Share News

CM Chandrababu: శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Nov 09 , 2024 | 03:14 PM

Andhrapradesh: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకున్నారు. సీ ప్లెయిన్‌లో విజయవాడ నుంచి బయలుదేరిన ఆయన 45 నిమిషాల్లో శ్రీశైలం చేరుకున్నారు. అక్కడి నుంచి రోప్‌వే ద్వారా ముఖ్యమంత్రి కొండపైకి చేరుకుని స్వామి వారిని దర్శించుకున్నారు.

CM Chandrababu: శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న సీఎం చంద్రబాబు
CM Chandrababu Naidu

నంద్యాల, నవంబర్ 9: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) శ్రీశైలం చేరుకున్నారు. సీ ప్లెయిన్‌లో విజయవాడ నుంచి బయలుదేరిన ఆయన 45 నిమిషాల్లో శ్రీశైలం చేరుకున్నారు. పాతాళగంగ నుంచి రోప్‌వే ద్వారా ముఖ్యమంత్రి కొండపైకి చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎంకు అధికారులు, నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీశైలం చేరుకున్న సీఎంకు అర్చకులు, దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీశైలం శ్రీ బ్రమరాంబ మల్లికార్జున స్వామిని ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శించుకున్నారు. సీఎం వెంట కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు, మంత్రులు ఆనం రాంనారాయణ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి ఉన్నారు.

Ponnam Prabhakar: కులగణనపై మంత్రి పొన్నం ప్రభాకర్ షాకింగ్ కామెంట్స్


కాగా.. ఈరోజు ఉదయం విజయవాడలో సీ ప్లెయిన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. విజయవాడలోని పున్నమిఘాట్ వద్ద సీ ప్లెయిన్‌ను సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. డెమో ప్రారంభం అనంతరం చంద్రబాబు, రామ్మోహన్ నాయుడు, కందుల దుర్గేష్, బీసీ జనార్దన్ రెడ్డి విజయవాడ పున్నమి ఘాట్ నుంచి శ్రీశైలం బయలుదేరి వెళ్లారు. సీ ప్లెయిన్ ప్రారంభోత్సవ సందర్భంగా వివిధ రంగులతో బాణాసంచా విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

KTR: మిత్తీతో సహా చెల్లిస్తాం.. కేటీఆర్ వార్నింగ్


భారీ బందోబస్తు..

మరోవైపు సీఎం రాక సందర్భంగా పున్నమిఘాట్ వద్ద పోలీసులు కట్టుదిట్టమైన బందో బస్తును ఏర్పాటు చేశారు. పోలీసు కమిషనర్‌ ఎస్వీ రాజశేఖరబాబు నిన్న (శుక్రవారం) ఘాట్‌ పరిసరాలను పరిశీలించారు. అయితే పున్నమి ఘాట్ వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పోలీసుల చర్యలతో సందర్శకులు ఇబ్బందులకు గురయ్యారు. ఆంక్షల పేరుతో పోలీసులు ఓవరాక్షన్ చూపిస్తున్నారని సందర్శకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీవీఐపీలు, మంత్రుల సేవలో పోలీసులు తరిస్తున్నారని ఆరోపించారు. సీ ప్లెయిన్ ఫ్లయింగ్ విన్యాసాలు చూడటానికి కూడా పాస్ ఉన్నవారికే అనుమతి ఉందని పోలీసులు చెబుతున్నారు.


ట్రయల్ రన్ సక్సెస్..

అలాగే ఏవియేషన్‌ అధికారులు, సీప్లెయిన్ నిర్వాహకులు, జిల్లా అధికారులు, పోలీసుల సమక్షంలోనే నిన్న (శుక్రవారం) జరిగిన ట్రయల్ రన్ విజయవంతం అయ్యింది. హరిత బెర్మ్‌పార్క్‌లో జరిగిన ఈ విన్యాసాలను చూసేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శుక్రవారం ఉదయాన్నే గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి సీ ప్లెయిన్ తీసుకొచ్చి వాటర్‌జెట్టీ వద్ద నిలిపివేశారు. ఆ తర్వాత గంటకు సెమీ ట్రయల్‌ రన్‌ జరిగింది. నీటిపై విమానం దూసుకుపోవటంతో పర్యాటకులు ఆసక్తిగా చూశారు. ప్రకాశం బ్యారేజీ, బరమ్‌ పార్కు, భవానీ ద్వీపం మీదుగా చక్కర్లు కొట్టింది. అనంతరం శ్రీశైలంకు సీ ప్లెయిన్ చేరుకుంది.


ఇవి కూడా చదవండి..

Trump Tower: హైదరాబాద్‌లో ట్రంప్‌ టవర్లు

Borugadda Anil: పోలీసుల అదుపులో బోరుగడ్డ అనిల్‌

Read Latest AP News And Telangana News

Updated Date - Nov 09 , 2024 | 04:57 PM