Share News

వసతి గృహాల తనిఖీ

ABN , Publish Date - Aug 29 , 2024 | 12:39 AM

పాములపాడులోని వసతి గృహాలను ఎంపీడీవో గోపీకృష్ణ, డిప్యూటీ తహసీల్దార్‌ పఠాన్‌బాబు బుధవారం తనిఖీ చేశారు.

వసతి గృహాల తనిఖీ
పాణ్యం: మధ్యాహం భోజనాన్ని పరిశీలిస్తున్న డీపీవో

పాములపాడు, ఆగస్టు 28: పాములపాడులోని వసతి గృహాలను ఎంపీడీవో గోపీకృష్ణ, డిప్యూటీ తహసీల్దార్‌ పఠాన్‌బాబు బుధవారం తనిఖీ చేశారు. స్థానిక ఎస్సీ బాలికల వసతిగృహం, కేజీబీవీ, మోడల్‌ స్కూల్‌లోని వసతి గృహాలను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. వసతి గృహాల్లోని సమస్యలు, చేపట్టా ల్సిన పనులు, కావాల్సిన సామగ్రి తదితర వివరాలను తెలుసుకొన్నారు. వాటి నివేదికలను ఉన్న తాధికారు లకు పంపుతామని తెలిపారు. కేజీబీవీ ప్రిన్సిపాల్‌, రాజ్యలక్ష్మి, మోడల్‌స్కూల్‌ ప్రిన్సిపాల్‌ నాగ రవీంద్ర, ఎస్సీ బాలికల హాస్టల్‌ వార్డెన్‌ అనిత పాల్గొన్నారు.

శ్రీశైలం: శ్రీశైలం దేవస్థానం పరిధిలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని స్థానిక ఎమ్మార్వో బుధవారం తనిఖీ చేశారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు తహసీల్దార్‌ కేవీ శ్రీనివాసులు తెలిపారు. విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి వార్డెన్‌ వెంకటేశ్వర్లు వివరించారు. తనిఖీల్లో భాగంగా విద్యార్థులకు కల్పిస్తున్న సదుపాయాలు, తాగునీరు, భోజనం మొదలైన వాటిని తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో ఆర్‌వో ప్లాంట్‌ను మరమ్మతులు అవసరమని తగు నివేదికను కలెక్టర్‌కు పంపించనున్నట్లు తెలిపారు.

కొత్తపల్లి: ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాల కల్పన కోసం ప్రతిపాదనలు పంపనున్నట్లు తహసీల్దార్‌ ఉమారాణి తెలిపారు. బుధవారం తహసీల్దార్‌ ఉమారాణి డిప్యూటీ తహసీల్దార్‌ పెద్దన్నతో కలిసి మండలంలోని శివపురం గిరిజన ఆశ్రమ పాఠశాలను, కొత్తపల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను సందర్శించి అక్కడి విద్యార్థులకు కావాల్సిన కనీస సౌకర్యాలపై స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు.

పాణ్యం: స్థానిక సంక్షేమ వసతిగృహాలను బుధవారం జిల్లా పంచాయతీ అధికారి మంజులావాణి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఏపీ గిరిజన గురుకలు బాలుర పాఠశాలలోని సమస్యలను తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యార్థులకు సరైన వసతులు లేకపోవడ ం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలకు సుగాలిమెట్ల వద్ద ఐదెకరాల స్థలాన్ని ప్రభుత్వం మంజూఉ చేసిందని ప్రిన్సిపాల్‌ కృష్ఱానాయక్‌ తెలిపారు. ఇరుకు గదుల్లో తరగతులు, నివాసాలను డీపీవో పరిశీలించారు. సంక్షేమ గృహాన్ని గురుకుల పాఠశాలగా మార్చడంతో విద్యార్థులకు సౌకర్యాలు కరువ య్యాయన్నారు. పాఠశాల నుంచి బయటికి వెళ్లే మురుగుకు సరైన డ్రైనేజీ లేదన్నారు. పాఠశాల భవన నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తే తప్ప విద్యార్థులకు సౌకర్యాలు ఉండవని పేర్కొన్నారు. అనంతరం సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని పరిశీలించారు. వసతి గృహానికి ప్రహారీ లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వార్డెన్‌ తెలిపారు. వసతి గృహాలలోని ఆహార పదార్థాలను ఆమె పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం పంపిణీ చేయాలని ఆమె ఆదేశించారు. సర్పంచ్‌ పల్లవి, ఉపసర్పంచ్‌ చంద్రశేఖరరెడ్డి, ఈఓఆర్‌డీ సులోచన, పంచాయతీ కార్యదర్శి ఆనందరావు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Aug 29 , 2024 | 12:39 AM