వైభవంగా పల్లకీ ఉత్సవం
ABN , Publish Date - Dec 14 , 2024 | 12:24 AM
మహానంది క్షేత్రంలో శుక్రవారం రాత్రి పల్లకీ ఉత్సవాన్ని ఆలయ వేదపండితులు, అర్చకులు వైభవంగా నిర్వహించారు.
మహానంది, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): మహానంది క్షేత్రంలో శుక్రవారం రాత్రి పల్లకీ ఉత్సవాన్ని ఆలయ వేదపండితులు, అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని కల్యాణ మంటపంలో పూలతో అలంకరించిన పల్లకిపై స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆశీనులు చేశారు. వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు నౌడూరి నాగేశ్వరశర్మ, హనుమంత్‌శర్మ, భక్తులు పాల్గొన్నారు.