Srisailam: శ్రీశైలంలో మార్చి 1వ తేదీ నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
ABN , Publish Date - Feb 25 , 2024 | 09:07 AM
నంద్యాల జిల్లా: శ్రీశైలంలో మార్చి 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్బంగా 1వ తేదీ నుంచి 11 వరకు ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలు స్పర్శ దర్శనాలు నిలుపుదల చేస్తున్నట్లు ఈవో పెద్ది రాజు వెల్లడించారు.
నంద్యాల జిల్లా: శ్రీశైలం (Srisailam)లో మార్చి 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు (Mahashivratri Brahmotsavalu) జరగనున్నాయి. ఈ సందర్బంగా 1వ తేదీ నుంచి 11 వరకు ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలు స్పర్శ దర్శనాలు నిలుపుదల చేస్తున్నట్లు ఈవో పెద్ది రాజు (EO Peddi Raju) వెల్లడించారు. బ్రహ్మోత్సవాలలో భక్తుల రద్దీ కారణంగా భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శినానికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములకు మాత్రమే 1వ తేదీ నుంచి 5వ తేదీ సాయంత్రం వరకు నిర్దిష్టవేలల్లో ఉచిత స్పర్శ దర్శనానికి అవకాశం ఉంటుందన్నారు. 5 వ తేదీ సాయంత్రం 7:30 గంటల నుంచి 11వ తేదీ వరకు భక్తులందరికీ శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఉచిత దర్శనంతోపాటు శీఘ్ర, అతి శీఘ్రదర్శనానికి ఆన్‌లైన్, కరెంట్ బుకింగ్‌కు ఏర్పాట్లు చేసినట్లు ఈవో పెద్దిరాజు పేర్కొన్నారు.