వైభవంగా పల్లకీ ఉత్సవం
ABN , Publish Date - Dec 08 , 2024 | 11:52 PM
శ్రీశైల క్షేత్రంలో ఆదివారం లోకకళ్యాణార్థం స్వామి, అమ్మవార్లకు పల్లకీ ఉత్సవం వైభవంగా నిర్వహించారు.
శ్రీశైలం, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల క్షేత్రంలో ఆదివారం లోకకళ్యాణార్థం స్వామి, అమ్మవార్లకు పల్లకీ ఉత్సవం వైభవంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వ చన మండపంలో నిర్వహించిన ఈ పూజా కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహా గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. తరువాత స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు శాస్రోక్తంగా షోడశోపచార పూజలు చేసి పల్లకీలో ఆశీనులను జేసి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఘనంగా ఉత్సవాన్ని నిర్వహించారు.