Share News

Kurnool: మతిస్థిమితం లేని మహిళపై దారుణం..

ABN , Publish Date - Nov 03 , 2024 | 10:18 AM

కర్నూలు జిల్లాలోని గోనెగండ్ల మండలంలో దారుణం జరిగింది. మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారయత్నం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో రాముడు అనే వ్యక్తి ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Kurnool: మతిస్థిమితం లేని మహిళపై దారుణం..

కర్నూలు: ఇటీవల కాలంలో.. ప్రేమ (Love) పేరుతో వేధించడం, లేదంటే అత్యాచారాలకుm (Rape) పాల్పడుతున్న ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువుగా జరుగుతున్నాయి. ఓ వైపు ప్రభుత్వాలు (Governments) నిందితులను కఠినంగా శిక్షిస్తామని చెబుతున్నా.. ఎలాంటి మార్పు కనిపించడంలేదు. దేశ వ్యాప్తంగా ఈ తరహా ఘటనలు ఎక్కువవుతున్న నేపథ్యంలో విచారణ త్వరిగతిన పూర్తిచేసి, నిందితులను కఠినంగా శిక్షించేలా మరిన్ని కఠిన చట్టాలు తీసుకురావాలనే డిమాండ్ వినిపిస్తోంది. మహిళలపై అత్యాచారాలను, హత్యాచారాలను అరికట్టడానికి ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా.. రోజు రోజుకు ఘటనలు పెరగడంపై ప్రజల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

తాజాగా కర్నూలు జిల్లాలోని గోనెగండ్ల మండలంలో దారుణం జరిగింది. మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారయత్నం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో రాముడు అనే వ్యక్తి ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


కాగా గత నెల అక్టోబర్‌, కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమోన్మాది చేసిన పనికి ఓ అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం నగరూరులో ఈ ఘటన జరిగింది. నగరూరుకు చెందిన వీరేశ్ అదే గ్రామానికి చెందిన అశ్విని అనే అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ కొద్ది రోజులుగా వెంటపడుతున్నాడు. తనకు ఇష్టం లేదని చెబుతున్నా కొద్దిరోజులుగా అమ్మాయిని వీరేశ్ వేధిస్తున్నాడు. తాజాగా ఎవరూ లేని సమయం చూసుకుని బాలిక ఉంటున్న ఇంట్లోకి చొరబడిన వీరేశ్ ప్రేమించాలంటూ బలవంతం చేశాడు. ఆ తర్వాత అమ్మాయిపై అత్యాచారయత్నం చేయగా.. బాలిక తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో బలవంతంగా ఆమె నోట్లో పురుగుల మందు పోసి వీరేశ్ పరారయ్యాడు. కుటుంబ సభ్యులు వచ్చి ప్రాణాపాయస్థితిలో ఉన్న అశ్వినిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో బాలిక మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

కర్నూలు జిల్లా ఆస్పరి మండలం నగరూరుకు చెందిన అశ్విని పత్తికొండ మోడల్ స్కూల్‌లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. దసరా సెలవుల్లో ఇంటికి వచ్చింది. గత కొంతకాలంగా అశ్వినిని ప్రేమిస్తున్నానంటూ వీరేశ్ వేధిస్తున్నట్లు తెలుస్తోంది. సెలవులకు ఇంటికి వచ్చిన అశ్వినిని కలిసిన వీరేశ్ తనను ప్రేమించాలని, లేకపోతే చంపేస్తానని బెదిరించారు. తనకు ఇష్టం లేదని చెప్పినా వీరేశ్ వినలేదు. ఇక ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై అత్యాచారానికి యత్నించాడు. అశ్విని ప్రతిఘటించడంతో బలవంతంగా పురుగుమందు తాగించాడు. పెనుగులాటలో వీరేశ్ కు కూడా గాయాలయ్యాయి. ఇక, పొలం పనుల నుంచి వచ్చిన తల్లిదండ్రులు చావు బతుకుల్లో కనిపించిన అశ్వినిని చూసి షాకయ్యారు. వెంటనే ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే అశ్విని మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో.. కన్నీరు మున్నీరవుతున్నారు.. ప్రేమ పేరుతో తన కూతురు వేధింపులకు గురి చేసి, అత్యాచార యత్నం చేసిన ఆ ఉన్మాదిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గోవా నుంచి కలకత్తా వెళ్తున్న విమానానికి బాంబు బెదిరింపు

మచిలీపట్నంలో ముగ్గురు మైనర్ బాలుర మిస్సింగ్ కలకలం..

జగన్‌ను శిక్షించాలా.. వద్దా..: సీఎం చంద్రబాబు

వారికి అదే చివరి రోజు: సీఎం చంద్రబాబు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 03 , 2024 | 10:18 AM