AP News: వాన పడింది.. వజ్రాల వేట మొదలైంది..
ABN , Publish Date - May 18 , 2024 | 07:53 AM
చినుకు పడిందంటే రైతులకే కాదు.. మరికొందరికి కూడా ఆనందమే. అక్కడి ప్రజలు వరుణుడి కరుణ కోసం రైతుల కంటే ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారు. వరుణుడి రాక తమ జీవితాల్లో వెలుగును తీసుకొస్తుందని ఆశగా ఆకాశం వంక ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతకీ వారెవరంటారా? కర్నూలు జిల్లాతో పాటు దాని పరిసర ప్రాంత ప్రజలు.
కర్నూలు : చినుకు పడిందంటే రైతులకే కాదు.. మరికొందరికి కూడా ఆనందమే. అక్కడి ప్రజలు వరుణుడి కరుణ కోసం రైతుల కంటే ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారు. వరుణుడి రాక తమ జీవితాల్లో వెలుగును తీసుకొస్తుందని ఆశగా ఆకాశం వంక ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతకీ వారెవరంటారా? కర్నూలు జిల్లాతో పాటు దాని పరిసర ప్రాంత ప్రజలు. వారికి ఏమవసరం అంటే.. వజ్రాల దొరుకుతాయని ఓ నమ్మకం. గతంలోనూ ఇలా దొరికిన సందర్భాలు కోకొల్లలు. రెండు రోజులుగా తొలకరి జల్లులు కురవడంతో ఇక్కడి ప్రజలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. వెంటనే కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరికి వెళ్లి వజ్రాల అన్వేషణను ప్రారంభించారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు వజ్రాల వేట సాగుతోంది. ఒక్క వజ్రం దొరికితే తమ తలరాత మారిపోతుందన్న ఆశతో వజ్రాలు వెదుకుతున్నారు. ప్రతి ఏటా ఇక్క డ వజ్రాలు దొరుకుతాయి. గతేడాది కోట్ల విలువ చేసే వజ్రాలు దొరకడంతో ఈఏడాది వజ్రాల కోసం జనం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మరోవైపు దొరికిన వజ్రాలను కొనేందుకు వ్యాపారులు సైతం సమీపాప ప్రాంతాల్లో తిష్ట వేశారు. ఇదిలా ఉంటే తొలకరి జల్లులు కురవడంతో రైతులు సేద్యం పనుల్లో బిజిబిజీగా ఉన్నారు. జనం వజ్రాల అన్వేషణకు రావడంతో రైతులకు సేద్యం పనులకు ఆటంకం కలుగుతోంది. కొంత మంది రైతులు జనం వారి పొలాల్లోకి రాకుండా కాపలాదారులను నియమించు కున్నారు. మరికొందరు రైతులు తమ గ్రామంలోకి వజ్రాల వేటకు రావద్దని బోర్డులు ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి..
Jagan : లగ్జరీ ఫ్లైట్‌లో పేదింటి బిడ్డ!
Read more AP News and Telugu News