Free bus travel: ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి బీసీ జనార్ధన్ కీలక స్టేట్‌మెంట్
ABN , Publish Date - Nov 01 , 2024 | 12:03 PM
Andhrapradesh: ఈరోజు నుంచి దీపం పథకం మొదలుకానున్న నేపథ్యంలో మరో పథకంపై మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఇప్పటికే పెంచిన పింఛన్లను పంపిణీ చేస్తున్నామని.. ఇక దీపం పథకాన్ని మొదలు పెడుతున్నామని తెలిపారు. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు.
నంద్యాల, నవంబర్ 1: ఏపీలో మహిళలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉచిత బస్సు ప్రయాణంపై రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి (Minister BC Janardhan Reddy) కీలక ప్రకటన చేశారు. ఈరోజు నుంచి దీపం పథకం మొదలుకానున్న నేపథ్యంలో మరో పథకంపై మంత్రి గుడ్ న్యూస్ చెప్పారు. సంక్రాంతి లోపల ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని వెల్లడించారు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఇప్పటికే పెంచిన పింఛన్లను పంపిణీ చేస్తున్నామని.. ఇక దీపం పథకాన్ని మొదలు పెడుతున్నామని తెలిపారు.
CM Revanth: మూసీ ప్రాజెక్ట్‌పై సీఎం రేవంత్ కసరత్తు
అలాగే సంక్రాంతి లోపల ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఉద్యోగాలు కల్పించేందుకు ఎన్నో పరిశ్రమలు తీసుకొస్తున్నామన్నారు. తల్లికి చెల్లికి న్యాయం చేయలేని జగన్.. చంద్రబాబు ప్రభుత్వంపై మాట్లాడే అర్హత లేదన్నారు. ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ ఎన్ని మాటలు చెప్పినా జనం నమ్మరన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా ప్రభుత్వానికి ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉందని తెలిపారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కని జగన్ ఏవేవో ఊహించుకొని మాట్లాడుతున్నారన్నారు. రెండు రోజులు ఏపీలో.. ఆరు రోజులు బెంగళూరు ప్యాలెస్‌లో ఉండే జగన్‌కు ప్రజల గురించి ఏం తెలుసు అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. గుంతలు లేని రాష్ట్రంగా చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (శనివారం) విజయనగరంలో గుంతలు పూడ్చే కార్య క్రమాన్ని ప్రారంభిస్తారన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో భారీ కుంభకోణం జరిగిందన్నారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళ నినాదంతో ముందుకు వెళుతున్నామని మంత్రి బీసీ జానార్ధన్ పేర్కొన్నారు.
Rice Vs Roti: అన్నం లేదా చపాతీ.. రెండింటిలో ఏది ఆరోగ్యమంటే..
అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం: నారాయణ
నెల్లూరు: వాలంటీర్లు లేకుండా ఒకటవ తేదీ ఫించన్లు ఇవ్వడం అసాధ్యమని వైసీపీ వాళ్లు అన్నారని మంత్రి నారాయణ అన్నారు. ఖజానాలో డబ్బులేకున్నా రూ.3 వేలు ఫించను రూ.4వేలుకు పెంచామని.. మొదటి తేదీనే 98 శాతం ఫించన్లు అందిస్తున్నామని తెలిపారు. పేదలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడంపై మహిళలు చాలా సంతోషిస్తున్నారన్నారు. ఇంత త్వరగా ఇవ్వలేరనుకున్నామని చెబుతున్నారన్నారు. ఏపీలో ప్రతిపక్ష పార్టీ లేదన్నారు. ప్రజలు ఆ హోదా కూడా ఇవ్వలేదని తెలిపారు. ఇసుక మీద రచ్చ చేస్తున్నారని మండిపడ్డారు. ధరలు తగ్గిపోయాక ఆందోళనలు చేశారని విమర్శించారు. ఎన్జీటీ అక్టోబర్ 15వ తేదీ వరకు నదుల్లో ఇసుక తవ్వకాలు కూడా జరపకూడదని ఆదేశాలిచ్చిందన్నారు. నగరంలో మరో నాలుగు రీచ్‌లు ఓపెన్ చేస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Lokesh: అమెరికా పర్యటన ముగించుకుని ఏపీకి బయలుదేరిన నారా లోకేష్
AP Pension: ఏపీలో వేగంగా సాగుతున్న పెన్షన్ల పంపిణీ
Read latest AP News And Telugu News