మహానందిలో భక్తుల రద్దీ
ABN , Publish Date - Nov 28 , 2024 | 12:18 AM
కార్తీకమాసం సంద ర్భంగా మహానంది ఆలయం బుధవారం భక్తులతో కిటకిటలాడింది.
మహానంది, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): కార్తీకమాసం సంద ర్భంగా మహానంది ఆలయం బుధవారం భక్తులతో కిటకిటలాడింది. తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి దైవదర్శనం కోసం వచ్చిన భక్తులతో పాటు అయ్యప్పమాల స్వీకరించిన భక్తులతో కిటకిటలాడింది. ఆలయం ప్రాంగణం లోని కోనేర్లల్లో భక్తులు కార్తీక పుణ్య స్నానాలు ఆచరించిన తర్వాత మహానందీశ్వరుడిని దర్శించుకు న్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు మహానంది క్షేత్ర పరిసరాలు భక్తుల శివనామస్మరణతో మార్మోగాయి.