Share News

TG Bharath: మంత్రి నిమ్మల వల్లే అది సాధ్యం

ABN , Publish Date - Nov 04 , 2024 | 04:21 PM

Andhrapradesh: ఎన్నికల్లో జనసేన, బీజేపీ కూడా బాగా పని చేశాయని మంత్రి టీజీ భరత్ అన్నారు. తమతో పని చేయించుకునే హక్కు కూటమి శ్రేణులకు ఉందని.. కార్యకర్తలు వెంటపడి మరీ పని చేయించుకోవాలన్నారు. జిల్లా నుంచి 2.50 లక్షల మంది వలసలు వెళ్తున్నారన్నారు. వచ్చిన ప్రతి పారిశ్రామిక వేత్తను కర్నూలులో పరిశ్రమలు పెట్టమని అడుగుతున్నామన్నారు.

TG Bharath: మంత్రి నిమ్మల వల్లే అది సాధ్యం
Minister TG Bharath

కర్నూలు, నవంబర్ 4: వైసీపీ ప్రభుత్వం ఉండి ఉంటే బుడమేరు గండ్లు పూడ్చడం అంతా ఆశామాషి కాదని.. మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) వల్లే సాధ్యమైందని మంత్రి టీజీ భరత్ (Minister TG Bharath) అన్నారు. కర్నూలులోని మౌర్య హోటల్‌లో టీడీపీ, బీజేపీ, జనసేన ఎన్డీఏ కూటమి పక్షాల నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబు పొలిటికల్ గవర్నేన్స్ అన్నారని.. ఏ పని ఉన్నా పక్కాగా చేయాలని అన్నారన్నారు.

Pawan Kalyan: ఇలా చేస్తే నేనే హోం మంత్రిని అవుతా.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు


ఎన్నికల్లో జనసేన, బీజేపీ కూడా బాగా పని చేశాయని చెప్పుకొచ్చారు. తమతో పని చేయించుకునే హక్కు కూటమి శ్రేణులకు ఉందని.. కార్యకర్తలు వెంటపడి మరీ పని చేయించుకోవాలన్నారు. జిల్లా నుంచి 2.50 లక్షల మంది వలసలు వెళ్తున్నారన్నారు. వచ్చిన ప్రతి పారిశ్రామిక వేత్తను కర్నూలులో పరిశ్రమలు పెట్టమని అడుగుతున్నామన్నారు. 20 ఏళ్లు టీడీపీ కూటమి ప్రభుత్వం ఉండాలని ఆకాంక్షించారు. చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకొని ముందుకు వెళ్లాలన్నారు. ‘‘ మన ఓటమి కోసం పని చేసిన వాళ్లను జనసేన, బీజేపీ పార్టీల్లో సెల్టర్ కోసం వెళ్తున్నారు.. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి’’ అని మంత్రి టీజీ భరత్ సూచించారు.


వెంటిలేటర్‌పైన వైసీపీ: నిమ్మల

Minister-Nimmala.jpg

కర్నూలు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా రావడం అదృష్టంగా భావిస్తున్నానని.. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే స్వభావం రాయలసీమ వారిదని జిల్లా ఇంచార్జీ మంత్రి, ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. వెనకబడిన కర్నూలు జిల్లాకు సేవలు అందించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. 93 శాతం స్ట్రైక్ రేటులో ఎలా గెలిచామో.. రాబోయే ఎన్నికల్లో కూడా అదే స్ట్రైక్ రేట్ రావాలన్నారు. వైసీపీ వెంటిలేటర్ పైన ఉందని.. అబద్దాల బ్రతుకే జగన్ జీవనమంటూ వ్యాఖ్యలు చేశారు. నాయకు మధ్య.. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ సోషల్ మీడియా పని చేస్తోందని మండిపడ్డారు. నీటి సంఘాల ఎన్నికల్లో మూడు దశల్లో ఉంటాయని... అన్నింటా గెలవాలన్నారు. సాగునీటి సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ, ప్రాజెక్టు కమిటీ ఎన్నికల్లో 6 వేల పదవులు భర్తీ అవుతాయని.. ఇప్పటి నుంచే నాయకులు సన్నధం కావాలని పిలుపునిచ్చారు.


కో-ఆపరేటీ సంఘాలకు ఎన్నికలు వెళ్లాలని కూడా ఉందన్నారు. ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. ఇసుక వ్యాపారం చేయరాదని.. అమల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం ఇష్టానుసారంగా లూటీ చేయడంతో గ్రీన్ ట్రిబ్యునల్ కేసుల వల్ల కొన్ని ఇబ్బందులు పడుతున్నామన్నారు. గోదావరి జిల్లాలో ఒక్కో రీచ్‌కు రూ.30 కోట్లు కట్టేలా గత ప్రభుత్వంలో చేసిందని.. ఆ డబ్బును కట్టలేక కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు ఉన్నాయన్నారు. అక్రమ వ్యాపారం చేస్తే తన మన అన్న బేదం లేకుండా అందరిపై చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారన్నారు.

AP News: అత్తాకోడలిపై గ్యాంగ్‌రేప్ ఘటనలో కీలక మలుపు


‘‘ ఇరిగేషన్ ప్రాజెక్టులు అవసరం ఉంది. 8 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. 2 లక్షల ఎకరాలకు నీళ్లు అందడంలే. నాడు ఎన్టీఆర్.. నేడు చంద్రబాబు నీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చారు. అసంపూర్తిగా ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. హంద్రీనీవా ప్రాజెక్టుకు వైసీపీ చేసింది జీరో.. 2021లో టెండర్లలో పిలిచి మూడు రూపాయల పని చేయలేదు. ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. మన ప్రభుత్వం రాగానే రూ. 2500 కోట్లు మంజూరు చేసి.. తక్షణమే పనులు చేపట్టామన్నారు. వేదావతి, గుండ్రేవుల, ఆర్డీఎస్, హంద్రీ నీవా డిస్ట్రిబ్యూషన్, అలగనూరు, గాజులదిన్నె, గురురాఘవేంద్ర ప్రాజెక్టు.. వీటిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది’’ అని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రులు టీజీ భరత్, నిమ్మల రామానాయుడితో పాటు కూటమి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి..

AP TET Results: ఏపీ టెట్ ఫలితాలు విడుదల

IRCTC: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. టికెట్‌ బుకింగ్‌, ట్రాకింగ్‌ కోసం ఐఆర్‌సీటీసీ సూపర్‌ యాప్‌..

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 04 , 2024 | 04:44 PM