Share News

వైభవంగా కొనసాగుతున్న కార్తీక మాసోత్సవాలు

ABN , Publish Date - Nov 14 , 2024 | 12:27 AM

శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా కొనసాగు తున్నాయి.

వైభవంగా కొనసాగుతున్న కార్తీక మాసోత్సవాలు
శ్రీశైలంలో ఆకాశ దీపోత్సవాన్ని నిర్వహిస్తున్న అర్చకులు, పాల్గొన్న అధికారులు

శ్రీశైలం, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. కార్తీకమాసం పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. సాయంత్రం ఆలయ ధ్వజస్తభం వద్ద ఆకాశ దీపం కార్యక్ర మాన్ని నిర్వహించారు. కార్తీకమాసోత్సవాల సంద ర్భంగా దేవస్థానంలో అఖండ శివ భజనలు నిర్వహిస్తున్నారు.

శ్రీశైల క్షేత్రంలో బుధవారం త్రయోదశి ఘడియలను పురస్కరించుకొని సాయంప్రదోషకాలంలో ఆలయంలోని మల్లికార్జునస్వామికి అభిముఖంగా కొలువైవున్న నందీశ్వర స్వామికి పరోక్షసేవగా విశేష అభిషేకం, అర్చనలు జరిపిం చారు. లోకకల్యాణార్థం సాక్షిగణపతికి, ఆలయ ప్రాంగణం లోని జ్వాలా వీరభద్రస్వామికి విశేష అభిషేక పూజలు నిర్వహించారు. శ్రీశైల దేవస్థానం ధర్మపథంలో భాగంగా నిర్వహిస్తున్న నిత్యకళారాధన కార్యక్రమంలో బుధవారం సాయంత్రం విజయవాడకు చెందిన గాయత్రి నృత్య నికేతన్‌ బృందంతో సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.

మహానంది: మహానంది క్షేత్రంలో బుధవారం కార్తీక సందడి నెలకొంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాక కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి వేలాదిమంది భక్తులు మహానందీశ్వరుడి దర్శనం కోసం తరలివచ్చారు. ఆలయం ముందు భాగంలోని సుపతి మంటపాల పరిసరాలతో పాటు ప్రధాన రాజగోపురం వద్ద కోటి దీపోత్సవంను జరిపేందుకు దేవస్ధానం ఇంజనీరింగ్‌ అధికారి శ్రీనివాసులు యాదవ్‌, పసుపుల సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది ఏర్పాట్ల పనులను పర్యవేక్షించారు.

Updated Date - Nov 14 , 2024 | 12:27 AM