, పలు చోట్ల ఈవీఎంలు(EVMs) మొరాయిస్తున్నాయి. ఈ క్రమంలోనే కర్నూల్‌(kurnool)లోని 78వ పోలింగ్ కేంద్రంలో ఇంకా పోలింగ్ ప్రారంభం కాలేదు. దీంతో ఓటు వేసేందుకు వచ్చిన ప్రజలు క్యూలైన్లలో నిలబడి వేచి చూస్తున్నారు. దీంతోపాటు జిల్లాలోని పలుచోట్ల కూడా ఈవీఎంలు మోరాయించినట్లు వెలుగులోకి వచ్చింది. ఆ క్రమంలో అధికారులు వాటిని సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.


2024 లోక్‌సభ ఎన్నికల (loksabha election 2024) నాలుగో దశ పోలింగ్ ఈరోజు అంటే మే 13, సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఈ దశలో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 96 సీట్లుకు ఓటింగ్ జరుగుతోంది. నాలుగో దశ సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ, తెలంగాణలో 17, ఉత్తరప్రదేశ్‌లో 13, మహారాష్ట్రలో 11, పశ్చిమ బెంగాల్‌లో 8, మధ్యప్రదేశ్‌లోని 8, మధ్యప్రదేశ్‌లోని 5 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం నుంచే ప్రజలు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు.


ఇది కూడా చదవండి:


AP Elections 2024: రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన మాక్ పోలింగ్

AP News: ఆంధ్రప్రదేశ్ ఎన్నిక‌ల స‌మాచారం...

Read Latest AP News And Telugu News

Updated Date - May 13 , 2024 | 07:44 AM