AP News: కర్నూల్ జిల్లాలో దారుణం.. వైసీపీపై బీజేపీ అనుమానం..
ABN , Publish Date - Aug 19 , 2024 | 12:11 PM
కర్నూలు జిల్లా: ఆదోని మండలంలో దారుణం జరిగింది. పెద్ద హరివాణం గ్రామంలో ఉప్పర శేకన్న (50) అనే బీజేపీ కార్యకర్తను దుండగులు గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. హత్యకు గురైన వ్యక్తి మూడు రోజుల క్రితం ఎమ్మెల్యే పార్థసారధి ఆధ్వర్యంలో వైసీపీ నుంచి బీజేపీలోకి చేరారు. ఇంటి ముందు పడుకున్న వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు.

కర్నూలు జిల్లా: ఆదోని మండలంలో దారుణం జరిగింది. పెద్ద హరివాణం గ్రామంలో ఉప్పర శేకన్న (50) అనే బీజేపీ కార్యకర్తను (BJP Activist) దుండగులు గొంతు కోసి దారుణంగా హత్య (Murder) చేశారు. హత్యకు గురైన వ్యక్తి మూడు రోజుల క్రితం ఎమ్మెల్యే పార్థసారధి (MLA Parthasaradhi) ఆధ్వర్యంలో వైసీపీ (YCP) నుంచి బీజేపీలోకి చేరారు. ఇంటి ముందు పడుకున్న వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పోస్టు మార్టం నిమిత్తం మృత దేహాన్ని ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పూర్తి వివరాలు..
ఉప్పర శేకన్న రాత్రి ఇంటి ముందు నిద్రస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అతనిపై దాడి చేసి.. కత్తితో గొంతు కోసి పరారయ్యారు. సోమవారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులు చూసేసరికి శేకన్న శవమై మంచంపై ఉండడాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన ప్రదేశానికి వచ్చిన పోలీసులు ఆధారాల కోసం సమీక్షించారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. దుండగుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే పాత కక్ష్యలు కారణంగా ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మొన్నటి ఎన్నికల వరకు వైసీపీలోనే క్రియాశీలకంగా పనిచేసిన శేకన్న పార్టీ మారిన కొద్ది రోజులకే హత్యకు గురికావడం హాట్ టాపిక్‌గా మారింది.
కాగా గ్రామీణ ప్రాంతాల్లో చిన్నపాటి విషయాలకు కూడా గొడవలకు పాల్పడితే చర్యలు తప్పవని ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్ హెచ్చరించారు. ఆదివారం డీఎస్పీ కొత్తపల్లి మండలం గోకవరం గ్రామంలోనని ఎస్సీ కాలనీలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న స్థల వివాద సమస్యపై విచారించారు. గ్రామానికి చెందిన స్వామి యేసు అనే వ్యక్తికి ఎస్సీ కాలనీ వాసులకు ఓ స్థల విషయంలో గత కొన్ని రోజులుగా వివాదం జరుగుతోంది. ఈ విషయాన్ని స్థానిక పోలీసుల ద్వారా తెలుసుకున్న డీఎస్పీ రామాంజి నాయక్ నేరుగా గోకవరం వెళ్లి ఇరువర్గాల మధ్య నెలకొన్న సమస్యను విచారించారు.
ఢిల్లీలో చంద్రబాబు పర్యటన దృశ్యాలు..
లిక్కర్ కేసులో కదులుతున్న డొంక..
ఆపరేషన్ హైడ్రా.. గండిపేటలో కూల్చివేతలు ..
కోల్‌కతా ఘటనపై సుప్రీం సీరియస్...
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News