Share News

శ్రీగిరిపై కార్తీక శోభ

ABN , Publish Date - Nov 27 , 2024 | 12:11 AM

శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీకమాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.

శ్రీగిరిపై కార్తీక శోభ
ఆకాశ దీపోత్సవాన్ని నిర్వహిస్తున్న అర్చకులు

శ్రీశైలం, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీకమాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తులు దీపారాధనలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు దేవస్థానం అధికారులు నిరంతరం తాగునీరు, అల్పాహారం అందజేశారు. దర్శనానంతరం భక్తులకు అన్నదాన భవనంలో ఉదయం 10.30 నుంచి 3.30 వరకు భక్తులకు అన్నప్రసాద వితరణ, సాయంత్రం 6 గంటల నుంచి అల్పాహారం అందజేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆయా సదుపాయాలను కల్పించేందుకు అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

ఆకాశ దీపోత్సవం: ఆలయ ప్రాంగణంలో ఆకాశదీపం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ ఆకాశదీప కార్యక్రమంలో దీప ప్రజ్వలనకు ముందుగా అర్చకులు సంక ల్పాన్ని పఠించారు. అనంతరం కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగాలని గణపతి పూజను నిర్వహించి, దీపప్రజ్వలన, దీపారాధనలను జరిపారు.

విశేష పూజలు: శ్రీశైలం మహాక్షేత్రంలో మంగళవారం లోకకళ్యాణార్థం ఆలయ ప్రాంగణంలోని సుబ్రహ్మణ్య (కుమారస్వామి) స్వామికి, నందీశ్వరస్వామికి, బయలు వీరభద్రస్వామికి విశేష పూజలు నిర్వహించారు.

Updated Date - Nov 27 , 2024 | 12:11 AM