నందీశ్వర స్వామికి ఆర్జిత సేవ
ABN , Publish Date - Oct 16 , 2024 | 12:51 AM
శ్రీశైల క్షేత్రంలో మంగళవారం త్రయోదశి ఘడియ లను పురస్కరించుకొని సాయంప్రదోషకాలంలో ఆలయంలోని మల్లికార్జునస్వామికి అభి ముఖంగా కొలువైవున్న నందీశ్వరస్వామికి పరోక్ష సేవగా విశేష అభిషేకం, అర్చనలు జరిపించారు.
శ్రీశైలం, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): శ్రీశైల క్షేత్రంలో మంగళవారం త్రయోదశి ఘడియ లను పురస్కరించుకొని సాయంప్రదోషకాలంలో ఆలయంలోని మల్లికార్జునస్వామికి అభి ముఖంగా కొలువైవున్న నందీశ్వరస్వామికి పరోక్ష సేవగా విశేష అభిషేకం, అర్చనలు జరిపించారు. పూజా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహా గణపతి పూజ నిర్వహించారు. అభిషేకానం తరం నందీశ్వర స్వామికి నూతన వస్త్రసమర్పణ, విశేష అర్చనలు నిర్వహించారు. శ్రీశైల క్షేత్రానికి స్వయంగా విచ్చేయలేని భక్తులు వారి గోత్రనామాలతో పూజలలో పాల్గొనేందుకు దేవస్థానం పరోక్షసేవల ద్వారా అవకాశం కల్పించింది. భక్తులు ఈ పరోక్షసేవలో పాల్గొనేందుకు దేవస్థానం వెసైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.శ్రీశైలదేవస్థానం.ఓఆర్‌జీ ద్వారా ఒక్కో పూజకు రూ. 1,116 సేవా రుసుమును చెల్లించి పాల్గొనవచ్చును. సేవాకర్తలే కాకుండా, భక్తులందరూ కూడా నందీశ్వరస్వామి ఆర్జిత పరోక్షసేవ పూజా కార్యక్రమాన్ని శ్రీశైల టీవీ లేదా యూట్యూబ్ ద్వారా వీక్షించవచ్చును.
ఆలయ ప్రాంగణంలోని సుబ్రహ్మణ్య (కుమారస్వామి) స్వామికి, బయలు వీరభద్రస్వామికి విశేష పూజలు నిర్వహిం చారు. నిత్యకళారాధనలో మంగళవారం నల్గొండకు చెందిన హైందవిరెడ్డి బృందంతో సంప్రదాయ నృత్యప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.