Share News

ఘనంగా సీపీఐ శత జయంతి ఉత్సవాలు

ABN , Publish Date - Dec 26 , 2024 | 11:41 PM

పట్టణంలో సీపీఐ శత జయంతి ఉత్సవాలను గురువారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా సీపీఐ శత జయంతి ఉత్సవాలు
నందికొట్కూరులో ర్యాలీ నిర్వహిస్తున్న సీపీఐ నాయకులు

నందికొట్కూరు, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): పట్టణంలో సీపీఐ శత జయంతి ఉత్సవాలను గురువారం ఘనంగా నిర్వహించారు. సీపీఐ కార్యాలయం వద్ద పతాకావిష్కరణ చేసి పటేల్‌ సెంటర్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ కూడా సీపీఐ నాయకులు పతాకావిష్కరణ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రఘురామ్మూర్తి, పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ భూమికోసం, భుక్తి కోసం సామాజిక న్యాయం కోసం అణగారిన వర్గాల ఆశయాల సాధనకు నిరంరం పోరాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై అలుపెరగని పోరాటాలు నిర్వహిస్తూ వంద సంవత్సరంలోకి సీపీఐ అడుగుపెడుతోందని అన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు రాముడు, మౌలాలి, శ్రీనివాసులు, ఏఐటీయూసీ నాయకులు వీరస్వామి, పోచయ్య, షేక్షావలి, రామాంజనేయులు, చిన్న రాంబాబు, ఏఐఎస్‌ఎఫ్‌ తాలుకా కార్యదర్శి దినేష్‌, వెంకటేష్‌, ఏపీ మహిళా సమాఖ్య పట్టణ నాయకులు శ్రావణి, మధులత, గీత తదితరులు పాల్గొన్నారు.

ఆత్మకూరు(ఆంధ్రజ్యోతి): ఆత్మకూరు పట్టణంలో గురువారం సీపీఐ శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ పార్టీ తాలుకా కార్యదర్శి ప్రతాప్‌ నేతృత్వంలో పార్టీ శ్రేణులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా స్థానిక సీపీఐ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. 1925 డిసెంబరు 26న కాన్పూర్‌లో సీపీఐ ఆవిర్భావమై నేటితో వందేళ్లు పూర్తి చేసుకోవడం సంతోషకరమని అన్నారు. వందేళ్ల సీపీఐ ప్రస్థానంలో పేద బడుగు, బలహీన వర్గాల సంక్షేమం అనేక ఉద్యమాలు, పోరాటాలు చేసినట్లు గుర్తుచేశారు. నాయకులు అహ్మద్‌హుసేన్‌, చాంద్‌బాషా, లల్లు, ఖాదర్‌వలీ, మస్తాన్‌, స్వాతి, ముర్తుజాబీ తదితరులు ఉన్నారు.

Updated Date - Dec 26 , 2024 | 11:41 PM